polling municipality
-
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్
-
ఎన్నికలకు 55,840 మంది సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు మార్చి 10న నిర్వహించనున్న ఎన్నికల కోసం పురపాలక శాఖ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో 9,308 పోలింగ్ కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించనున్న ఈ భారీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అంతేస్థాయిలో ఎన్నికల సిబ్బందిని వినియోగించాలని నిర్ణయించింది. అందుకు వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 55,840 మందిని భాగస్వాములను చేయనుంది. అందుకోసం జిల్లాల వారీగా, ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల వారీగా ప్రతిపాదనలను రూపొందించి ఆమోదించింది. ఆ వివరాలు.. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 55,840 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించనున్నారు. వారిలో రిటర్నింగ్ అధికారులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. ► ఎన్నికలు జరగనున్న 12 నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం (జీవీఎంసీ) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1,712 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 17.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో 10,271 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ► అలాగే, నగరపాలక సంస్థల్లో మచిలీపట్నంలో తక్కువ మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక్కడ 133 పోలింగ్ కేంద్రాల్లో 1.33 లక్షల మంది మాత్రమే ఓటు హక్కువినియోగించుకోనున్నారు. ఇందుకు 799 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ► మరోవైపు.. ఎన్నికలు జరగనున్న పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో నంద్యాలకు అత్యధికంగా ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. 170 పోలింగ్ కేంద్రాల్లో 1.86 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ 1,084 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అలాగే, కర్నూలు జిల్లా గూడూరులో తక్కువ మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 20 వార్డుల్లో 50,758 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న ఈ నగర పంచాయతీలో కేవలం 120 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించారు. సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది గుర్తింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. పురపాలక శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, వార్డు సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధుల కోసం వినియోగించనున్నారు. ఎన్నికలకు అవసరమని భావించిన మొత్తం 55,840 మందికి గాను ఆదివారం నాటికి 48,141 మందిని గుర్తించారు. వారిలో 43,012 మందిని విధుల్లో నియమించారు. మిగిలిన వారిని సోమవారం గుర్తించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఇక ఎన్నికల సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 1, 2 తేదీల్లో మొదటి విడత.. 6, 7 తేదీల్లో రెండో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
100 మీటర్ల లోపు ఏ ఫోనూ వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఏ వ్యక్తి కూడా సెల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల కూడా ఇలాంటి పరికరాలేవీ ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది. ఉల్లంఘించిన వారి నుంచి వాటిని జప్తు చేసి పోలింగ్ ముగిశాక, ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మాత్రమే తిరిగి ఇస్తామని పేర్కొంది. ఈ ఆదేశాలు శాంతిభద్రతలు పర్యవేక్షించే అధికారి, పోలింగ్‌బూత్‌లు, కౌంటింగ్ సెంటర్ల వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి వర్తించవని గురువారం విడుదల చేసిన ఉత్తర్వులో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల లోపు అభ్యర్థుల ఎన్నికల బూత్‌లు పెట్టరాదని, అభ్యర్థులు ఇలాంటి ఒక్కో బూత్‌లో ఒక టార్పాలిన్‌లో గొడుగు కింద ఒక బల్ల, రెండు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, దీనికి టెంట్ వేయరాదని స్పష్టం చేశారు. ఒక్కో బూత్‌లో అభ్యర్థికి సంబంధించిన ఒక్క బ్యానర్‌ను మాత్రమే ప్రదర్శించాలని తెలిపారు. ఇలాంటి బూత్‌లలో ప్రజలు గుమికూడరాదని, ఓటేశాక ఎవరూ ఈ బూత్‌ల వద్దకు రావొద్దని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘనలపై ఏ అధికారి అయినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు విధుల నిర్వహణలో వైఫల్యానికి చట్టప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆగస్టు తొలివారంలో మున్సిపోల్స్ పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం తెస్తున్న కొత్త మునిసిపల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మునిసిపల్ బిల్లులకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించామని వెల్లడించారు. కొత్త మునిసిపల్ చట్టాల ఆమోదంకోసం ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 18న బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి వాటి ప్రతులను శాసన సభ్యులకు అందచేయనున్నారు. బిల్లులను చదివి అవగతం చేసుకోవడానికి సభ్యులకు అవసరమైన సమయం ఇచ్చేందుకు ఆ వెంటనే సభను మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. 19న బిల్లులపై చర్చించి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను కేవలం మునిసిపల్ బిల్లులను ఆమోదించేందుకు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోంది. పశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బైంసా మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన కేసులో గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. చట్ట నిబంధనల మేరకు వార్డుల విభజన చేయాలని, అప్పటివరకూ బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించరాదని జస్టిస్ పి.నవీన్‌రావు ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండానే ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ కపిల్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్ నరేశ్‌రెడ్డి వినిపిస్తూ బైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ జబీర్ అహ్మద్‌కు అనుకూలంగా మున్సిపల్ కమిషనర్ చర్యలు ఉన్నాయన్నారు. వాదనల విన్న న్యాయమూర్తి బైంసా ఎన్నికలు నిర్వహించరాదన్న మధ్యంతర ఆదేశాల తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
ఓటెత్తారు
7 గంటలకేబారులు తీరిన ఓటర్లు పోలింగ్‌పై కానరాని పండగ ప్రభావం కొన్నిచోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్ ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అంచనాలకు మించి యలమంచిలిలో 82.99 శాతం, నర్సీపట్నంలో 76.14శాతం నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. కొత్త అమావాస్య పం డగ ప్రభావంతో ఒకదశలో మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది. మరోపక్క ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్లను ఆటోలు, రిక్షాలు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకేసారిగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో కొన్ని కేంద్రాల వద్ద గంటలతరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చే శారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ పూర్తయింది. యలమంచిలి మున్సిపాలిటీలో 32,459 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డు ఏకగ్రీవం అయింది. 23 వార్డుల్లోని 31,168 మందికి 25,867 ఓట్లు పోలయ్యాయి. 82.99 శాతంగా నమోదయింది. 23 వార్డుల్లో 58మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 9గంటలకు 19శాతం, 11గంటలకు 40.80శాతం, 1గంటకు 60.18శాతం, 3గంటలకు 74.86శాతం పోలింగ్ నమోదయింది. 8వ వార్డులో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆడారి లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కొక్కిరాపల్లి పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించి పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై ఆరాతీశారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పెదపల్లి, యలమంచిలి తులసీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని ఆరా తీశారు. నర్సీపట్నంలోని 27 వార్డుల్లో మొత్తం 76.14 శాతం మంది ఓటు వేశారు. ఈ పట్టణంలోని మొత్తం 44,097 ఓటర్లకు 33,574 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా ఇక్కడి మహిళలంతా ఆలయాలకు వెళ్లడంతో ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి పుంజుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటలకు 16శాతం, 11 గంటలకు 35, ఒంటి గంటకు 57.8, 3 గంటలకు 66.33, పోలింగ్ ముగిసే సమయానికి 76.14 శాతం పోలింగు నమోదయింది. ఇక్కడి పోలింగ్ సరళిని కలెక్టరు ఆరోఖ్యరాజ్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అనితా రామచంద్రన్‌తో పాటు ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ ఎన్నికల అధికారి సింహాచలం పరిశీలించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతుండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు పోలీసులు, పోలీసు అధికారులు కేంద్రాలవద్ద ఓవర్‌యాక్షన్ చేశారు. బూత్‌లకు సమీపంలో ఉన్న అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి, సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. అలాగే ఏజెంట్లను సైతం బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. చిన్న, చిన్న అవాంతరాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.