polished
-
కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో క్షీణత
ముంబై: కట్, పాలిష్డ్ వజ్రాల (సీపీడీ) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం తగ్గి 17.2 బిలియన్ డాలర్లుగా (రూ.1.42 లక్షల కోట్లు) ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, యూరప్ వంటి కీలక వినియోగ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో డిమాండ్ తగ్గిన విషయాన్ని ప్రస్తావించింది. ‘‘2022–23 ద్వితీయ ఆరు నెలల నుంచి సీపీడీల ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో చూసినా (ఏప్రిల్–ఆగస్ట్) ఎగుమతులు 31 శాతం తక్కువగా నమోదయ్యాయి’’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రానున్న నెలల్లో ఎగుమతులు సీక్వెన్షియల్‌గా (క్రితం నెలతో పోలి్చనప్పుడు) పెరగొచ్చని పేర్కొంది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరానికి 22 శాతం తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డైమండ్ల డిమాండ్‌లో చైనా వాటా 10–15 శాతంగా ఉంటుంది. చైనా మార్కెట్లో ఈ డిమాండ్ ఇంకా చెప్పుకోతగినంతగా పుంజుకోలేదు‘‘అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సాక్షి సునేజా తెలిపారు. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాలు చాలా తక్కువ ధరలో లభిస్తుండడం కూడా అధిక పోటీకి కారణమవుతున్నట్టు చెప్పారు. గరిష్ట స్థాయిలో ముడి వజ్రాల ధరలు ముడి వజ్రాల ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయని ఇక్రా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ధరలు 15 ఏళ్ల మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, మైనింగ్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే గడిచిన రెండేళ్ల కాలంలో ధరలు పెరగడానికి దారితీసినట్టు వివరించింది. ప్రస్తుతం డిమాండ్ తగ్గినప్పటికీ రష్యా నుంచి ముడి వజ్రాల సరఫరా తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన అల్రోసా పీజేఎస్సీ మైనింగ్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో ఇతర మైనింగ్ సంస్థల నుంచి అదనపు సరఫరా రాకపోవడం ధరలకు రెక్కలు వచి్చనట్టు వివరించింది. పాలిష్డ్ వజ్రాల ధరలపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల మధ్యస్థ స్థాయి కంటే 15–20 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనికి తోడు డిమాండ్‌పై ఒత్తిళ్లు, కస్టమర్లకు ధరల పెంపును బదిలీ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడంతో, వజ్రాల కంపెనీల లాభాల మార్జిన్లు 0.4 శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేసింది. నిల్వలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఎగుమతిదారులకు వెసులుబాటు 2024 జూన్ వరకూ ఆర్ఓడీటీఈపీ స్కీమ్ వర్తింపు ఎగుమతిదారుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆర్ఓడీటీఈపీ స్కీమ్ (స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పథకాన్ని 2024 జూన్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సెపె్టంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం, 10,342 పైగా ఎగుమతి వస్తువులు ఈ పథక ప్రయోజనాల కిందకు వస్తున్నాయి. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన పథకం ఇది. వస్తువుల తయారీ– పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించే పన్నులు, సుంకాలు, లెవీల వాపసు కోసం ఉద్దేశించినది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనివ్వనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఈ బియ్యం బలవర్ధకమేనా?
మన దేశ ప్రజల్లో 65 శాతం మంది తెల్లగా పాలిష్ పట్టిన వరి బియ్యాన్ని రోజువారీ ప్రధాన ఆహారంగా తింటున్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి మనిషీ రోజుకు 400–500 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. అయితే, మనం ఇందులో సగం కూడా తినటం లేదు. గత పదేళ్లుగా మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని కుంగదీస్తున్న పెను సమస్య రక్తహీనత. దీని మూలంగా స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం మేరకు దేశంపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను పీడిస్తున్న పౌష్టికాహార లోపాన్ని స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో అధిగమించడానికి కృత్రిమంగా పోషకాలను లేపనం చేసిన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయటమే మేలైన మార్గమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల కోసం 2014 నాటికి పూర్తిగా ఫోర్టిఫై చేసిన సబ్సిడీ బియ్యాన్ని మాత్రమే అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రయోగాత్మక దశ మూడేళ్లు. ఇందుకోసం రూ. 174 కోట్లు కేటాయించారు. అయితే, ఈ విధాన నిర్ణయంపై స్వతంత్ర పౌష్టికాహార నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోర్టిఫైడ్ బియ్యం అంటే? సింథటిక్ పోషకాలతో తయారు చేసిన బియ్యాన్ని సాధారణ బియ్యంలో కలిపి అందించడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే పేదల ఆరోగ్యం మెరుగుపరచవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బియ్యపు నూకను పిండి చేసి, ఆ పిండికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12లను కలిపి, అధునాతన యంత్రాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఇవి రంగు, సైజు అంతా బియ్యపు గింజల మాదిరిగానే ఉంటాయి. వంద సాధారణ బియ్యపు గింజలకు ఒక ఫోర్టిఫైడ్ గింజను కలిపి చౌక దుకాణాలు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కిలో బియ్యానికి ఐరన్ 28 మిల్లీ గ్రాములు, ఫోలిక్ యాసిడ్ 25–125 మిల్లీ గ్రాములతోపాటు విటమిన్ బి–12... 0.75 నుంచి 1.25 మిల్లీ గ్రాముల రసాయనిక పోషకాలు కలిపి ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేస్తున్నారు. ఏమిటీ అభ్యంతరాలు? రక్తహీనతకు ఐరన్ లోపం ఒక్కటే కారణం కాదనీ, ఐరన్ తదితర రసాయనిక పోషకాలను బియ్యానికి లేపనం చేసి అందించినా రక్తహీనత తగ్గలేదనీ ఐదు ఖండాల్లో జరిగిన ఓ అధ్యయనంలో తేలిందని 170 మంది ప్రజారోగ్య, పౌష్టికాహార నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు సంయుక్త బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అందరికీ ఐరన్ అదనంగా అవసరం ఉండదు. అవసరం లేని వారు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తినడం వల్ల మేలు కన్నా కీడు ఎక్కువ జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహార భద్రత పొందడానికి సరైన మార్గం ముడి, లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యం, దేశీ వరి బియ్యం, లేదా చిరుధాన్యాలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వినియోగాన్ని, ఆహార వైవిధ్యాన్ని పెంపొందించటమేనన్నారు. పెరటి తోటలు, మేడలపై ఇంటిపంటల సాగును, ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రతను పెంపొందించవచ్చు. పెరటి కోళ్లు, మాంసం, చేపల వినియోగం పెరగాలంటే ప్రజల ఆదాయం పెంపొందించే చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. రక్తహీనతను ఆరోగ్యదాయకంగా, సమర్థంగా అధిగమించడానికి ఇదే ఉత్తమ మార్గమని, రసాయనిక పోషకాలను బియ్యంలో గుప్పించడం కాదని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 13 దేశాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడుతున్నాయి. దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి సరిపడే ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫోర్టిఫికేషన్ ప్రక్రియలో వినియోగించే కృత్రిమ సూక్ష్మపోషకాలను 4–5 విదేశీ కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలు మున్ముందు కూడబలుక్కొని ధరలు పెంచే ప్రమాదం లేకపోలేదు. – పంతంగి రాంబాబు సీనియర్ జర్నలిస్టు -
మిల్లర్లు.. బకాసురులు
కర్నూలు: పేదల బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. అధికారుల నిఘా వైఫల్యం రైస్ మిల్లర్లకు వరమవుతోంది. కర్నూలు, ఆదోని కేంద్రంగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. నగరంలోని హనుమాన్ వేబ్రిడ్జి సమీపంలో.. రేడియో స్టేషన్ పక్కన.. బళ్లారి రోడ్డులోని ఎస్ఆర్ఎంటీ వద్ద.. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని రెండు రైస్ మిల్లుల్లో ఈ తరహా వ్యాపారం నిత్యకృత్యం. ఆదోనిలోని పలు మిల్లుల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా నలుమూలల నుంచి బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి ఆకట్టుకునే ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి కర్ణాటక, మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రంగు మారి తెల్లగా కనిపించేలా మిల్టెక్ అనే యంత్రంతో పాలిష్ చేస్తున్నారు. డీలర్లు, మధ్య దళారులు క్వింటా రూ.1200 నుంచి రూ.1500లకు కొనుగోలు చేస్తూ.. పాలిష్ చేసిన బియ్యాన్ని సన్న బియ్యంలో 20 నుంచి 40 శాతం కలిపి విక్రయిస్తున్నారు. క్వింటా రేషన్ బియ్యం పాలిష్ చేస్తే 20 శాతం తరుగు పోతోంది. జిల్లాలో 11.54 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 11.5వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ అవుతోంది. ఇందులో సగానికి పైగా అడ్డదారుల్లో రైస్ మిల్లులకు తరలుతోంది. రూపు మార్చుకొని మళ్లీ ఎక్కువ ధరతో వినియోగదారులకు చేరుతోంది. బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై అధికారుల నిఘా కొరవడటంతో రైస్ మిల్లుల యజమానులు తమ దందా నిర్భయంగా సాగిస్తున్నారు. భారీ మొత్తంలో రేషన్ బియ్యం నిల చేసుకుని రాత్రిళ్లు పాలిష్ చేసి తెల్లారేలోగా గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రతి నెలా 5.50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోందని ఓ జిల్లా అధికారే స్వయంగా చెప్పడం ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. రైస్ మిల్లులను తరచూ పౌర సరఫరాల శాఖ, ఆర్డీఓ స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని అడ్డగోలుగా సేకరిస్తూ రైస్ మిల్లర్లు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ మామూళ్లకు అలవడిన అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. కర్నూలు నగరంలోనే కనీసం 50 మందికి పైగా మధ్య దళారులు డీలర్లు, కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు చేరవేస్తున్నారు. జిల్లాలో 17 బియ్యం గోదాములు ఉండగా.. ప్రతి నెలా మొదటి వారంలో ఆయా గోదాముల వద్ద బియ్యం వ్యాపారులు తిష్ట వేసి గోడౌన్ ఇన్‌చార్జీలతో చేతులు కలిపి తమ పబ్బం గడుపుకుంటున్నారు. కేసులు నీరుగారుస్తున్న అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసి దుకాణాలను మూసేస్తున్నా ఇదేమని ప్రశ్నించని పరిస్థితి. అడపాదడపా మొక్కుబడి దాడులు చేస్తున్నా.. పీడీ యాక్టు అమలు చేయాల్సిన కేసులనూ 6ఏ తరహా సాధారణ కేసులు నమోదు చేసి ఆ తర్వాత నీరుగారుస్తున్నారు. వాహన డ్రైవర్లతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2013 జులై నుంచి 2014 జులై వరకు 100 పైగా 6ఏ కేసులు నమోదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గత నాలుగు నెలల్లో అక్రమ తరలింపు ఇలా... యాగంటిపల్లె వద్ద 500 క్వింటాళ్ల బియ్యం.. ప్యాపిలి వద్ద 223 క్వింటాళ్లు.. బనగానపల్లెలో 225 క్వింటాళ్ల.. అనంతపురంలో లారీ బియ్యం.. ఇదంతా గత నాలుగు నెలల్లో బనగానపల్లె పట్టణానికి చెందిన ఓ రైస్ మిల్లర్ కర్ణాటక రాష్ట్రంలోని బాచేపల్లికి తరలిస్తుండగా పట్టుబడింది. గత అక్టోబర్ రెండో వారంలో కర్నూలులోని పాతబస్తీకి చెందిన డీలర్ 20 క్వింటాళ్ల బియ్యం ఆటోలో తరలిస్తుండగా సీపీఎం కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అదే నెల 9న కోడుమూరులోని చౌరెడ్డి కాంప్లెక్స్ గోడౌన్లో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15న కర్నూలు నగరం బుధవారపేటలో ఓ డీలర్ 30 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా ఏఐవైఎఫ్ కార్యకర్తలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. 17న నందికొట్కూరు నుంచి కర్నూలుకు లారీలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లెక్చరర్స్ కాలనీ వద్ద అర్ధరాత్రి గస్తీ విధుల్లోని పోలీసులు పట్టుకున్నారు.