ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ‘ఎంవీసా’ పేరిట మొబైల్ పేమెంట్ సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ వాలెట్ ‘పాకెట్స్’
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ‘ఎంవీసా’ పేరిట మొబైల్ పేమెంట్ సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ వాలెట్ ‘పాకెట్స్’ యాప్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. దీనితో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్యాక్సీ చార్జీలు, కరెంటు బిల్లులు మొదలైన వాటికి చెల్లింపులు జరపవచ్చని బ్యాంకు తెలిపింది. ఎంవీసా ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది తామేనని వివరించింది. ప్రస్తుతం షాపింగ్ చేసినప్పుడు కస్టమర్లు నగదు రూపంలో లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌లో కార్డును స్వైప్ చేయడం ద్వారా గానీ చెల్లిస్తున్నారు. ఎంవీసా విధానంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లింపులు జరపవచ్చని బ్యాంకు ఈడీ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు.