pitch controversy
-
బ్యాటర్లకు చుక్కలు చూపించిన లక్నో పిచ్.. క్యూరేటర్పై వేటు!
భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 లక్నో వేదికగా ఆదివారం(జనవరి 29)న జరగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్మాత్రం బ్యాటర్లకు ఏ మాత్రం అనుకూలించలేదు. విపరీతమైన టర్న్‌కు తోడు ఊహించని బౌన్స్‌తో లక్నో పిచ్.. బ్యాటర్లకు చుక్కలు చూపించింది. 100 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా నానా తంటాలు పడింది. దీంతో ఈ మ్యాచ్ కోసం పిచ్ తయారు చేసిన క్యూరేటర్పై విమర్శల వర్షం కురుస్తోంది. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా వ్యంగ్యంగా స్పందించాడు. ఈ పిచ్ ను చూశాక ప్రోటిస్ ఆటగాడు క్వింటన్ డికాక్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు రాడని గంభీర్ సెటైరకల్గా కామెంట్ చేశాడు. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం పిచ్‌పై ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎకానా స్టేడియం పిచ్ క్యూరేటర్‌ను తన పదవి నుంచి తొలిగించినట్లు సమాచారం. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ కోసం సరికొత్త పిచ్‌ని రూపొందించనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎకానా స్టేడియం హోమ్ గ్రౌండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు -
చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలిటెస్టుపై ఫిక్సింగ్ అనుమానాలు?
గతేడాది ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరిలో టీమిండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఇంగ్లండ్ టీమిండియాతో నాలుగు టెస్టులు, ఐదు టి20, మూడు వన్డేలు ఆడింది. కాగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అనూహ్యంగా టీమిండియా తొలి టెస్టులో ఓడిపోయింది. ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుందంటే పిచ్ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. కానీ తొలి టెస్టు మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. డొమినిక్ సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 178 పరుగులకే ఆలౌట్ కావడంతో .. భారత్ ముందు 433 పరుగుల టార్గెట్ ఉంది. కానీ టీమిండియా తమ వికెట్లు కాపాడుకోలేక 192 పరుగులకి ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్‌పై.. పిచ్ తయారు చేసిన క్యురేటర్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ఫలితం తర్వాత చెపాక్ స్టేడియం పిచ్ క్యూరేటర్‌ని ఆ పదవి నుంచి తొలగించిన బీసీసీఐ కొత్త క్యూరేటర్‌ని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అని సమాచారం. ముఖ్యంగా పిచ్ క్యూరేటర్ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తొలి టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్, పిచ్ క్యూరేటర్‌ని కలిసి పిచ్ ఎలా తయారుచేయాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు...మ్యాచ్‌కి ముందు రోజు సాయంత్రం అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి చెపాక్‌లోని చిదంబరం స్టేడియానికి వెళ్లారు...క్యూరేటర్‌కి, గ్రౌండ్‌మెన్‌కి పిచ్ ఎలా తయారుచేయాలో సూచించారు. పిచ్ ఎలా ఉందో అలా వదిలేయాలని నీళ్లు కొట్టడం కానీ, రోలర్ వాడడం కానీ చేయకూడదని తెలిపారు...అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్‌కి నీళ్లు కొట్టిన క్యూరేటర్, రోలర్ కూడా వాడారు. దీంతో పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా మారి, మొదటి రెండు రోజులు బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు...బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్యూరేటర్... పిచ్‌పై నీళ్లు కొట్టి, రోలర్ ఎందుకు వాడాడు? కావాలని టీమిండియాకి విరుద్ధంగా రిజల్ట్ రావాలని ఈ విధంగా చేశాడా?లేక మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా? అనేది తేల్చేందుకు బీసీసీఐ విచారణ జరపాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా మళ్లీ చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం టీమిండియా విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీయగా, టెస్టు ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మూడు, నాలుగు టెస్టులు వరుసగా గెలిచిన టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: Shane Warne- Ricky Ponting: వార్న్‌ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్ WTC Points Table: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఎన్నో స్థానంలో ఉందంటే -
మా పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే వాళ్ల కెరీర్లు ముగిసినట్టే..
