pilots strike
-
పైలట్ల సమ్మె... లుఫ్తాన్సా విమానాలు రద్దు
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం పైలట్లు ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ విమానాలు ప్రపంచమంతటా నిలిచిపోయాయి. వందలాది విమానాల రాకపోకలను లుఫ్తాన్సా యాజమాన్యం రద్దు చేసింది. వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిచాలన్న డిమాండ్లతో పైలట్లు తమ విధులను బహిష్కరించారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు రద్దయ్యాయి. టర్మినల్–3 వద్ద దాదాపు 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎయిర్‌పోర్టు బయట ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే రుసుము తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు. ప్రయాణికుల్లో చాలామంది విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాసేపు వేచి చూసి, చేసేది లేక ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అతిత్వరలో విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని లుఫ్తాన్సా ప్రతినిధులు వెల్లడించారు. -
800 లుఫ్తాన్సా ఫ్లైట్స్ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు
న్యూఢిల్లీ: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు పైలట్ల మెరుపు సమ్మె సెగ తగిలింది. లుఫ్తాన్సా పైలట్ల యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు అన్ని ప్రయాణీకుల, కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందుల్లో పడిపోయారు. దాదాపు 800 విమానాలు రద్దు కానున్నాయని లుఫ్తాన్సా వెల్లడించింది. వేసవి సెలవుల ముగింపు తరువాత తిరిగొచ్చే అనేక మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది. అయితే తన బడ్జెట్ క్యారియర్ యూరోవింగ్స్ ప్రభావితం కాదని లుఫ్తాన్సా పేర్కొంది. పైలట్ల సమ్మె ప్రభావాలను తగ్గించడానికి సాధ్యమైనదంతా చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించినా ప్రయాణీకులకు ఇబ్బందులుత ప్పలేదు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 డిపార్చర్ గేట్ 1 వద్ద దాదాపు 150 మంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఫ్రాంక్ఫర్ట్ , మ్యూనిచ్ నుండి రెండు లుఫ్తాన్స విమానాలు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల బంధువులు ఆందోళనలో పడిపోయారు. డబ్బు వాపసు ఇవ్వండి లేదా తమ వారికి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర విమానయాన సంస్థల ద్వారా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. కాగా వేతనాల పెంపును కోరుతూ లుఫ్తాన్సా పైలట్లు అకస్మాత్తుగా భారీ సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినక కారణంగా సమ్మె తప్ప లేదని పైలట్ల సంఘం వెల్లడించింది. అయితే కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల జీతాలను 900 యూరోల (900 అమెరికా డాలర్లు) ఒక్కసారిగా పెంచింది. సీనియర్ పైలట్లకు 5 శాతం, కొత్తవారికి వారికి 18 శాతం పెంపును ప్రకటించింది. కనీ 2023లో అధిక ద్రవ్యోల్బణం అంచనాల నేపథ్యంలో ఈ సంవత్సరం 5.5 శాతం పెంచాలని పైలట్లు యూనియన్ డిమాండ్ చేస్తోంది. Delhi | Crowd of approx 150 people gathered on main road in front of departure gate no.1, Terminal 3, IGI Airport, around 12 am, demanding refund of money or alternate flights for their relatives as 2 Lufthansa flights bound to Frankfurt & Munich were cancelled: DCP, IGI Airport https://t.co/V2PQBWBErD — ANI (@ANI) September 2, 2022 Students' Strike at IGI Airport Delhi, as Lufthansa cancels two flights to Germany and they ain't finding a solution, Students are in panic as most are colleges are starting from 6th and they ain't rebooking before 10th sept. @PMOIndia@JM_Scindia @lufthansa #shameonlufthansa pic.twitter.com/dkAW8LwAPL — Kuntal parmar (@Kunnntal) September 1, 2022 -
పైలట్ల సమ్మె : అన్ని విమానాలు రద్దు
లండన్ : బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ కు భారీ షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చెందిన సుమారు నాలుగువేల మంది పైలెట్లు ఉన్నపళంగా సంచలన నిర్ణయం తీసుకోవడంతో భారీ ఇబ్బందుల్లో పడింది. వేతన సవరణకుసంబంధించిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిరసిస్తూ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. దాదాపు అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని బ్రిటిష్ ఎయిర్వేస్ (బిఎ) సోమవారం (సెప్టెంబర్ 9) ఒక ప్రటనలో తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలమని, క్షమించమని వారికి విజ్ఞప్తి చేసింది. నూతన పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ (బాల్పా) గత నెలలో సమ్మె నోటీసులిచ్చింది. అయినా సంస్థ ముందుకు రాకపోవడంతో సిబ్బంది మొత్తం సమ్మెకు దిగారు. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చరిత్రలో పైలట్ల మొట్టమొదటి సమ్మె ఇదే. మరోవైపు ఈ నిర్ణయంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనత త్వరలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో సమ్మె తరువాత, సెప్టెంబర్ 27న మరో సమ్మె నిర్వహించనున్నారని సమాచారం. కాగా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ లాభాలను ఉద్యోగులకు పంచాలని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. జూలైలో విమానయాన సంస్థ ప్రతిపాదించిన మూడేళ్లలో 11.5 శాతం వేతన పెంపును బాల్పా తిరస్కరించింది. ఈ సమ్మె ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అవసరమైన పెట్టుబడి కంటే సమ్మె మూలంగా కంపెనీకి చాలా నష్టం వస్తుందని బాల్పా ప్రధాన కార్యదర్శి బ్రియాన్ స్ట్రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉద్యోగుల సమ్మె న్యాయబద్దం కాదని, తాము సరైన ప్రతిపాదనలే చేశామని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. 90 శాతం విమానయాన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో రెండు యూనియన్లు 11.5 శాతం పెంపును అంగీకరించాయని కంపెనీ వాదిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ సాధారణంగా 48 గంటల వ్యవధిలో 1,700 విమానాలను నడుపుతుంది బ్రిటిష్ ఎయిర్‌లైన్స్. -
నేటి నుంచి జెట్ పైలట్ల సమ్మె
ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. ‘మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ)లోని మొత్తం 1,100 పైలట్లు సోమవారం ఉదయం 10.గంటల నుంచి విమానాలు నడపబోరు‘ అని ఎన్ఏజీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే నిలిపివేయాలని ముందుగా భావించినప్పటికీ .. కొత్త యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఏప్రిల్ 15 దాకా వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ బాధ్యతలను ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీ విమానాల రద్దు...: ఆగ్నేయాసియా ప్రాంతాలు, సార్క్ దేశాలకు నడిపే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. అటు టొరంటో, ప్యారిస్, ఆమ్స్టర్డామ్, లండన్ హీత్రో వంటి ఇతర విదేశీ రూట్లలో సర్వీసుల నిలిపివేతను ఏప్రిల్ 16 దాకా (మంగళవారం) పొడిగించినట్లు జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. -
ఎయిర్ ఇండియాకు పైలెట్ల షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న జాతీయ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ యాజమాన్యానికి ఇక సహకరించబోమని పైలెట్లు తేల్చిచెప్పారు. ఎయిర్ ఇండియా మూడు నెలలుగా 11,000 మంది ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. వేతనాలను సక్రమంగా చెల్లిస్తూ ఎయిర్‌లైన్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ యాజమాన్యంతో సహకరించే ప్రసక్తి లేదని భారత వాణజ్య పైలెట్ల అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ కమిటీకి రాసిన లేఖలో ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఆర్ఈసీ) స్పష్టం చేసింది. వేతన చెల్లింపులు సహా స్వల్పకాలిక పెట్టుబడి వ్యయాల కోసం ఎయిర్ ఇండియా రూ 1000 కోట్ల రుణం కోరిన నేపథ్యంలో పైలెట్ల సమ్మె సంకేతాలు వెలువడటం గమనార్హం. ఎయిర్ ఇండియా విక్రయం కోసం ఇటీవల చేపట్టిన బిడ్డింగ్‌లో ఏ ఒక్కరూ బిడ్ దాఖలు చేయకపోవడం తెలిసిందే. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఇది వారి పనితీరుపైనా ప్రభావం చూపుతోందని ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించిన ఆర్ఈసీ సమావేశంలో పైలెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎయిర్ ఇండియాలో సమ్మె?
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మరోసారి అలజడి రేగింది. కేంద్ర కార్మిక శాఖ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెజారిటీ పైలట్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఫ్లైట్ కమాండర్స్ ను వర్క్ మెన్ జాబితా నుంచి తొలగిస్తూ కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ఐసీపీఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రెండు రోజుల్లో సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఐసీపీఏ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కె కీర్తి తెలిపారు. సమ్మెకు ఐసీపీఏ నాలుగు విభాగాలు పూర్తి మద్దతు తెలిపాయని అన్నారు. రహస్య ఓటింగ్ ద్వారా సమ్మెపై అభిప్రాయాన్ని తెలుసుకున్నామని వెల్లడించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కాలంలో ఓటింగ్ నిర్వహించినట్టు చెప్పారు. ఎయిర్ ఇండియాలో మొత్తం 3,500 మంది కేబిన్ క్రూ సిబ్బంది ఉండగా వీరిలో 2,200 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా మిగతావారు కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు.