PML-N
-
నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు, మాజీ ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ (72)ను నామినేట్ చేశారు. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. పీఎంఎల్-ఎన్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తన ఎక్స్(ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తమ అధినేత నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు మరియం తెలియజేశారు. అలాగే.. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50)ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. پاکستان مسلم لیگ (ن) کے قائد جناب محمد نوازشریف نے وزیراعظم اسلامی جمہوریہ پاکستان کے عہدے کےلئے جناب محمد شہبازشریف کو نامزد کر دیا ہے جبکہ وزیراعلی پنجاب کے عہدے کےلئے محترمہ مریم نوازشریف کو نامزد کیا ہے۔ جناب محمد نوازشریف نے پاکستان کے عوام اور سیاسی تعاون فراہم کرنے والی… — Marriyum Aurangzeb (@Marriyum_A) February 13, 2024 وزیر اعظم شہباز شریف وزیراعلیٰ مریم نواز pic.twitter.com/kW3MbqmRCv — Badar Shahbaz 🇵🇰🇵🇸 (@BSWarraich) February 13, 2024 పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్-ఎన్’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: ప్రభుత్వంలో చేరబోం ఈ క్రమంలో షరీఫ్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. -
నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల వేళ నెలకొన్న గందరగోళం నడుమ.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చారు. అశేష సంఖ్యాక మద్దతుదారుల నడుమ.. తమ పార్టీ పీఎంఎల్-ఎన్(పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్) ఘన విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అయితే.. పాక్ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయకముందే.. షరీఫ్ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు.. అత్యధిక స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుందని తెలిపిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేదని, సంక్షోభంతో గాయపడ్డ పాక్‌ను పునరుద్ధరించేందుకు మిగతా పార్టీలు ముందుకు రావాలని.. ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలని కోరడం గమనార్హం. ఇందుకోసం పీపీపీ(Pakistan Peoples Party) నేత పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారినీ సైతం ఆయన ఆహ్వానించారు. అంటే పాక్ ఎన్నికల ఫలితాలు దాదాపు హంగ్ అనే సంకేతాను షరీఫ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రపంచంతో సంబంధాలు బలోపేతం కోసం త్వరలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారాయన. #WATCH | Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "...We want our relations with the world to be better...We will improve our relations with them and resolve all our issues with them..." (Video: Reuters) pic.twitter.com/MJbxcV2Dox — ANI (@ANI) February 9, 2024 Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "We congratulate you all because, with God's blessings, Pakistan Muslim League (N) has emerged as the largest party...We respect the mandate given to every party...We invite them to sit with us… pic.twitter.com/im2DqIDeRG — ANI (@ANI) February 9, 2024 కానీ, ఎన్నికల్లో పీఎల్‌ఎం-ఎన్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందనేది షరీఫ్ స్పష్టంగా చెప్పలేదు. మొత్తం 366 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు రావాలి. అయితే.. పాక్ ఈసీ ప్యానెల్లో మాత్రం పీఎంఎల్-ఎన్ 61 స్థానాల దగ్గరే ఉందని తెలుస్తోంది. అయితే పాక్‌లో ఎన్నికల ఫలితాలపై.. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం ఒక స్పష్టత రావొచ్చు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ మద్దతుదారులు(స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి) అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నట్లు రోజంతా ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం ఇటు షరీఫ్ ప్రకటనను.. అటు ఇమ్రాన్ మద్దతుదారుల ప్రకటనను దేనిని ధృవీకరించకపోవడం గమనార్హం. సంబంధిత వార్త: నెట్ కట్ చేస్తే.. ట్విస్టులు.. ఝలక్‌లు -
‘ఇమ్రాన్‌కు పోటీగా విపక్షాల అభ్యర్థి’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 11న పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆయనకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలైనా నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ, బెనర్జీర్ భుట్టో కుమారుడి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు ఏకతాటిపైకి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గురువారం రెండు పార్టీల నేతలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఇమ్రాన్‌కు పోటీగా విపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పాటు జరిగిందని పీఎంఎల్-ఎన్ పార్టీ నేత మర్యమ్ ఔరంగజేబు తెలిపారు. ఎన్నికలు జరిగనప్పటి నుంచి పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు ఇమ్రాన్ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై 25న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం కొన్ని చిన్న పార్టీలు, పలువురు ఇండిపెండెట్ల మద్దతుతో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడ్డారు.విపక్షాలు ఎంతగా ప్రయత్నించిన ఇమ్రాన్ ప్రధాని కాకుండా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాకిస్తాన్ పీఠంపై ఇమ్రాన్!
ఇస్లామాబాద్: తీవ్రమైన ఆరోపణలు, వాగ్వాదాలు, భారీ హామీల అనంతరం బుధవారం పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగియగానే.. ఏడు గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని.. పీఎంఎల్–ఎన్, పీటీఐ మధ్య నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉండొచ్చని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే.. తాజా ఫలితాల ప్రకారం పాకిస్తాన్ ప్రధాని పీఠం.. మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కే దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్ పార్లమెంటులోని 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ కడపటి వార్తలందేసరికి 107 స్థానాల్లో ముందంజలో ఉంది. మెజార్టీకి అవసరమైన 137 సీట్ల దిశగా దూసుకెళ్తోంది. పీఎంఎల్–ఎన్ 70 సీట్లలో, పీపీపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ముత్తహిదా క్వామీ మూమెంట్ (ఎంక్యూఎం) 11 చోట్ల దూసుకుపోతోంది. 55కి పైగా స్థానాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితులుంటే పీపీపీ కింగ్‌మేకర్ కానుందని పాకిస్తాన్ విశ్లేషకులంటున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్ పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనబడుతోంది. షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ఎన్ను గద్దెదించేందుకు పీటీఐ చేసిన ప్రయత్నానికి ఐఎస్ఐతోపాటు పాక్ ఆర్మీ లోపాయకారిగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ఫలితాలతో పీటీఐ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కౌంటింగ్ జరుగుతుండగానే ఇమ్రాన్ అనుచరులు సంబరాలు ప్రారంభించారు. ఉగ్రదాడుల్లో అభ్యర్థులు చనిపోవడంతో రెండుచోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 2017 పాకిస్తాన్ జనగణన ఆధారంగా నియోజకవర్గాలను విభజించి ఎన్నికలు నిర్వహించారు. దీని ప్రకారం ఇస్లామాబాద్ నగరంలోనే మూడు ఎంపీ సీట్లున్నాయి. ఇవి కాకుండా పంజాబ్‌లో 141, సింధ్‌లో 61, ఖైబర్–ఫక్తున్ఖ్వాలో 39, బెలూచిస్తాన్‌లో 16, గిరిజన ప్రాంతాల్లో 12 సీట్లున్నాయి. విపక్షాల రిగ్గింగ్ ఆరోపణలు రిగ్గింగ్ కారణంగానే పీటీఐ మెజారిటీ గెలిచిందంటూ విపక్ష పీఎంఎల్–ఎన్, పీపీపీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని పీఎంఎల్ఎన్ ఆరోపించింది. చాలాచోట్ల తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్లనుంచి బయటకు గెంటేశారని ఆరోపించింది. పీపీపీ కూడా ఎన్నికలు సవ్యంగా జరగలేదని చాలాచోట్ల రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కరాచీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపించారని పేర్కొంది. దీనిపై ఈసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రావిన్సుల్లో.. పంజాబ్ ప్రావిన్సులో పీఎంఎల్–ఎన్ మెజారిటీకి చేరువలో ఉన్నట్లు సమాచారం. కీలకమైన పంజాబ్ ప్రావిన్సు అసెంబ్లీ ఎన్నికల్లో 297 సీట్లలో ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో పీఎంఎల్–ఎన్ 131 సీట్లలో పీటీఐ 70 స్థానాలను గెలుచుకున్నాయి. సింధ్ అసెంబ్లీ ప్రావిన్సులో తన కంచుకోటను పీపీపీ కాపాడుకుంటోంది.. ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 131 సీట్లలో ఫలితాలు వెల్లడైన 92 సీట్లలో పీపీపీ 60 చోట్ల ముందంజలో ఉంది. ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రావిన్సులో పీటీఐ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓటింగ్ కొనసాగిందిలా! ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 85వేల పోలింగ్ కేంద్రాల్లో జరిగింది. ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల్లో 30 వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టెన్షన్ వాతావరణంలోనూ పాకిస్తాన్ ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 10.6 కోట్ల మంది ఓటర్లలో 53 శాతం మంది ఓటింగ్ వినియోగించుకున్నారు. ఇమ్రాన్, షాబాజ్లపై ఈసీపీ సీరియస్ ఎన్నికల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, పీఎంఎల్–ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లపై ఈసీపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామాబాద్ నుంచి ఎంపీగా బరిలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ తన ఓటును రహస్యంగా ఉంచకుండా మీడియాకు చూపిస్తూ ఓటేశారు. దీంతో ఆయన ఓటును రద్దు చేసిన ఎన్నికల సంఘం.. సోమవారం తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షాబాజ్, ఆసిఫ్‌లు కూడా మీడియాతో మాట్లాడినందున వీరిపై చర్చలు తీసుకుంటారని సమాచారం. ఎన్నికలు హింసాత్మకం ఆత్మాహుతి దాడిలో 35 మంది మృతి ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంటు, 4 ప్రావిన్సుల (పంజాబ్, సింధ్, ఖైబర్–ఫక్తున్ఖ్వా, బెలూచిస్తాన్) అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా దేశంలో పలుచోట్ల హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 35 మంది మృతిచెందగా.. 67 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పాక్ నైరుతి ప్రాంతమైన క్వెట్టాలో పోలింగ్‌బూత్ బయట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలోనే 31 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం కారణంగా మరో నలుగురు హత్యకు గురయ్యారు. బెలూచిస్తాన్ రాజధాని అయిన క్వెట్టాలోని అతిసున్నిత ప్రాంతమైన ఎన్ఏ–360 నియోజకవర్గంలో అనుమానాస్పద వ్యక్తిని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు ఆపేశారు. భారీ బందోబస్తు కారణంగా లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వెంటనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. గెలుపును లెక్కించేదెలా? ఎన్నికలు జరిగిన 272 సీట్లలో మెజారిటీ స్థానాల్లో ముందుగా గెలవాలి. ఆ తర్వాత మిగిలిన 70 సీట్ల (60మంది మహిళలు, 10 మంది భాషా ప్రాతిపదికన మైనారిటీ ప్రతినిధులు) ను ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా పంచుతారు. ఆ తర్వాత మొత్తం 172 పొందిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. అయితే.. దాదాపుగా 137 సీట్లు పొందిన పార్టీ లేదా కూటమి మిగిలిన స్థానాలను పొందటం పెద్ద కష్టమేంకాదు. అప్పుడు కెప్టెన్..ఇప్పుడు పీఎం? పాకిస్తాన్ ప్రధాని రేసులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ 1996లో పీటీఐ పార్టీని స్థాపించారు. అంతకుముందు, క్రికెట్ క్రీడాకారుడిగా చిరపరిచితులే. 1992లో ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించారు. ఆ తరువాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సామాజిక సేవకు అంకితమయ్యారు. తన తల్లి జ్ఞాపకార్థం 1994లో లాహోర్‌లో, 2015లో పెషావర్‌లో రెండు కేన్సర్ ఆసుపత్రులను నెలకొల్పారు. 2002లో తొలిసారి మియాన్వాలి స్థానం నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013 ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2005–14 మధ్య బ్రాడ్ఫోర్డ్ యూనివర్సిటీ(ఇంగ్లండ్)కి చాన్స్‌లర్‌గా వ్యవహరించారు. 1952లో లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్‌ఖాన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన ఈ ఏడాది బుష్రా మానికా అనే మహిళను మూడో వివాహం చేసుకున్నారు. తన అనుచరులు ఇప్పటికీ ఇమ్రాన్‌ను కప్తాన్, కెప్టెన్ అని పిలుచుకుంటారు. ఇమ్రాన్‌తో భారత్‌కు ముప్పే! ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ ముందంజలో ఉంది. దాయాది దేశమైన పాకిస్తాన్లో సంభవించే రాజకీయ పరిణామాలు భారత్‌పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ గెలిస్తే భారత్–పాక్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ చాలా కాలంగా భారత వ్యతిరేక ధోరణే ప్రదర్శిస్తున్నారు. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నవాజ్ షరీఫ్‌పై నిప్పులు కక్కుతున్నారు. భారత ప్రధాని మోదీ భాషలోనే నవాజ్ మాట్లాడుతున్నారని గతంలో ఇమ్రాన్ విమర్శలు చేశారు. నవాజ్‌ను ఆధునిక మీర్ జాఫర్‌తో పోల్చారు. పాక్‌లో చాలా కాలం పాటు అధికారం చెలాయించిన సైన్యానికి అనుకూలుడిగా ఉండటమే కాక దేశాన్ని సైన్యమే పాలించాలన్న అభిప్రాయంలో కూడా ఆయన ఉన్నారు. అంతే కాకుండా ఇస్లామిక్ సంప్రదాయాల కొనసాగింపునకు ఇమ్రాన్ సానుకూలమన్నది ఆయన ప్రకటనల్లోనే నిరూపితమవుతోంది. దేశ ప్రధాని కావాలన్న ప్రగాఢ వాంఛ ఇమ్రాన్‌కు ఉంది. పార్టీ పెట్టిన కొత్తలో ఇస్లామిక్ తీవ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. అయితే, 2013 ఎన్నికల్లో ఘోరంగా ఓడి పోవడంతో తన వైఖరి మార్చుకున్నారు. మత ఛాందసవాదిగా మారడంతో పాటు సైన్యానికి దగ్గరయ్యా రు. పాక్‌లోని ఉగ్ర సంస్థ హర్కతుల్ మొజాహిదీన్ అధినేత మౌలానా ఫజులుర్ రెహమాన్ వంటి వారు ఇమ్రాన్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్‌కు పాక్ సైన్యం, ఐఎస్ఐ, తాలిబాన్, ఇతర ఉగ్ర సంస్థల మద్దతు కూడా ఉందన్నది కాదనలేని వాస్తవం. సైన్యం జోక్యం పెరుగుతుంది ఒకవేళ ఇమ్రాన్ పార్టీయే అధికారంలోకి వస్తే పాలనలో మళ్లీ సైన్యం జోక్యం ప్రబలడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సైన్యం పెత్తనం చేపడితే భారత్‌కు సమస్యలు తప్పవని వారి భావన. ఇమ్రాన్ అధికారంలోకొస్తే పాక్‌లోని భారత వ్యతిరేక ఉగ్రసంస్థలకు మరింత బలం చేకూరుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్యంతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ బలంగా సంకేతాలు పంపుతున్నారని ‘ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ థింక్ ట్యాంక్’ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ ఇటీవల అల్జజీరాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకూడదనీ, హంగ్ రావాలని సైన్యం ఆశిస్తోంది. ఎవరికీ మెజారిటీ రాకపోతే తాను చక్రం తిప్పవచ్చన్నది సైన్యం ఆలోచన. ఆ పరిణామం భారత్‌కు మంచిది కాదు. పాక్‌కు కూడా ప్రయోజనకరం కాదు’ అని పేర్కొన్నారు. క్వెట్టాలో ఆత్మాహతి దాడిలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం లాహోర్‌లో ఓటు హక్కువినియోగించుకుంటున్న హఫీజ్ సయీద్ -
పాక్‌లో ఊహించని పరిణామాలు
రావల్పిండి : పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్)కు చెందిన నేతలకు పలు కేసుల్లో శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు వెలువడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో అడుగుపెట్టిన ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను, ఆయన కూతురు మరియమ్‌ను పాక్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు హనీఫ్ అబ్బాసీకి జీవిత ఖైదు విధిస్తూ సీఎన్ఎస్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ముందర ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూలై 25న జరిగే ఎన్నికల్లో తాము అనుకున్న వారిని గెలిపించుకోవడానికి ఐఎస్ఐ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. తీవ్రవాదం వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని విమర్శించారు. యూఎస్ కూడా పాక్ ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఐఎస్ఐ మీడియాను, న్యాయవ్యవస్థను కంట్రోల్ చేస్తుందని అన్నారు. రావల్పిండి బార్ అసోసియేషన్ కూడా ఐఎస్ఐపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వచ్చేలా న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. షరీఫ్, మరియమ్ కేసుల్లో కూడా అలానే జరిగిందని అన్నారు. కాగా పాక్ మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ సమాఖ్య భావిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్ ఖలీల్ కూడా పీటీఐ పార్టీకి మద్దతుగా ప్రకటన చేయడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాకిస్తాన్ కొత్త ప్రధాని ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్: జడలు విప్పిన ఉగ్రవాదం, ఆర్థిక సహాయంపై అమెరికా వెనకడుగు.. అంతలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా! అసలే రాజకీయ అస్థిరతకు మారుపేరుగా ఉన్న పాకిస్తాన్.. తక్షణ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఆ దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు నియమితులవుతారు?.. సగటు పాకిస్తానీలనే కాదు ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి! దీనికి సంబంధించి పాక్ మీడియాలో ఒక పేరు బలంగా వినబడుతోంది. పంజాబ్ ఫ్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్.. పాక్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్తాన్ ముస్లీం లీగ్(నవాజ్) పార్టీకే చెందిన ఈ నాయకుడు మరెవరోకాదు.. పదవీచ్యుతుడైన నవాజ్‌కు సొంత తమ్ముడే! పనామా లీక్స్‌లో షరీఫ్‌తోపాటు ఆయన కుమార్తెలు, కుమారుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో రాజకీయ వారసత్వం సోదరుడు షెహబాజ్‌కు దక్కినట్లవుతుంది. కాగా, ప్రధానిగా షెహబాజ్ పేరు ఖరారుకు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటనా వెలువడలేదు. పదవి పోయినా పవర్ ఆయనదే! ’పనామా’ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్.. ప్రభుత్వంపై పెత్తనాన్ని మాత్రం కోల్పోలేదు. మొత్తం 342 స్థానాలున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీనే అతిపెద్ద పార్టీ. 2013 ఎన్నికల్లో 189 సీట్లు సాధించిన నవాజ్ పార్టీ జయూఐ-ఎఫ్(13 సీట్లు), పీఎంఎల్-ఎఫ్(5 సీట్లు), ఎన్పీపీ(2సీట్ల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శుక్రవారం నాటి తీర్పు విపక్షాల విజయమే అయినప్పటికీ నవాజ్ పార్టీ ప్రభుత్వం మాత్రం కూలిపోయే అవకాశాలు లేవు. పార్టీపై గట్టిపట్టున్న నవాజ్.. కొత్త ప్రధానిగా ఎవరిని నియమించినా పార్టీ సభ్యులు అడ్డుచెప్పలేని పరిస్థితి. ముందస్తు ఎన్నికలు? భారత్‌లో లాగే పాకిస్తాన్‌లోనూ ప్రతి 5ఏళ్లకు ఒకసారి జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. చివరిగా(2013లో) జరిగిన ఎన్నికల్లో నవాజ్‌షరీఫ్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దాని పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. 2018 జూన్ 5 తర్వాత ఎన్నికల నగారా మోగనుంది. అయితే, శుక్రవారంనాటి సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే వార్తలు వచ్చాయి. ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షరీఫ్.. ఎంతకాలం పాటు పదవికి దూరంగా ఉండాలనే దానిపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, తినిగి గద్దెనెక్కాలని నవాజ్ భావిస్తున్నారని, కానీ బ్యాడ్టైమ్లో అలాంటి(ముందస్తు) నిర్ణయం వద్దని పార్టీ నేతలు నవాజ్‌ను వారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. (తమ్ముడు షెహబాజ్ షరీఫ్, కూతురు మర్యామ్ నవాజ్‌లతో మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్(ఫైల్ ఫొటో)) -
హఫీజ్ ఏమన్నా గుడ్లు పెడుతున్నాడా: పాక్ ఎంపీ
ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి మరీ పలువురు నేతలు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ ఎంపీ రానా మహ్మద్ అఫ్జల్ మాట్లాడుతూ.. జమాత్ ఉద్ దవా చీఫ్, లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ' హఫీజ్‌ను పెంచి పోషిస్తున్నందుకు అతడు మనకు ఏమైనా గుడ్లు పెడుతున్నాడా?' అంటూ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో అఫ్జల్ ప్రశ్నించారు. భారత్‌లో ఉగ్రకార్యకలాపాల్లో హఫీజ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. అతడిపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందని అఫ్జల్ అన్నారు. విదేశీ వ్యవహారాల్లో పాకిస్తాన్ అవలంభిస్తున్న విధానాన్ని సైతం అఫ్జల్ ఎండగట్టారు. హఫీజ్ ఉగ్రవాది అనే విషయాన్ని భారత్ ప్రపంచవ్యాప్తంగా వెల్లడించిందని.. అలాంటి వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ఉగ్రవాదం విషయంలో చర్యలు తీసుకోవడం ద్వారా పాక్‌ను టెర్రరిస్ట్ స్టేట్‌గా ప్రకటించి ఒంటరిని చేయాలన్న ప్రపంచదేశాల ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. -
'ప్రధానమంత్రి రిగ్గింగ్ చేయించారు'
ముజఫరాబాద్: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్ష పార్టీలు, సాధారణ ప్రజలు చేపట్టిన ఆందోళనలతో పాక్ ఆక్రమిత్ కశ్మీర్(పీవోకే) అట్టుడికిపోతున్నది. జులై 21న వెల్లడైన 'ఆజాద్ జమ్ము కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ' ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్).. 42 స్థానాలకు గానూ 32 చోట్ల గెలుపొందింది. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, జాబితాలో పేరున్న పౌరులకు ఓట్లు వేసే అవకాశమే దక్కలేదని, ఐఎస్ఐని రంగంలోకి దింపి ప్రధాని నవాజ్ షరీఫ్ రిగ్గింగ్ కు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం పీవోకే విపక్షాలు చేపట్టిన బంద్ పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. పీవోకే రాజధాని నగరమైన ముజఫరాబాద్ సహా కోట్లి, చినారి, మిర్పూర్ పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించిన ఆందోళనకారులు రహదారులపై టైర్లు తగులబెట్టారు. మొన్నటివరకు అధికారంలో ఉండి, ఇప్పుడు నవాజ్ పార్టీ చేతిలో దెబ్బతిన్న ఆల్ జమ్ముకశ్మీర్ ముస్లిం లీగ్(ఏజేకేఎంఎల్) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఫలితాలను రద్దు చేసి, తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు డిమాండ్ చేశాయి. పీవోకేలో జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ 'అక్కడ హక్కుల ఉల్లంఘన జరుతుతున్నదన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలిసిందే' అన్నారు. ఇప్పటికైనా పీవోకే ప్రజల మనోభావాలను గౌరవించాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు హితవు పలికారు.