
ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
జడ్చర్ల : మండల పరిధిలోని పోలేపల్లి సెజ్‌లో ఫారెస్ట్ బీట్‌ఆఫీసర్ల ఎంపికకు సంబందించి నడక పరీక్షలు సోమవారం నిర్వహించారు. పోలేపల్లి సెజ్ రహదారులపై 4గంటలలో 25 కిమీల దూరానికి సంబందించి నడక, దేహదారుఢ్య ఇతర పరీక్షలు ఫారెస్ట్ అధికారులు నిర్వహించారు. మొత్తం 64మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు పది మంది గైర్హాజరయ్యారు. మొత్తం 48మంది అభ్యర్థులు ఈ పోటీల్లో అర్హత సాధించారు. టీఎస్‌పీఎస్‌సీ నిబంధనల మేరకు ఎంపిక కొనసాగే అవకాశం ఉంది.
కలెక్టర్ పరిశీలన
ఎంపిక పరీక్షలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. అభ్యర్థుల వివరాలను, పరీక్ష తీరును అడిగి తెలుసుకున్నారు. అవకతవకలు చోటుచేసుకోకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
నేడు పరీక్షలు
మంగళవారం నడక పరీక్షలు కొనసాగు తాయని ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ చంద్రయ్య తెలిపారు. 63మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. బుధవారం మహిళా అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయని డీఎఫ్‌ఓ గంగారెడ్డి తెలిపారు.