Political JAC chairman
-
అందరికీ ఒకే రకమైన విద్య అందాలి
వర్సిటీల ప్రైవేటీకరణ దారుణం: కోదండరాం • విద్యా పోరాట బస్సు యాత్ర ప్రారంభం హైదరాబాద్: రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య అందజేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాం డ్ చేశారు. సోమవారం గన్‌పార్కు వద్ద తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో జరిగిన విద్యా పోరాట బస్సు యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ బిల్లు ఉన్నత విద్యారంగానికి గొడ్డలి పెట్టు వంటిదని కోదండరాం అన్నారు. రెండు దశాబ్దాలుగా వర్సిటీల్లో నియామకాల్లేవన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించ కుంటే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అసాధ్యమన్నారు. పాలకవ ర్గాలు ప్రసార మాధ్యమాలను గుప్పిట్లో ఉంచుకుని తమ అభిప్రాయాలను, నిర్ణయా లను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయ త్నం చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. విద్యా పోరాట యాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటిం చారు. కాగా, ఈ బస్సు యాత్ర ఈ నెల 20 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. సోమవారం సాయంత్రం ఉస్మానియా వర్సిటీకి చేరుకున్న బస్సుయా త్రకు ఓయూ విద్యార్ధులు, వివిధ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. సమాన విద్య కోసం పోరాడుదాం: ప్రొఫెసర్ హరగోపాల్ పేద, ధనిక తేడా లేకుండ అందరికీ సమాన విద్య కోసం కలసి పోరాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హమీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వ వర్సిటీలను బలోపేతంచేయాలని పేర్కొన్నారు. అంతకుముందు గన్‌పార్కు వద్ద హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యాలయాలను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం దుర్మార్గమైన రిలయన్స్ సంస్థకు విశ్వవిద్యాలయాలను అప్పగిస్తామని చెప్పడం దారుణమన్నారు. ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, మానవీయ తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యకు రూ.10 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం సిగ్గు చేటన్నారు. కనీసం 20 శాతం నిధులు కూడా కేటాయించకుంటే ఎలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధర్, కార్యనిర్వాహక కార్యదర్శి కె.లక్ష్మీ నారాయణ, ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు రహమాన్, ప్రొ.పద్మజాషా, ప్రొ.రత్నం, ఏఐఎస్ఎఫ్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్ఎల్ మూర్తి, పీడీఎస్‌యూ నాయకులు రంజిత్, నాగేశ్వర్రావు, డీఎస్‌యూ బద్రీ, నాయకులు అరుణాంక్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి జరగాలంటే పోరాటాలుండాల్సిందే
రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం మెదక్ టౌన్: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోరాటాలు జరగాల్సిందేనని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘తెలంగాణ పునర్నిర్మాణం - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆదివారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివక్షకు, దోపిడీకి గురికావడం వల్లే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ప్రజాసంఘాల వేదికగానే ఉద్యమం జరిగిందని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రజా సంఘాల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను తెలిపే సదస్సులను టీచర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు కనీస వసతులు అందేలా అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు చిన్న పరిశ్రమలు పెద్దఎత్తున రావాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిపై ప్రైవేటు
- పరిశ్రమల ప్రైవేటీకరణతో వీధిన పడుతున్న కార్మికుల కుటుంబాలు - అసంఘటిత కార్మిక సమాఖ్య మహాసభలో {పొఫెసర్ కోదండరామ్ కేయూ క్యాంపస్ : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం వల్లే వివిధ పరిశ్రమలు మూతపడి అసంఘటిత కార్మికుల సంఖ్య పెరుగుతోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. వీరికి ఉపాధిపై ప్రై‘వేటు’కనీస వేతన చట్టం కూడా అమలు కావడం లేదన్నారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో సోమవారం నిర్వహించిన అసంఘటిత కార్మిక సమాఖ్య రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్‌లోని అజంజాహిమిల్, హైదరాబాద్‌లోని ఐడీపీఎల్ వంటి సంస్థలు కూడా మూతపడ్డాయని, ఆల్విన్ కంపెనీని ప్రైవేటుపరం చేశారని చెప్పారు. సింగరేణిలోనూ కొన్ని పనులను ప్రైవేటు వారికి అప్పగించారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపర్చి ప్రైవేటీకరించడంతో అసంఘటిత కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు వారి ఉపాధిపై ప్రభావం పడుతోందన్నారు. విద్యుత్‌శాఖలో కాంట్రా క్ట్ పద్ధతిన పనిచేస్తున్న 27 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయూం లోనే పలు ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించారని అన్నా రు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు కూడా ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు అప్పనంగా భూములు ధారాదత్తం చేస్తున్నాయని, ఇలా హైదరాబాద్‌లో వందల ఎకరాల భూమి దక్కించుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆ భూములతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీ కోసమని ప్రభుత్వమే రైతుల నుంచి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి.. కొంతకాలం తర్వాత పరిశ్రమలు పెట్టకుండా రూ.45 లక్షలకు ఎకరం చొప్పున ఇతరులకు కట్టబెట్టిందని వివరించారు. తెలంగాణలోని అసంఘటిత కార్మికులతో పాటు రైతులు, బీడీ, చేనేత కార్మికులు, చిరు వ్యాపారులు, స్వర్ణకారుల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయన్నారు. పాలకవర్గాల విధానాల వల్లే.. పాలకవర్గాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్లే అసంఘటిత కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. పలు పోరాటాలతో కార్మిక సంక్షేమ చట్టాలు వచ్చినా, అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కార్మికులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని విమర్శిం చారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైం, ఔట్ సోర్సింగ్ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు. అసంఘటిత కార్మికులకు కూడా గౌరవప్రదమైన జీవనం కావాలని ఆకాంక్షించారు. ప్రజాపోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, అది ఏ ఒక్క పార్టీ ఘనత కాదని చెప్పారు. మహాసభలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బంటి శ్రీనివాస్, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బాధ్యులు నర్సాగౌడ్ మాట్లాడారు.