Pockets
-
లోకేష్ యాత్ర లో మజ్జిగ ప్యాకెట్లు..ఎలా విసురుతున్నారో చూడండి
-
గుట్కా, ప్యాకెట్ల, పట్టివేత
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణానికి రవాణా చేస్తున్న రూ.77 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి హోల్‌సేల్‌గా గుట్కా ప్యాకెట్లను కారులో రవాణా చేస్తున్న ముఠాను పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో ఎండీ అఖిల్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ జహంగీర్‌తో కలిసి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను చేరవేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఖమ్మం పట్టణానికి చెందిన కారు డ్రైవర్ ఎస్కే షహబుద్దీన్ సహకారం అందించాడని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. తనిఖీల్లో ఏఎస్సై రామచంద్రరాజు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు బి.వెంకటేశ్వరరావు, రాజేష్ ఉన్నారు. ఫోటో నెంబరు: 01ఎస్పిఎల్01, రైటప్ : పట్టుబడిన గుట్కాలను చూపిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్ -
ఐసీఐసీఐ ‘ఎంవీసా’ మొబైల్ పేమెంట్ సేవలు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ‘ఎంవీసా’ పేరిట మొబైల్ పేమెంట్ సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ వాలెట్ ‘పాకెట్స్’ యాప్ ఉన్న స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. దీనితో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్యాక్సీ చార్జీలు, కరెంటు బిల్లులు మొదలైన వాటికి చెల్లింపులు జరపవచ్చని బ్యాంకు తెలిపింది. ఎంవీసా ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది తామేనని వివరించింది. ప్రస్తుతం షాపింగ్ చేసినప్పుడు కస్టమర్లు నగదు రూపంలో లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లో కార్డును స్వైప్ చేయడం ద్వారా గానీ చెల్లిస్తున్నారు. ఎంవీసా విధానంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లింపులు జరపవచ్చని బ్యాంకు ఈడీ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు.