politecnic colleges
-
ఏపీ పాలీసెట్ ఫలితాలు వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలీసెట్-2018 ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని తెలిపారు. ఏప్రిల్ 12న పాలిసెట్ నిర్వహించగా మొత్తం 1,29,412 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. మొత్తంగా 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. బాలికలు 84.61శాతం, బాలురు 78.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. తూర్పు గోదావరికి చెందిన గీత సౌమ్య, కంకటాల సాయి శ్రీహర్ష, పశ్చిమ గోదావరికి చెందిన పిల్లి శ్రీకర్ బాబు మొదటి స్థానాల్లో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా హర్ష రెండో స్థానం, పశ్చిమ గోదావరి జిల్లాకు దినకర్‌బాబు మూడో ర్యాంకు దక్కించుకున్నారు. ఫలితాల కోసం చూడండి http://sakshieducation.com -
పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం సీట్లు ఖాళీ
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం వరకు సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. పాలిసెట్‌లో అర్హులైన అభ్యర్ధులకు గురువారం సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అలాట్మెంట్ పూర్తి చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 1,08,989 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఇందులో 48,975 మంది ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చారు. వీరిలో 47,116 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరంతా వివిధ కాలేజీల్లోని కోర్సులకు 8,87,939 ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 85 ప్రభుత్వ, 230 ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం సీట్లలో 83,617 కన్వీనర్ కోటా సీట్లుండగా 44,609 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 16,650 సీట్లలో 14,985 (90.81 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని 66,967 సీట్లలో 29,624 (44.23 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.