plumbing
-
దొరకని నాగ సింధూరెడ్డి ఆచూకీ
సాక్షి, ఉండవెల్లి (అలంపూర్): కలుగొట్ల వాగులో శనివారం తెల్లవారుజామున గల్లంతైన గర్భిణి నాగసింధూరెడ్డి (28) ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ అక్కడికి చేరుకొని వాగు శివారు ప్రాంతాల్లో గాలింపు చర్యలను పరిశీలించారు. వాగులో అడ్డుగా ఉన్న ముళ్లపొదలు.. కలుగొట్ల, పుల్లూరు పరిసరాల్లో వెతకసాగారు. గల్లంతైన ప్రాంతం నుంచి తుంగభద్ర నది 500మీటర్ల దూరం ఉండడంతో నది తీర ప్రాంతాలకు పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వెంకట్రామయ్య తెలిపారు. యువతి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులతోపాటు సర్పంచ్ హుర్రున్నిసా, తేజ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాలనుసారం సోమవారం లైఫ్ బోట్లను తీసుకొచ్చి గాలింపు చేయనున్నట్లు సీఐ పేర్కొన్నారు. నదీ తీరంలో గాలింపు చర్యలను పరిశీలిస్తున్న ఎస్పీ రంజన్‌రతన్, అధికారులు హైదరాబాద్ వెళ్తుండగా.. ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్‌రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైన విషయం తెలిసిందే. -
ఇంటి రిపేర్లకూ ఆన్లైనే!
• ప్లంబింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనర్ వరకూ.. • 2 నెలల్లో బెంగళూరు, చెన్నైలకు విస్తరణ • ఈ ఏడాది ముగింపులోగా రూ.5 కోట్ల నిధుల సమీకరణ • ‘స్టార్టప్ డైరీ’తో వే2 నిర్మాణ్ ఫౌండర్ సీతారామరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంట్లోని నల్లా రిపేరుకొస్తుంది.. ప్లంబర్ ఎక్కడుంటాడో తెలియదు! పండగొస్తుంది.. ఇంటికి పెయింటింగ్ వేయించాలి.. కానీ, పెయింటర్‌ను ఎలా సంప్రతించాలో అర్థం కాదు!! ⇒ ఇవే కాదు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్.. ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి పనికీ ఎక్కడికెళ్లాలో అర్థం కాదు. మార్కెట్లోకెళితే.. మనకవసరమైన పనులు కాబట్టి.. వారు ఎంత చెబితే అంతే ఇవ్వాలి. లేకపోతే రారు.. చేయరు!! ⇒ ఇదిగో సరిగ్గా ఇలాంటి అనుభవమే సివిల్ ఇంజనీరు సీతారామరాజుకూ ఎదురైంది. చిన్న పనికి జేబులోని రూ.500 వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న రిపేర్లకూ జేబుగుల్ల చేసుకునే బదులు ఈ రంగానికి టెక్నాలజీని జోడించి.. వ్యవస్థీకృతం చేస్తే ఎలా ఉంటుందని!! ఇంకేముంది గతేడాది మేలో హైదరాబాద్ కేంద్రంగా వే2నిర్మాణ్.కామ్ ప్రారంభమైంది. ⇒ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటర్, మేస్త్రీ, పెయింటర్, ఇంటీరియర్ డిజైన్, ఎలివేషన్స్, ప్లాన్స్ వంటి ఇంటికి సంబంధించిన 10 రకాల సేవలందిస్తున్నాం. ఇందులో ఇంటీరియర్, ప్లాన్స్ సేవలు దేశవ్యాప్తంగా అందిస్తుంటే.. మిగతావి హైదరాబాద్‌కే పరిమితమయ్యాం. 2 నెలల్లో బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలు ఆరంభమవుతున్నాయి. ⇒ సాఫ్ట్వేర్ అభివృద్ధి, మార్కెటింగ్, ఉద్యోగుల నియామకం కోసం రూ.40 లక్షల వరకు ఖర్చయింది. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులు, ఐదుగురు ఐటీ నిపుణులున్నారు. వృత్తి నిపుణుల వివరాలను పూర్తిగా వెరిఫై చేశాకే నియమించుకుంటాం. వారితో అగ్రిమెంటు చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ, నమ్మకమైన సర్వీసు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ⇒ సర్వీసు విషయంలో సామాన్య, ఎగువ తరగతులనే తేడా లేదు. ఎవరికైనా ఒకటే ధర. చేసిన పనికి మాత్రమే చార్జీ. కనిష్ట ధర రూ.100. ప్రస్తుతం రోజుకు 60-80 కాల్స్ వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మేస్త్రీ, ప్లంబింగ్, పెయింటింగ్ ఆర్డర్స్ ఉంటున్నాయి. ⇒ నెలకు రూ.10 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పోగా.. రూ.2 లక్షల వరకు ఆదాయంగా మిగులుతోంది. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఈ ఏడాది రూ.5 కోట్ల నిధుల సమీకరిస్తాం. వారంరోజుల్లో ఆండ్రాయిడ్ యాప్‌ను తెస్తున్నాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఉపాధికి ఊతం
