polepalli Sage
-
పోలేపల్లి సెజ్‌లో ఎఫ్‌బీఓల ఎంపిక పరీక్షలు
జడ్చర్ల : మండల పరిధిలోని పోలేపల్లి సెజ్‌లో ఫారెస్ట్ బీట్‌ఆఫీసర్ల ఎంపికకు సంబందించి నడక పరీక్షలు సోమవారం నిర్వహించారు. పోలేపల్లి సెజ్ రహదారులపై 4గంటలలో 25 కిమీల దూరానికి సంబందించి నడక, దేహదారుఢ్య ఇతర పరీక్షలు ఫారెస్ట్ అధికారులు నిర్వహించారు. మొత్తం 64మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు పది మంది గైర్హాజరయ్యారు. మొత్తం 48మంది అభ్యర్థులు ఈ పోటీల్లో అర్హత సాధించారు. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ఎంపిక కొనసాగే అవకాశం ఉంది. కలెక్టర్ పరిశీలన ఎంపిక పరీక్షలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. అభ్యర్థుల వివరాలను, పరీక్ష తీరును అడిగి తెలుసుకున్నారు. అవకతవకలు చోటుచేసుకోకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. నేడు పరీక్షలు మంగళవారం నడక పరీక్షలు కొనసాగు తాయని ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ చంద్రయ్య తెలిపారు. 63మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. బుధవారం మహిళా అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయని డీఎఫ్ఓ గంగారెడ్డి తెలిపారు. -
18న జిల్లాకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
జడ్చర్ల: ఈనెల 18న జిల్లాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రానున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పోలేపల్లి సెజ్‌లో మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి, తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు శనివారం సాయంత్రం పరిశీలించారు. పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో కొనసాగుతున్న హెటిరో ఫార్మా పరిశ్రమలో ఒక యూనిట్ విభాగాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. హెటిరో ముందు అరబిందో పరిశ్రమలో ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించారు. కాగా, షాద్‌నగర్ పరిధిలో కొత్తగా నిర్మించిన పీఎన్జీ, జాన్సన్ ఆండ్ జాన్సన్, అడ్డాకుల మండలం వేముల సమీపంలోని మరో పరిశ్రమను కూడా సీఎం ప్రారంభిస్తారని జడ్చర్లలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ జిల్లాకు మొదటిసారిగా రానుండడంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.