Pipe leakage
-
డ్రైవర్‌ను సస్పెన్షన్ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్ తీవ్రనిర్ణయం..
గోపాల్పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్‌గౌడ్‌ను సస్పెన్షన్ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్‌మేన్ మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో మిషన్ భగీరథ పథకం లైన్‌మేన్ మృతి చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ అయింది. పైప్‌లైన్‌కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్‌కు చెందిన వాటర్‌మేన్ సతీష్ (45) వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్
-
వైరల్: నడిసంద్రంలో భారీ అగ్నిప్రమాదం..
వాషింగ్టన్/మెక్సికో: చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు. చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో.. అంతే భయంకరంగా కూడా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నడిసముద్రంలో అండర్‌వాటర్ పైప్‌లైన్ లీక్ కావడంతో ఇలా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ సంఘటన మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. నీటి అడుగున పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పెమెక్స్ వెల్లడించింది. నీటి నుంచి ఎగసిపడుతున్న ముదురు నారింజ వర్ణం మంటలు చూపరులను భయపెడుతున్నాయి. పెమిక్స్ కంపెనీకి అతి సమీపంలోని అండర్ వాటర్ పైప్‌లైన్ లీక్ కావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పైప్‌లైన్ పెమిక్స్కు చెందిన అతి ముఖ్యమైన ‘కు మలూబ్ జాప్’ ఆయిల్ డెవలమెంట్ని పెమిక్స్ ప్లాట్‌ఫాంతో కలుపుతుంది. ఈ సందర్భంగా పెమిక్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో ఎవరు గాయపడలేదు.. ఉత్పత్తి కూడా నిలిచిపోలేదు. సుమారు ఐదుగంటల పాటు కష్టపడి మంటలను ఆర్పేశాము. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాం’’ అన్నారు. -
ఇదేం చోద్యం
సాక్షి, సిటీబ్యూరో:ఎండాకాలం.. నీటి సమస్య.. నీటిని వీలైనంత పొదుపుగా వాడాలి అని జలమండలి అధికారులు నిత్యం చెబుతుంటారు. అయితే నగరంలోని మంచినీటి పైప్లైన్లకు చాలా చోట్ల లీకేజీలున్నాయి. దీంతో నీరంతా వృథా అవుతోంది. స్థానికులు అక్కడక్కడా ఇలా స్నానాలు చేస్తుంటారు. మరి నీరు కలుషితమైతే దానిని ఆపేదెలా? జరిగే ప్రమాదాలకు బాధ్యులెవరు? -
ఆసిఫాబాద్ జిల్లాలో మషన్ భగీరధ పైప్ లీక్
-
నీటి లీకేజీపై బీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: నగర వాసులకు నీటి సరఫరా చేస్తున్న పైపుల లీకేజీ అరికట్టేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది. ఈ పనులను మూడు దశల్లో పూర్తిచేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ముంబైకి సరఫరా అవుతున్న 3,750 ఎమ్మెల్డీల నీటిలో రోజుకు కనీసం 20 శాతం నీరు చోరీకి గురవుతోంది. అలాగే దాదాపు 600 లీటర్లకు పైగా నీరు లీకేజీ వల్ల వృథా అవుతోంది. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న పైపులు పురాతనమైనవి కావడంతో అవి తుప్పుపట్టాయి. దీంతో పైపులు పలు చోట్ల పగిలిపోయి నీరు లీకేజీ అవుతోంది. వీటిని మార్చాలని బీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశ బాంద్రా, ఖార్ రోడ్, శాంతాక్రూజ్ (తూర్పు, పశ్చిమ), తూర్పు విలేపార్లే, తూర్పు అంధేరి, తూర్పు జోగేశ్వరి, చార్కోప్, బోరివలి, కాందివలి, గోరాయి, దహిసర్, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్ తదితరా ప్రాంతాల్లో పైపులకు మరమ్మతు పనులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదిత పనులు ఒకట్రెండు రోజుల్లో స్థాయి సమితీ ముందుకు తీసుకురానున్నారు. అనుమతి లభించగానే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.