plexies
-
'మోదీ హఠావో దేశ్ బచావో..' అంటూ ఢిల్లీలో వేల బ్యానర్లు ప్రత్యక్షం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఫుటోవర్‌లు, ఫ్లైఓవర్లు, బిల్డింగులు, రోడ్లు ఇలా అనేక చోట్ల మోదీ హఠావో దేశ్ బచావో(మోదీని గద్దె దించండి దేశాన్ని కాపాడండి) అంటూ ప్లెక్సీలు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి వీటిని తొలగించారు. మొత్తం 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే ఇలాంటి బ్యానర్లు లక్షకుగా పైగా ముద్రించాలని రెండు ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎవరో ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మంగళవారం 10వేల పోస్టర్లను కూడా సీజ్ చేశారు. వీటిని వ్యానులో తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే వాటిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు గానీ, ఎవరు ముద్రించారనే వివరాలు గానీ లేవు. మోదీ వ్యతిరేక బ్యానర్లకు సంబంధించి 100 ఎఫ్ఐర్లు నమోదు చేయడంతో పాటు, ఆరుగురుని అరెస్టు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పథాక్ తెలిపారు. ఆప్ కార్యాలయం నుంచే వ్యాన్ వెల్లిందని పేర్కొన్నారు. ఆప్ సెటైర్లు.. మరోవైపు మోదీ వ్యతిరేక పోస్టర్లను పోలీసులు తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. కేంద్రం నియంత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. ఆ పోస్టర్లలో ఏం తప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు మోదీజీ? అని ప్రశ్నించింది. భారత్ ప్రజాస్వామ్య దేశం అని బహుశా ప్రధాని మర్చిపోయినట్టున్నారని సెటైర్లు వేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది. मोदी सरकार की तानाशाही चरम पर है‼️ इस Poster में ऐसा क्या आपत्तिजनक है जो इसे लगाने पर मोदी जी ने 100 F.I.R. कर दी? PM Modi, आपको शायद पता नहीं पर भारत एक लोकतांत्रिक देश है। एक पोस्टर से इतना डर! क्यों? pic.twitter.com/RLseE9Djfq — AAP (@AamAadmiParty) March 22, 2023 చదవండి: కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ లింక్ చేశారా? -
టీఎస్పీఎస్సీ వద్ద ప్లెక్సీల కలకలం.. ఇచ్చట అన్ని పేపర్లు లభించును..!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ వద్ద బుధవారం ఉదయం ప్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇది జీరాక్స్ సెంటర్.. ఇచట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును.. అంటూ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో గోడ పత్రికలు వెలిశాయి. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంపై ఆవేదనతో ఒక విద్యార్థిగా ఈ విధంగా నిరసన తెలిపినట్లు ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ బాబు తెలిపాడు. గతవారం రోజులుగా విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురి చేసిన టీఎస్పీఎస్పీ కార్యాలయం వద్ద తానే ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. గోడ పత్రికలో ఆయన ఫొటో కూడా ముద్రించుకున్నాడు. పేపర్లు లీక్ చేసిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా పరీక్షను రద్దు చేయడమేంటని ప్రశ్నించాడు. శిక్ష ఎవరికి వేశారు? బోర్డుకా లేకా విద్యార్థులకా? అని ధ్వజమెత్తాడు. కస్టడీలో నిందితులు.. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
చిరిగిన ప్లెక్సీ..ఆగిన మెట్రో
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద గాలి దుమారానికి ప్లెక్సీలు చిరిగి పట్టాలపై పడడంతో మెట్రో ట్రైన్ అరగంట పాటు ఆగాల్సి వచ్చింది. అమీర్‌పేట నుంచి మియాపూర్ వెళ్లే మార్గంలో హోర్డింగ్ ప్లెక్సీ ఊడిపోయి వచ్చి మెట్రో విద్యుత్ తీగలపై పడింది. వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది ట్రైన్‌ను అరగంట వరకు నిలుపుదల చేశారు. అనంతరం మెట్రో సిబ్బంది ప్లైక్సీలను తొలగించి మెట్రో సేవలను పునరుద్దరించారు. -
అధికారులు 'అవాక్కయ్యారు'
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలో పల్స్ పోలియో ప్లెక్సీల పంపకంలో అధికారులు అవాక్కయ్యారు. ప్లెక్సీలు తెలంగాణ ప్రభుత్వం పేరుతో రావటంతో కాసేపు కలకలం రేగింది. అధికారులు వెంటనే జిల్లా కలెక్టరుకు సమాచారం ఇచ్చారు. దీనిపై జిల్లా కలెక్టరు స్పందిస్తూ.. తప్పులు దొర్లటం సహజమేనని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ప్లెక్సీలు కనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందనే అవకాశం ఉంది. అయితే ఏపీలో తెలంగాణ ప్రభుత్వం పేరుతో హోర్డింగులు రావటంపై విమర్శలు వస్తున్నాయి