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ స్వదేశీ పిచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢాకాలోని పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు పనికిరావని విమర్శించాడు. ఇలాంటి పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే యువ బ్యాట్స్మెన్ల కెరీర్లు అర్ధంతరంగా ముగుస్తాయని ఆరోపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో టీ20 సిరీస్‌లు ఆడింది. ఈ సిరీస్‌ల్లో ఆ జట్టు 4-1తేడాతో ఆస్ట్రేలియాను.. ఆ తర్వాత 3-2తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే ఢాకా వేదికగా జరిగిన ఈ పది మ్యాచ్‌ల్లో కనీసం 120 పరుగులు చేయడం కష్టమైన నేపథ్యంలో షకీబ్ ఈమేరకు స్పందించాడు. ఈ సిరీస్‌ల్లో ఢాకాలోని పిచ్‌లపై బంగ్లాదేశ్ సహా పర్యాటక జట్లలోని బ్యాట్స్మెన్లు 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. టీ20 మ్యాచ్‌లే అయినప్పటికీ ఒక్కసారి కూడా భారీ స్కోర్లు నమోదు కాలేదు. పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలించింది. ఈ నేపథ్యంలోనే షకీబ్ సోంత పిచ్‌లపై విమర్శలు చేశాడు. ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ వైఫల్యాలను పరిగణలోకి తీసుకోరాదని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ చేరుకున్న షకీబ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పొందిన అనుభవాలను తనతో పాటు ముస్తాఫిజుర్ రెహ్మన్.. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పంచుకుంటామని ఈ సందర్భంగా తెలిపాడు. ఇలా చేయడం టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో షకీబ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, ముస్తాఫిజుర్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన జట్టును గతవారం ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే బీసీబీ తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షకీబ్ ఆల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు బీసీబీ మొండిచేయి చూపింది. కాగా, ఈ ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు తొలుత క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిటన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్, షామీమ్ హోసేన్. స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్. చదవండి: ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..! -
అలాంటి పిచ్‌లపై గెలవడం గొప్పేమీ కాదు..
లండన్: ఇంగ్లీష్ జట్టుపై 3-1 తేడాతో గెలుపొందిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ మాత్రం టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కుతున్నాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత దేశపు పిచ్‌లపై టీమిండియా విజయాలు సాధించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదని పేర్కొన్నాడు. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై గెలిచినప్పుడే టీమిండియా అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని వెల్లడించాడు. టీమిండియా విజయవరంపర ఇంగ్లండ్‌లోనూ కొనసాగితే.. ఈ శకంలోనే అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందన్నాడు. స్వింగ్ బంతుల్ని ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు కష్టపడతారు కాబట్టే తాను ఈరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానన్నాడు. టెస్టుల్లో టీమిండియా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆ జట్టుకు అధిక శాతం విజయాలు ఉప ఖండపు పిచ్‌లపైనే దక్కడం తన అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయన్నాడు. టెస్టు మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లో పూర్తి కావడం సంప్రదాయ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాపడ్డాడు. మొటేరా వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించి, న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదిక కానుంది. -
‘పిచ్’ పంచాయతీ
ఐసీసీతోనే కోహ్లి ఢీ! మాజీ ఆటగాళ్ల వాగ్వాదాలు భారత జట్టు దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ సొంతం చేసుకుందనేది వాస్తవం. స్పిన్ ప్రభావమో, సఫారీల బ్యాటింగ్ వైఫల్యమో... కారణం ఏదైనా భారత్ సిరీస్ గెలిచింది. అయితే నేరుగా తన ప్రమేయం లేకపోయినా పిచ్‌ల చుట్టూ సాగుతున్న చర్చ భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి విజయానందాన్ని దూరం చేస్తోంది. భవిష్యత్తులోనూ సొంతగడ్డపై తన తొలి విజయాన్ని ఘనంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోతోంది. ఒక దశలో రచ్చ ముగిసిపోయినట్లు కనిపించినా... నాగ్‌పూర్ వికెట్‌పై ఐసీసీ వివరణ కోరడంతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. వికెట్‌పై వస్తున్న విమర్శలకు కెప్టెన్, డెరైక్టర్ కలిసి ఎదురుదాడి మొదలు పెట్టారు. న్యూఢిల్లీ: మొహాలీ టెస్టు మూడు రోజుల్లోపే ముగిసినా ఇంతగా విమర్శలు రాలేదు. బెంగళూరులో తొలి రోజే దక్షిణాఫ్రికా ఆలౌటైనా పెద్దగా చర్చ జరగలేదు. కానీ నాగ్‌పూర్‌లో సఫారీలు చిత్తుగా ఓడిన తర్వాత మాత్రం ‘పిచ్ పాపం’ అంటూ అన్ని వైపులనుంచి విమర్శలు మొదలయ్యాయి. అనూహ్యంగా ఐసీసీ కూడా జామ్తాపై నివేదిక ఇవ్వాలంటూ బీసీసీఐని కోరడం పిచ్‌ల పనితీరుపై తేనెతుట్టను కదిలించింది. సరిగ్గా ఇదే విషయం భారత కెప్టెన్ కోహ్లికి మంట తెప్పించింది. దాంతో అతను ఐసీసీపైనే తన వ్యాఖ్యల గురి పెట్టాడు. ‘పిచ్ గురించి పదే పదే వచ్చిన కథనాల గురించే కాదు. వికెట్ గురించి వివరణ కోరుతున్న వారి గురించి (పరోక్షంగా ఐసీసీని ఉద్దేశించి) కూడా మాట్లాడుతున్నా. ఎక్కడా దీనిని పట్టించుకోకపోయినా మన దగ్గర మాత్రం పిచ్‌పైనే అందరూ దృష్టి పెడతారు. పరాయి దేశంలో మనం ఓడితే ఆట చేత కానట్లు. అదే వారు ఇక్కడ ఓడితే మాత్రం పిచ్‌ది తప్పవుతుందా’ అని కోహ్లి ఘాటుగా వ్యాఖ్యానించాడు. అక్కడ జరగలేదా? 1996 డర్బన్ టెస్టులో అలెన్ డొనాల్డ్ (9/54) ధాటికి భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో 100, 66 పరుగులకే కుప్పకూలింది. మొత్తం కలిపి మన బ్యాటింగ్ 73.2 ఓవర్లే సాగింది. ఈ మ్యాచ్ గురించే కాకపోయినా కోహ్లి అక్కడి పిచ్‌లు, ఆ సమయంలో ఎవరూ విమర్శించని విషయాన్ని గుర్తు చేయడం విశేషం. అతని వాదనలోనూ వాస్తవం కనిపిస్తుంది. ‘సఫారీ గడ్డపై 50లోపు స్కోరు మూడు సార్లు నమోదైంది. ఆరు సార్లు 100 లోపే జట్లు ఆలౌట్ అయ్యాయి. కానీ నాడు పిచ్ గురించి ఎవరూ ఇంతగా రాయలేదు. అడిలైడ్ టెస్టు రెండున్నర రోజుల్లోపే ముగిసినా ఒక్క కథనం నాకు కనిపించలేదు. ఇప్పటికే దీని గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇకపై ఏమీ చెప్పదల్చుకోలేదు’ అని కుండబద్దలు కొట్టాడు. శాస్త్రి-హేడెన్ మాటల యుద్ధం నాగ్‌పూర్ పిచ్ మాజీ ఆటగాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టింది. తొలి రోజే బంతి టర్న్ కాకూడదని ఏ నిబంధనల పుస్తకంతో రాసి ఉందంటూ ప్రశ్నించిన రవిశాస్త్రి... ఆస్ట్రేలియాలో కూర్చొని ఇక్కడి పిచ్‌లపై మాట్లాడవద్దంటూ, వచ్చి ఆడాలని మాజీలకు సవాల్ విసిరారు. అయితే తనకా హక్కు ఉందంటూ మ్యాథ్యూ హేడెన్ దానిని తిప్పికొట్టారు. తాను 103 టెస్టులు ఆడానని.. క్రికెట్‌ను ప్రేమించే, ఆట బాగు పడాలని కోరుకునే తనలాంటి వారే పిచ్ గురించి మాట్లాడతారని హేడెన్ గుర్తు చేశారు. మరో వైపు మ్యాచ్ ఫలితం ఆటగాళ్ల చేతిలో ఉంటుందని, క్యురేటర్ ఏమీ చేయలేడని బీసీసీఐ పిచెస్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ స్పష్టం చేశారు. క్రికెటర్లు సరిగా ఆడకపోతే పిచ్‌లపైనే చర్చ వస్తుందన్న దల్జీత్...‘దేవుడు దయతలిస్తే ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు’ అంటూ ఢిల్లీ పిచ్‌పై వ్యాఖ్యానించడం కొసమెరుపు.