ఎటపాకలోని ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్(వీటీఐ) ద్వారా ప్రస్తుతం 82 మంది శిక్షణ పొందుతున్నారు. జీపు డ్రైవింగ్, మెకానిజం, ప్లంబింగ్, కనస్ట్రక్షన్, బోర్వెల్ మెకానిక్ తదితర ట్రేడ్లలో తర్ఫీదు ఇస్తున్నారు. మూడు నెలల ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఐటీడీఏ ద్వారా ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జీపు డ్రైవింగ్ నేర్చుకున్న వారికి లెసైన్సు ఇప్పించటంతో పాటు, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే వాహనాలను వారే నడిపించేందుకు అవకాశం కల్పించనున్నారు. బోర్వెల్ మెకానిక్‌లో శిక్షణ పొందిన వారికి పంచాయతీల్లో, కన్స్ట్రక్షన్ తర్ఫీదు పొందిన వారికి గృహ నిర్మాణ సంస్థల్లో పనులు కల్పించనున్నారు. వీటీఐకి పూర్వవైభవం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకలకు ఉపాధిని కల్పించేందుకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎటపాక సమీపంలో 1997లో వీటీఐను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.1.04 కోట్లను ఖర్చు చేసి 1,503 మంది గిరిజనుల స్వయం ఉపాధి కోసం వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ సంస్థ కూడా గుర్తింపునిచ్చింది. కొండరెడ్లకు వెదురు ఉత్పత్తుల తయారీనే ప్రధాన జీవనాధారమని గుర్తించిన అప్పటి అధికారులు, ఈ కేంధ్రం ద్వారా బాంబో క్రాప్ట్స్ తయారీపై శిక్షణ ఇప్పించారు. తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కూడా కల్పించి వారికి ఇతోధికంగా సహాయపడ్డారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థకు నిధుల కొరత కారణంగా 2011లో మూతపడింది. ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టు అధికారులు దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వీటీఐ మూత పడినట్లేనని అంతా భావించారు. కానీ ప్రస్తుత పీఓ దివ్య మళ్లీ దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఉపాధికి మళ్లీ పునాది ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌లో ఎక్కువ మంది ఉపాధి కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఉన్నప్పటికీ, ఇలా దర్బార్‌కు ఎందుకొస్తున్నారని పీఓ దివ్య ఆరా తీశారు. కొన్నేళ్లుగా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ద్వారా నియామకాలు లేకపోవడమే కారణమని తెలుసుకున్న ఆమె దీనిపై సమీక్షించారు. ఏజెన్సీలోని ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్నపాటి ఉద్యోగమైన ఎంప్లాయిమెంట్ సిఫార్సు ద్వారా కల్పించాలని ఆదేశాలు ఇస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీటీ ఐ మూత పడిన విషయాన్ని తెలుసుకున్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు వీటీఐ అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన పీవో దీన్ని తెరిపించేందుకు ప్రతిపాద నలు తెప్పించుకున్నారు. శిక్షణ కోసం రూ. 9.17 లక్షలు విడుదల చేశారు. దీంతో వీటీఐలో 19వ బ్యాచ్ ప్రారంభమైంది. శాశ్వత కేటాయింపులు లేకనే... వీటీ ఐను మంచి ఆశయంతో నిర్వహిస్తున్నప్పటికీ, ఐటీడీఏ అధికారుల ద యా దాక్షణ్యాలుంటేనే శిక్షణలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ సంస్థ గుర్తింపు ఉన్నప్పటికీ దీనికి శాశ్వత నిధులు లేకపోవటం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. సొంత మార్కు కాకుండా గిరిజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాలనే సాగించే అధికారులున్నంత కాలం దీని నిర్వహణ ఢోకా లేకున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు మారినప్పుడల్లా ఇది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే మూడేళ్ల పాటు మూత వేయాల్సి వచ్చింది. దీని నిర్వహణకు ఆటంకం లేకుండా ప్రభుత్వం ద్వారా తగిన నిధులు రాబట్టేందుకు ప్రస్తుత పీఓ దృష్టి సారించాలని గిరిజన యువత కోరుతోంది. ఇది పీఓ దివ్య వల్ల సాధ్యమవుతుందనే నమ్మకాన్ని కూడా గిరిజన సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రలో విలీనంతో పయనమెటు..? వీటీఐ ఉన్న ఎటపాక ప్రాంతం ఏపీలో విలీనమైంది. దీని కోసం ఇటీవల నిర్మించిన భవనాల్లో ఏపీ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చే యాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న సంస్థను జిల్లాలోని వేరే చోటికి తరలించక తప్పలేదు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఐటీడీఏ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.