piligrims rush
-
మోదీ గుహకు భారీ డిమాండ్
డెహ్రాడూన్: గత నెల ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ధ్యా నం చేసిన గుహకు ఇప్పుడు భక్తులు, యాత్రికుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే జులై నెలంతా బుక్కైపోగా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లలో కూడా కొన్ని తేదీలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఈ గుహ కేదార్నాథ్ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. మే 18న ప్రధాని ఈ గుహను సందర్శించిన తర్వాత ఇప్పటి వరకు ఈ గుహ ఒక్క రోజు కూడా ఖాళీగా లేదని జనరల్ మేనేజర్ బీ ఎల్ రానా వెల్లడించారు. ఈ గుహలో ధ్యానం చేయాలనుకునేవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే అనుమతిస్తారు. గుహ రుసుము ఒకరోజుకు 990 రూపాయలు. అంతేకాక, అలాంటి గుహలు ఏర్పాటు చేయడానికి అక్కడే మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు.గత ఐదేళ్లలో ప్రధాని మోదీ నాలుగు సార్లు కేదార్ నాథ్‌ను దర్శించుకున్నారు. దాంతో పాటు అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడంతో యాత్రికుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు ఏడున్నర లక్షల మంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. గత నెల 9న తెరుచుకున్న ఈ ఆలయం అక్టోబర్ వరకు తెరచి ఉంటుంది. అప్పటి వరకు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో చూడాలి. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 89,237 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.62 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఆధికారులు తెలిపారు. -
తిరుమల సమాచారం
చిత్తూరు: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 70,357 మంది భక్తులు దర్శించుకున్నారు.