AP Polycet 2018 Results | ఏపీ పాలీసెట్‌ ఫలితాలు విడుదల - Download Rank Cards on Sakshi Education - Sakshi
Sakshi News home page

ఏపీ పాలీసెట్‌ ఫలితాలు వెల్లడి

Published Thu, May 10 2018 11:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

AP POLYCET 2018 Result Released - Sakshi

పాలీసెట్‌ ఫలితాలు వెల్లడిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలీసెట్‌-2018 ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని తెలిపారు. ఏప్రిల్‌ 12న పాలిసెట్‌ నిర్వహించగా మొత్తం 1,29,412 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. మొత్తంగా 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.

బాలికలు 84.61శాతం, బాలురు 78.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. తూర్పు గోదావరికి చెందిన గీత సౌమ్య, కంకటాల సాయి శ్రీహర్ష, పశ్చిమ గోదావరికి చెందిన పిల్లి శ్రీకర్‌ బాబు మొదటి స్థానాల్లో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా హర్ష రెండో స్థానం, పశ్చిమ గోదావరి జిల్లాకు దినకర్‌బాబు మూడో ర్యాంకు దక్కించుకున్నారు. ఫలితాల కోసం చూడండి http://sakshieducation.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement