18న జిల్లాకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు | District officials are examining the possibilities of Peace on 18 CM | Sakshi
Sakshi News home page

18న జిల్లాకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Published Sun, Sep 14 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

18న జిల్లాకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

18న జిల్లాకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

జడ్చర్ల: ఈనెల 18న జిల్లాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రానున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పోలేపల్లి సెజ్‌లో మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి, తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు శనివారం సాయంత్రం పరిశీలించారు. పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో కొనసాగుతున్న హెటిరో ఫార్మా పరిశ్రమలో ఒక యూనిట్ విభాగాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. హెటిరో ముందు అరబిందో పరిశ్రమలో ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించారు. కాగా, షాద్‌నగర్ పరిధిలో కొత్తగా నిర్మించిన పీఎన్‌జీ, జాన్సన్ ఆండ్ జాన్సన్, అడ్డాకుల మండలం వేముల సమీపంలోని మరో పరిశ్రమను కూడా సీఎం ప్రారంభిస్తారని జడ్చర్లలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ జిల్లాకు మొదటిసారిగా రానుండడంతో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement