Playboy
-
రిచెస్ట్ జాబితాలో కుక్క: రూ.15 కోట్ల ఆస్తిని రాసిచ్చిన మోడల్
అత్యంత ధనవంతుల జాబితాలో మనుషులే కాదండోయ్..కుక్కలు కూడా చేరిపోతున్నాయి. ఇటీవల కాలంలో యజమానులు తాము పెంచుకున్న పెంపుడు కుక్కలకు కోట్ల ఆస్తిని తృణప్రాయంగా రాసిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే రిచెస్ట్ బిలియనీర్ డాగ్స్ జాబితాలో 'లులూ' అనే కుక్క ఉండగా.. ఇప్పుడు రిచెస్ట్ 'ఫ్రాన్సిస్కో' అనే మరో కుక్క చేరిపోయింది. భవిష్యత్‌లో వరల్డ్ రిచెస్ట్ బిలినియర్స్ జాబితా తరహాలో వరల్డ్ రిచెస్ట్ డాగ్స్ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఎందుకంటే మనుషులకి సమానంగా కుక్కలు సైతం ఆస్తుల్ని పోగేసుకుంటున్నాయి. తాజాగా బ్రెజీలియన్కు చెందిన ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్ (35) తాను సంపాదించిన ఆస్తి మొత్తం సుమారు రూ.15కోట్ల ప్రాపర్టీని ఫ్రాన్సిస్కో అనే కుక్కకు రాసిచ్చేసింది. ప్రస్తుతం అమెరికా పూస్ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటుంన్న జు ఐసెస్ తన అపార్టమెంట్లతో పాటు రెండు కార్లను కూడా కుక్కకే రాసిస్తానని ప్రకటించింది. ఇలా చేయడం ఎందుకు' అని అడిగిన లాయర్లకు ఆశ్చర్యపోయేలా రిప్లయ్ ఇచ్చింది. నాకు పిల్లలు లేరు. ఇప్పుడు బాగాన్నా..భవిష్యత్‌లో ఏదైనా అనార్ధం జరిగితే పరిస్థితి ఏంటీ? ముందు చూపు లేకపోతే ఎలా? అందుకే ఆస్తిని ఫ్రాన్సిస్కోకు రాసిస్తున్నా. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే..దాని కేర్ టేకర్ శ్రద్ధగా చూసుకుంటాడు' అని రిప్లయి ఇచ్చింది. ఇప్పుడే కాదు..గతంలో గతంలో అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్‌విల్లేకు చెందిన బిల్ డోరిస్ ప్రముఖ వ్యాపార వేత్త. బిజినెస్ చేసిన బిల్ డోరిస్ కోట్లు గడించాడు. పెళ్లి చేసుకోలేదు. పిల్లలు లేరు. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. అందుకే తన ఆస్తి పాస్తులన్నీ (సుమారు 36కోట్లుకు పైమాటే) తన కుక్క లులూకి చెందేలా రాసిచ్చాడు. దీంతో ఎనిమిదేళ్ల వయసున్న ఆ కుక్క ప్రపంచంలోనే రిచెస్ట్ డాగ్ గా పేరు సంపాదించుకుంది. వీలునామా రాసి కుక్క కోసం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా తన స్నేహితుడు మార్తా బర్టన్ను నియమించాడు. అప్పట్లో ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
భారత్‌లోకి ‘ప్లే బాయ్’ వచ్చేస్తున్నాడు..!
ముంబై: లీజర్ లైఫ్‌స్టయిల్ సంస్థ ప్లేబాయ్ ఎంటర్ప్రైజెస్ భారత మార్కెట్లో తిరిగి ప్రవేశిస్తోంది. ఇందుకోసం జే జే క్యాపిటల్ సంస్థతో జట్టు కట్టింది. ప్రఖ్యాత ప్లేబాయ్ మ్యాగజైన్ సహా వివిధ ప్లేబాయ్ బ్రాండ్ల యాజమాన్య సంస్థ పీఎల్బీవై గ్రూప్ సీఈవో బెన్ కాన్ ఈ విషయాలు తెలిపారు. (చదవండి: రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే!) నాలుగేళ్లలో రూ.800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, ప్రధాన నగరాల్లో ప్లేబాయ్ బ్రాం డ్ క్లబ్‌లు, కేఫ్‌లు, బీర్ గార్డెన్లు, నైట్‌క్లబ్‌లు ప్రారంభించనున్నట్లు చెప్పారు. (చదవండి: ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!) -
ఇన్స్టాగ్రామ్ ‘ప్లేబాయ్’ కీలక నిర్ణయం!
వాషింగ్టన్ : ఎల్లప్పుడు చుట్టూ అందమైన అమ్మాయిలతో విలాసవంతమైన పార్టీలతో కాలక్షేపం చేసే ‘ప్లేబాయ్’గానే కాకుండా, ప్రముఖ సోషల్ మీడియా ‘ఇన్స్టాగ్రామ్’ కింగ్‌గా గుర్తింపు పొందిన డేన్ బిల్జేరియన్ 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాత్రం హిల్లరీ క్లింటన్‌పై పోటీచేసే కన్యే వెస్ట్కే ఓటు వేస్తానని ఆయన అన్నారు. నాపైనే కన్యే వెస్ట్ పోటీ చేస్తారని భావిస్తున్నానని పగలబడి నవ్వుతూ చెప్పారు. నిజంగా 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా, ముమ్మాటికి అని చెప్పలేనుగానీ, ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పటికీ అన్నివిధాల సిద్ధం కావచ్చని భావిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 కోట్ల మంది అభిమానులున్న బిల్జేరియన్ తెలిపారు. అమెరికా, ఫ్లోరిడాలోని టంపాలో జన్మించిన బిల్జేరియన్‌కు 38 ఏళ్లు. విలాసవంతమైన సొంత పడవ (యాట్)లో మిస మిసలాడే భామలతో కులుకుతూ, మిత్రులతో గడుపుతూ, పరిచారక బృందం సేవల మధ్య సుందర సముద్ర తీరాల వెంట తిరుగుతూ, దీవుల్లోని విలాసవంతమైన భవనాల్లో బస వేస్తూ, విందు వినోదాల్లో తేలిపోవడం, వాటి తాలూకు ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఆయనకు సరదా. ఇప్పుడు అదే వృత్తి కూడా. ఆయనకు అమెరికాలో ఉన్న మూడు విలాసవంతమైన ఇళ్ల పరిసరాల్లో కూడా ఆయన ముద్దగుమ్మలతో నడిపే శృంగార లీలల గురించి గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తుంటాయి. పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ బిల్జేరియన్ ‘పోకర్ స్టార్’గాను, పలు వ్యాపారాల ద్వారాను అంతులేని సంపదనను సమకూర్చుకున్నారు. ‘లోన్ సర్వైవర్’ అనే హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించారు. ఇప్పటిలాగే ఖర్చు పెట్టినా రెండు, మూడు జన్మల వరకు ఆయన సంపద తరగదు. డబ్బే కాకుండా మంచి శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా ఉండడం ఆయన వెంట అమ్మాయిలు పడడానికి మరో కారణం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్జేరియన్ మద్దతిస్తానంటున్న కన్యే వేస్ట్ ప్రముఖ అమెరికా పాప్ సింగరే కాకుండా అమెరికా ప్రముఖ మోడల్, టీవీ ప్రెజంటర్, వ్యాపార వేత్త కిమ్ కర్దాషియిని భర్త. అమెరికా ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తానన్న విషయం ఆయన ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్‌నే ఇష్టపడతానని బిల్జేరియన్ 2016 ఎన్నికలకు ముందే చెప్పారు. అప్పటికే ఆయనకు ట్రంప్‌తో పరిచయం ఉంది. పరిచయం ఉన్న వ్యక్తిగా కాకుండా రాజకీయాల్లో ఇంకా రాటుదేలని వ్యక్తిగా, రాజకీయాల్లో మొరటువాడిగా భావించి, అలాంటి వారయితే దేశం కోసం అంతో, ఇంతో కృషి చేస్తారని భావించి సమర్థించినట్లు ఫలితాల అనంతరం లారీ కింగ్ అనే జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. -
ఫేస్‌బుక్‌కు షాక్ ఇచ్చిన ప్లేబాయ్!
డాటా లీక్ కుంభకోణం నేపథ్యంలో ప్రముఖ మ్యాగజీన్ ప్లేబాయ్ ఫేస్‌బుక్‌కు షాక్ ఇచ్చింది. ఫేస్బుక్ నుంచి తన అధికారిక పేజీని డియాక్టివేట్ చేసింది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం లీక్ చేసి.. రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న కథనాలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కథనాల నేపథ్యంలో ఇప్పటికే టెల్సా, స్పెస్ ఎక్స్ సంస్థలు తమ అధికారిక పేజీలను ఫేస్బుక్ నుంచి తొలగించాయి. ప్లేబాయ్ మ్యాగజీన్ వ్యవస్థాపకుడి తనయుడు, చీఫ్ క్రియేటివ్ అధికారి కూపర్ హెఫ్నర్ తాజాగా తమ అధికారిక ఫేస్బుక్ పేజీని తొలగించినట్టు ట్వీట్ చేశారు. ఫేస్బుక్ సమాచార మార్గదర్శకాలు, కార్పొరేట్ పాలసీలు ప్లేబాయ్ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని, లైంగిక సమాచార అణచివేతకు వేదికగా ఫేస్బుక్ మారిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 5 కోట్లమంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం లీక్ అయిందన్న వార్తల నేపథ్యంలో తమ పేజీని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. దాదాపు 25 లక్షలమంది వినియోగదారులు ఫేస్‌బుక్‌లోని వివిధ ప్లేబాయ్ పేజీలను వీక్షిస్తారని, వీరి సమాచారాన్ని బయటపెట్టడం ఇష్టం లేక తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్లేబాయ్ వ్యక్తిగత స్వేచ్ఛను, శృంగార ఆస్వాదనను గౌరవిస్తుందని, ఫేస్బుక్ విధానం వినియోగదారుల అధిక సమాచారాన్ని బయటపెట్టేలా ఉందని పేర్కొంది. అయితే, ప్లేబాయ్ ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌లో కొనసాగనుంది. -
తొలిసారి ప్లేబాయ్ మ్యాగజైన్లో ముస్లిం మహిళ
లాస్ ఏంజల్స్: ప్రముఖ మ్యాగజైన్ ప్లేబాయ్ మొదటిసారిగా ఒక బురఖా ధరించిన ముస్లిం మహిళ కథనాన్ని ప్రచురించింది. దీనిపై విమర్శలు, పొగడ్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ నెలకు చెందిన సంచికలో అమెరికాలో టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న నూర్ తగౌరి కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో ముస్లింల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ ఒక మహిళ ఎదిగిన తీరును మ్యాగజైన్ ప్రశంచింది. లిబియా నుంచి వచ్చిన తగౌరి బురఖా ధరించి అమెరికా టీవీలో యాంకరింగ్ చేయడమే లక్ష్యంగా కృషి చేశారని ప్రశంసించింది. ముస్లింల పట్ల మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోందని తగౌరి ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్లేబాయ్ పత్రిక ప్రచురిచింది. తగౌరిని సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. అశ్లీల పత్రికగా పేరున్న ప్లేబాయ్ గత కొంత కాలంగా ఎటువంటి పోర్న్ చిత్రాలను ప్రచురించడం లేదు. -
హైదరాబాద్‌లో ‘ప్లేబాయ్’
-
హైదరాబాద్‌లో ‘ప్లేబాయ్’
హైదరాబాద్ : అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ... అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్ ప్లేబాయ్ గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న పబ్‌ను శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్లేబాయ్ గ్రూప్ వాస్తవానికి 2012లోనే దేశంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించింది. గోవాతో పాటు ఢిల్లీ, ముంబైలలో క్లబ్బులు, పబ్‌ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలోనే అశ్లీలానికి తావు లేకుండా వీటిని నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చినా అనుమతి లభించలేదు. గోవాలోని క్యాండోలిమ్ బీచ్ సమీపంలో 22 వేల చదరపు అడుగుల సువిశాల ఓపెన్ ఎయిర్ క్లబ్ ఏర్పాటుకు అక్కడి సర్కారుకు గత ఏడాది దరఖాస్తు చేసుకుంది. అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా పేరున్న ఆ నగరంలోనూ దీని ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. ప్లేబాయ్ పేరుతో ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు సన్‌షైన్ రిసార్ట్స్ పేరుతో గోవాలో ఏర్పాటైంది. ఇప్పుడు ప్లేబాయ్ సంస్థ కన్ను హైదరాబాద్‌పై పడింది. పబ్ ఏర్పాటుకు అనుమతి లభించడంతో శుక్రవారం నగర శివారులోని ఓ ప్రముఖ హోటల్లో లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లేబాయ్ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంలో కొసమెరుపు ఏమిటంటే... ప్లేబాయ్ పబ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావడానికి సిటీలో పని చేస్తున్న అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేయడం. ఈ నేపథ్యంలోనే సంస్థకు చెందిన ఆహ్వానపత్రాలతో పాటు వీఐపీ పాస్‌లకూ భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. అయితే నగరంలో ఏర్పాటు కానున్న పబ్‌లో ఎలాంటి అశ్లీలానికీ తావు లేకుండా నిబంధనలు విధించినట్లు తెలిసింది.