plane engine
-
విమానం టేకాఫ్ అవుతున్న టైంలో ఉన్నారా? అంతే సంగతి..
విమానం టేకాఫ్ అవుతుండగా సమీపంలో ఎవరూ ఉండరు. ఎందుకంటే దాని ఇంజన్ నుంచి వచ్చే గాలి ఫోర్స్‌కి తాళ్లలేం. అందుకే ఎయిర్ పోర్ట్ అధికారులు విమానం టేకాఫ్ అవుతుందనంగా ఎవర్నీ రానీయరు, వారు ఉండరు. కానీ ఇక్కడో బృందం విమానం టేకాఫ్ అవుతుండగా అక్కడే ఉంది. ఆ విమానం ఇంజిన్ దెబ్బకు ఒక్కసారిగా వారంతా చెల్లా చెదురుగా అయిపోతారు. ఏదో పెద్ద గాలి తుఫానులా ..వారందర్నీ పడగొడుతున్నట్లు ఉంటుంది. నిజానికి వారంతా ఆ విమానం రన్‌వేకి సరిహద్దు సమీపంలో ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో విమానం ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధం అవుతుంది. ఇక అంతే ఆ విమానం వెనుక ఉన్న ఇంజన్ నుంచి వచ్చే శక్తివంతమైన గాలికి అక్కడున్నవారంతా నిలబడటమే కష్టమైంది. ఏమవుతుందో తెలుసుకునేలోపే చెదిరిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Just downloaded my Skiathos videos from last week, here’s a small preview of the absolute chaos when people underestimate the power of aircraft engines! pic.twitter.com/ll2g9nY8AA — Callum Hodgson (@avgeekcal) June 21, 2023 (చదవండి: స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!) -
ఇదేం ఆచారం: అదృష్టం కోసం వ్యక్తి తింగరి పని
బీజింగ్: మనిషి ఆశా జీవి. తన జీవితం గురించి రకరకాల కలలు కంటాడు. ఆర్థికంగా బాగా ఎదగాలని.. లగ్జరీగా జీవించాలని ఆశపడతాడు. తమ కలలు సాకారం చేసుకోవడం కోసం కొందరు బాగా కష్టపడితే.. మరి కొందరు మాత్రం ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలపై ఆధారపడతారు. వీరిలో కొందరు లాటరీ టికెట్లు కొని అదృష్ట దేవత కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పిచ్చి పని చేసి ఎయిర్ పోర్ట్ అధికారుల్ని, పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. మనలో కొందరు ప్రయాణాలు చేసే సమయంలో రకరకాల ఆచారాలు, నమ్ముకాలు పాటిస్తుంటారు. వాటిలో బాగా ఫేమస్ కాయిన్ ట్రెడీషన్. అదేంటంటే ప్రయాణిస్తుండగా.. ఏదైనా నది తారసపడితే అందులోకి నాణేలు విసురాతారు. బస్సు, రైళ్లలో ప్రయాణం చేసే వారికే కాక.. విమానంలో ప్రయాణం చేసే వారు కూడా ఈ నమ్మకాన్ని పాటిస్తారు. వీరు ఏం చేస్తారు అంటే తాము ప్రయాణించబోయే విమానం ఇంజిన్లోకి కాయిన్స్ విసురుతారు. అలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. తాజాగా ఓ యువకుడు అలాగే చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. చైనాలోని వాంగ్ అనే యువకుడు వైఫాంగ్ నుండి హైకూకు వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఫాంగ్ ఎయిర్ పోర్ట్ నుంచి బీబు గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జీఎక్స్ 8814 నెంబర్ గల ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అనుకున్న సమాయానికి విమానం ఎక్కాడు. 148 మంది ప్రయాణిస్తున్న విమానం రన్ వే మీద ఉండగా వాంగ్ తన దగ్గరున్న ఆరు కాయిన్స్‌ను ఎర్రటి పేపర్లో చుట్టి విమానం ఇంజిన్లోకి విసిరాడు. అవి కాస్త కిందపడిపోవడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. భద్రతా సమస్యల కారణంగా ఎయిర్ పోర్ట్ అధికారులు ఫ్లైట్ రద్దు చేశారు. ఈ సంఘటన తరువాత యువకుడు వాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అయితే ఇలా ఫ్లైయిట్ ఇంజిన్లోకి కాయిన్స్ విసరడం ఇది తొలిసారేం కాదు. గతేడాది 28 ఏళ్ల యువకుడు 'అదృష్టం' కోసం విమానం ఇంజిన్లోకి కాయిన్స్ విసిరాడు. దీంతో యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు 1,20,000 యువాన్ల (రూ. 12.36 లక్షలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చేసేదేం లేక సదరు యువకుడు ఆ మొత్తాన్ని కట్టాడు. చదవండి: కడుపులో 4.15 కిలోల బంగారం -
విమాన ఇంజన్ లో దాక్కున్నాడు!
మాస్కో:ఇప్పటికే విమాన ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతుంటే.. విమానంలో తాజాగా మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రష్యాకు చెందిన జెట్ లైనర్ విమానంలో ఓ వ్యక్తి ఇంజన్ లో దాక్కుని ప్రయాణించిన ఘటన కలకలం రేపింది. కెమిరోవా నగరం నుంచి బయల్దేరిన జెట్ లైనర్ విమానం హుర్ ఘడా వద్ద ల్యాండ్ అయిన అనంతరం ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. అక్కడ్నుంచి మరొక చోటుకి విమానాన్ని సిద్ధం చేసే క్రమంలో ఓ వ్యక్తి ఇంజన్ లో ఉండటాన్ని రష్యా కార్మికులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దీంతో అతన్ని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఎటువంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. అసలు విమాన ఇంజిన్ లోకి ఎలా వెళ్లాడనే దానిపై కూడా వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నందువల్ల అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.