planners
-
ప్రణాళికలు తయారు చేయాలి
ఆదిలాబాద్ అర్బన్ : అదిలాబాద్ పట్టణ అభివృద్ది కోసం మున్సిపల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి పట్టణాభివృద్ది కోసం ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జ్యోతిబుద్ద ప్రకాష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ’అర్బన్-డే’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను వసూళ్లు, ట్రాఫిక్ సమస్యలు, మున్సిపల్ భూముల లీజులు, హరితహారం పథకం అమలు, స్వచ్చభారత్, మున్సిపల్ భూముల రక్షణకై తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా అధిక మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించని వారిపై చర్యలు తీసుకొని వసూళ్లు చేయాలని మున్సిపల్ ఇంజనీర్లను, సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. స్వచ్చభారత్ పథకంలో భాగంగా పూర్తి స్థారుులో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడానికి ఎస్‌హెచ్‌జీలను భాగస్వాములను చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతయారు, ఇఇ నాగమల్లేశ్వర్రావు, డీపీవో పోచయ్య, డీఎస్పీ కెఎన్. రెడ్డి, ట్రాఫిక్ సీఐ షేర్ అలీ, అధికారులు పాల్గొన్నారు. -
ప్లానర్స్‌కు మోడల్ స్టేట్‌గా తెలంగాణ
సీఐఐ సదస్సులో కేటీఆర్ హైదరాబాద్: రానున్న రోజుల్లో నిర్మాణ రంగ ప్లానర్ల్లకు మోడల్ స్టేట్‌గా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా పట్టణీకరణతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అనుసంధానానికి భారీగా వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. మౌలిక రంగంపై శుక్రవారమిక్కడ సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశ్రామికవేత్తలను ఉద్ధేశించి మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, డ్రై పోర్టులతోపాటు సామాజిక మౌలిక వసతులైన విద్యుత్, నీరు, ఇల్లు, ప్రజా రవాణాపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు. మరిన్ని పీపీపీ ప్రాజెక్టులు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో తెలంగాణలో మరిన్ని మౌలిక ప్రాజెక్టులు రావాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్ సూచించారు. ఏరోస్పేస్ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చేందుకు శిక్షణ సంస్థ ఏర్పాటు అవసరమన్నారు. హైదరాబాద్‌తోసహా ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని సీఐఐ తెలంగాణ శాఖ చైర్పర్సన్ వనిత దాట్ల అభిప్రాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయం విస్తరణ... పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ను జీఎంఆర్ విస్తరించనుంది. ఈ విస్తరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనుంది. విస్తరణ పూర్తి అయితే వార్షిక సామర్థ్యం 1.2 కోట్ల నుంచి 2 కోట్ల ప్రయాణికులకు చేరనుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్ వెల్లడించారు. 80 వేల టన్నులున్న కార్గో సామర్థ్యం 2016 మార్చికల్లా లక్ష టన్నులకు చేరుతుందని చెప్పారు. ప్రయాణికుల రద్దీ 2014-15లో ఒక కోటి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్లుగా ఉండొచ్చని.. అయిదేళ్లలో 2 కోట్లను తాకుతుందని భావిస్తున్నామని అన్నారు. విస్తరణకు రూ.1,000 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉంది. -
ఉపాధికి ఊతం
హుదూద్‌తో కొత్తపనుల గుర్తింపు పెద్దఎత్తున కల్పనకు ప్రణాళిక రైతులకు మేలు సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ఉపాధి హామీ కూలీలకు ఊతమిస్తోంది. హుదూద్ సృష్టించిన విధ్వంసంతో పెద్ద ఎత్తున పనుల కల్పనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హూదూద్ తుపానుకు పదిరోజుల ముందు వరకు ఉపాధి హామీ కూలీలకు రోజూ పాతికవేల పనిదినాలు కల్పించేవారు. ఒక పక్క వ్యవసాయ సీజన్..మరొక పక్క హూదూద్ దెబ్బతో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఒక్క పనిదినాన్నికూడా కల్పించ లేని పరిస్థితి. రానున్న సీజన్లో చేపట్టనున్న పనుల కోసం ప్రణాళిక రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా హూదూద్ విధ్వంసంతో ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైతులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా రైతులను ఆదుకునే లక్ష్యంతో కొత్త పనుల గుర్తించారు. వీటిలో ప్రధానంగా తుపానునేపథ్యంలో పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలు తొలగించడం, ధ్వంసమైన పొలం గట్లు, వరదగట్లు పటిష్టపరచడం, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ ఛానల్స్‌లో పేరుకుపోయిన డీసిల్టింగ్ తొలగింపు, పొలాల్లో నేలకొరిగిన చె ట్లు తొలగింపు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తోటలు.. పొలాల గట్లపై పడిపోయిన చెట్ల స్థానే కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఉపాధి హామీలో చేపట్టాలని యోచిస్తున్నారు. మామిడి, జీడి, సపోటా, కొబ్బరి తదతర వాణిజ్య పంటలన్నీ హార్టికల్చర్ ప్రొగ్రామ్ ద్వారా రైతుల తోటల్లో ఉపాధి హామీ పథకంలో నాటనున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరుగుతున్నందున..అది పూర్తి కాగానే ఎన్ని వేల ఎకరాల్లో తోటలు, పొలాల్లో చెట్లు నేలమట్టమయ్యాయో అంచనా వేసి తొలుత వాటిని తొలగించడం..ఆతర్వాత రైతుల సమ్మతితో కూలీలద్వారా వారు సాగు చేసే రకాలకు చెందిన మొక్కలను పెద్ద ఎత్తున నాటేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన మొక్కలను ఉద్యానవనశాఖ సరఫరా చేస్తుంది. ఉపాధి కూలీల ద్వారా రైతుల పొలాలు, తోటల్లో వాటిని నాటించనున్నారు. హూదూద్ నేపథ్యంలో ఉపాధి హామీ అధికారులు గుర్తించిన పనుల ఆమోదం కోసం జిల్లా కలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త పనులతో సంబంధం లేకుండా గతంలో ప్రతిపాదించిన రూ.400కోట్ల విలువైన పనులకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న ప్లానింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వీటిని కూడా చేపడతామని జిల్లాడ్వామా పీడీ శ్రీరాములునాయుడు సాక్షికి తెలిపారు.