IND Vs NZ T20: Lucknow Pitch Curator Removed: Report - Sakshi
Sakshi News home page

IND vs NZ: బ్యాటర్లకు చుక్కలు చూపించిన లక్నో పిచ్‌.. క్యూరేటర్‌పై వేటు!

Published Tue, Jan 31 2023 8:58 AM | Last Updated on Tue, Jan 31 2023 11:12 AM

Lucknow Pitch Curator REMOVED after horrible pitch conditions: Reports - Sakshi

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో టీ20 లక్నో వేదికగా ఆదివారం(జనవరి 29)న జరగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ కోసం తయారు చేసిన పిచ్‌మాత్రం బ్యాటర్లకు ఏ మాత్రం అనుకూలించలేదు. విపరీతమైన టర్న్‌కు తోడు ఊహించని బౌన్స్‌తో లక్నో పిచ్.. బ్యాటర్లకు చుక్కలు చూపించింది.

100 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా నానా తంటాలు పడింది. దీంతో ఈ మ్యాచ్‌ కోసం పిచ్‌ తయారు చేసిన క్యూరేటర్‌పై విమర్శల వర్షం‍ కురుస్తోంది. భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కూడా వ్యంగ్యంగా స్పందించాడు. 

ఈ పిచ్ ను చూశాక ప్రోటిస్‌ ఆటగాడు క్వింటన్ డికాక్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు రాడని గంభీర్ సెటైరకల్‌గా కామెంట్‌ చేశాడు. భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సైతం పిచ్‌పై ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎకానా స్టేడియం పిచ్‌ క్యూరేటర్‌ను తన పదవి నుంచి తొలిగించినట్లు సమాచారం. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం సరికొత్త పిచ్‌ని రూపొందించనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎకానా స్టేడియం హోమ్ గ్రౌండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement