బెల్లంపల్లి జిల్లా కోసం మంత్రి, కలెక్టర్‌కు వినతులు | Minister for Bellampalli district, collector requests | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి జిల్లా కోసం మంత్రి, కలెక్టర్‌కు వినతులు

Published Fri, May 20 2016 2:09 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM

బెల్లంపల్లి జిల్లా కోసం మంత్రి, కలెక్టర్‌కు వినతులు - Sakshi

బెల్లంపల్లి జిల్లా కోసం మంత్రి, కలెక్టర్‌కు వినతులు

ఆదిలాబాద్ అర్బన్/కాసిపేట/తాండూర్/బెల్లంపల్లి : బెల్లంపల్లిని జిల్లా చేయాలని కోరుతూ ఆ నియోజకవర్గ నాయకులు గురువారం ఆదిలాబాద్‌లో కలెక్టర్ జగన్మోహన్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు వినతిపత్రాలు అందజేశారు. మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయూలనుకోవడం సరికాదని, అలా చేస్తే ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాలకు చాలా దూరం ఉంటుందని పేర్కొన్నారు. బెల్లంపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తేనే తూర్పు ప్రాంతంలో అన్ని మండలాలకు మధ్యలో ఉంటుందని, రవాణా భారం ఉండదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎస్ రాజీవ్ శర్మను కలిసి ఈ విషయం విన్నవించనున్నట్లు చెప్పారు. తాండూర్, దహెగాం, నెన్నెల ఎంపీపీలు మసాడే శ్రీదేవి, మంజూల, కల్యాణి భీమాగౌడ్, తాండూర్ మండల టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, ఎంపీటీసీ సిరంగి శంకర్, మాజీ సర్పంచ్ సాలిగామ బానయ్య, నాయకులు మాసాడి శ్రీరాములు, కాసిపేట జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకులు దుర్గం పోశం, దుస్స చందు, మోటూరి వేణు పాల్గొన్నారు.

 హైదరాబాద్‌కు వెళ్లిన అఖిలపక్షం నే తలు
 బెల్లంపల్లి : బెల్లంపల్లి జిల్లా కోసం అఖిలపక్షం నేతలు గురువారం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, ఎ.శ్రీదేవి, పి.సుభద్ర, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు ఎం.సూరిబాబు, ఎ.రాజేశ్వర్, బెల్లంపల్లి జెడ్పీటీసీ కారుకూరి రాంచందర్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీ నాయకులు బండి ప్రభాకర్, వి.కృష్ణ, గెల్లి రాజలింగు, ముల్కూరి చంద్రయ్య, ధర్ని సత్యనారాయణ, బి.కేశవరెడ్డి తదితరులు హైదరాబాద్‌కు తరలివెళ్లిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయలో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. డెప్యూటీ సీఎం మహెమూద్ అలీ, సీఎస్‌కు విన్నవిస్తామని నేతలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement