ఈక్విటీగా బ్యాంకుల ప్రిఫరెన్స్ షేర్లు
న్యూఢిల్లీ: మూడు బ్యాంకులలో ప్రభుత్వానికున్న నాన్‌క్యుమిలేటివ్ ప్రిఫరెన్స్ షేర్లను(పీఎన్‌సీపీఎస్) ఈక్విటీగా మార్పు చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఆయా ప్రభుత్వ బ్యాంకులలో కేంద్రానికి వాటా పెరగనుంది. ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్, యూకో బ్యాంక్‌లలో ప్రిఫరెన్స్ షేర్లను ఈక్విటీగా మార్పు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు చిదంబరం గురువారం పేర్కొన్నారు.
దీంతో బాసెల్-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు పెట్టుబడులు సమకూరడంతోపాటు, ప్రభుత్వానికి పెరిగిన వాటామేరకు మరింత డివిడెండ్ లభించనుంది. ప్రిఫరెన్స్ షేర్లు ఈక్విటీగా మార్పుచెందడం ద్వారా ఇండియన్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా ప్రస్తుత 80% నుంచి 82.22%కు పెరగనున్నట్లు చిదంబరం చెప్పారు. ఇదే విధంగా యూకో బ్యాంక్‌లో వాటా 69.26% నుంచి 77.25%కు, విజయా బ్యాంక్‌లో వాటా 55.02% నుంచి 71.85%కు పుంజుకోనున్నట్లు తెలి పారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వానికి ఇండియ న్ బ్యాంక్‌లో రూ.400 కోట్లు, యూకో బ్యాం క్లో రూ.1,823 కోట్లు, విజయా బ్యాంక్‌లో రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు జారీకానున్నాయి.