నిద్రాహారాలు మాని...
రాజకీయాల కోసం నిద్రాహారాలు మాని కుస్తీ పడుతున్నారు నటి మేగ్నారాజ్. ప్రస్తుతం వేడెక్కుతున్న రాజకీయ వాతావరణంలో నటి మేగ్నారాజ్ రాజకీయ గొడవేమిటని అనుకుంటున్నారా? అయితే ప్రస్తు తం ఈ బ్యూటీ రాజకీయరంగ ప్రవేశం చేయకపోయినా భవిష్యత్తులో అలాంటిది జరిగే అవకాశం ఉందంటున్నారు ఆమె సన్నిహితులు. తమిళంలో ఉయిరే తిరు 420, నందా నందిత, కాదల్ సొల్ల వందేన్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన మేగ్నారాజ్ ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క పొలిటికల్ సైన్స్ డిగ్రీ పొందడం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివేస్తున్నారట. త్వరలో పరీక్షలు మొదలు కానుండడంతో రాత్రుల్లో టీని తెగ తాగేస్తూ, చదువుతో కుస్తీ పడుతున్నారట. ఈ విషయంలో ఆమె కు తన స్నేహ బృందం ప్రోత్సాహం మెండుగా ఉందంటున్నారు. ఇంతకీ పొలి టికల్ సైన్స్ డిగ్రీ కోసం ఇంతగా నిద్రాహారాలు మాని పాటుపడటానికి కారణం మేగ్నా భవిష్యత్తులో రాజకీ య తెరంగేట్రం ఆలోచనేనని ఆమె స్నేహ బృందం పేర్కొంటోంది.