poor houses
-
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్‌కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్‌రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
పేదల ఇళ్లు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్ భాషలో సబ్ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లో దినార్ల రూపంలో చెల్లించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నగదు బదిలీకి కోడ్ భాషలో హెచ్‌వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్ అని, విశాఖపట్నంకు విష్ అని, బెంగళూరుకు బాంగ్ అని కోడ్ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!! చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్వాయిస్లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ అధికారి ఈ కేసును సెంట్రల్ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులతో పాటు మనోజ్ వాసుదేవ్ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది. తప్పించుకుని తిరుగుతూ.. చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్–4 ప్రిన్సిపల్ కమిషనర్ గతేడాది సెక్షన్ 127 కింద హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్ 10, అక్టోబర్ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు. అసలు సెంట్రల్ సర్కిల్ కార్యాలయానికి సెక్షన్ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్ సర్కిల్ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది. దర్యాప్తులో సీజ్ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్ వాసుదేవ్ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది. -
AP: ఎట్టకేలకు సీఆర్డీఏలో పేదలకు ఇళ్లు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో పోరాటం చేసి సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఆ ఇళ్లు మంజూరు చేయవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు టీడీపీ నేతలు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృషితో సీఆర్డీఏ పరిధిలో పేదలకు 47 వేలకుపైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ (సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ) సోమవారం సమావేశమై సీఆర్డీఏ పరిధిలో 47 వేలకుపైగా పేదల గృహాలను మంజురు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. న్యాయస్థానాల్లో కేసులున్నాయని, సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు మంజూరు చేయవద్దని ఓ పార్టీ ఎంపీలు కొందరు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖకు లేఖలు రాశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశ అజెండాలో ఈ ఇళ్ల మంజూరు ఉంటుందా ఉండదా? అనే అనుమానాలు కూడా కలిగాయన్నారు. కొంతమంది ఎంపీలు చేసిన వాదనల్లో వాస్తవం లేదని, ఎటువంటి కోర్టు కేసులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా కృషిచేసిందని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో సీఆర్డీఏ పరిధిలోని 47 వేలకుపైగా పేదల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇంకా మూడువేల ఇళ్లకు కేంద్రం నుంచి మంజూరు రావాలని, వాటికి కూడా త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. తొలినుంచి సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేసి అడ్డుపడుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ పేదల కోసం చట్టసవరణ కూడా చేసి, న్యాయస్థానాల్లో పోరాటం చేసి న్యాయస్థానాల అనుమతితోనే సీఆర్డీఏ పరిధిలోని పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేసింది. గత నెల 26న 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ న్యాయస్థానాల్లో పోరాటం అనంతరం గత నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏ పరిధిలోని 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇదే అమరావతి ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందని, ఇకపై మనందరి అమరావతి అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి ఈ పట్టాలు పంపిణీ చేశారు. ఇదీ చదవండి: చర్యలు తీసుకుంటే వేధింపులేనా రామోజీ? -
భూదానం తరతరాలు నిలిచిపోతుంది: మంత్రి ఉష శ్రీ చరణ్
-
మీకిచ్చిన సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుంది: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: పేదల సొంతింటి కల నెరవేర్చేలా అక్కచెల్లెమ్మలకు రూ.లక్షలు విలువ చేసే ఆస్తిని అందించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. మీకిచ్చే సెంటు భూమి శవాన్ని పూడ్చడానికి సరిపోతుందంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెందుర్తిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎన్టీఆర్ జంక్షన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సెంటు భూమిలో ఇళ్లు కడతామని జగన్ చెబుతున్నారని, ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చని అన్నారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు ఇచ్చామని తెలిపారు. తాము కరెంట్ చార్జీలు పెంచలేదని, కరెంట్ కూడా ఒక్కసారి కూడా ఆపకుండా సరఫరా చేశామని అన్నారు. విశాఖలో వీధిదీపాలు వేసింది తానేనని, ఈ ప్రభుత్వానికి వాటికి రిపేర్లు కూడా చేసే స్థోమత లేదన్నారు. అమరావతిని రాజధానిగా, విశాఖపట్నం ఐటీ, ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పానని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో ఏ మూల నుంచైనా అమరావతికి వచ్చి ఇళ్లు కట్టుకోవడానికి 5 శాతం భూమి రిజర్వ్ చేశానన్నారు. ఇప్పుడా భూముల అంశం సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలిపారు. అమరావతిలో తానుండే అద్దె ఇంటిని కూల్చేసేందుకు ప్రయత్నించి.. ఇప్పుడు దానిపై క్విడ్‌ప్రోకో పేరుతో కేసు పెట్టారన్నారు. చదవండి: లోకేష్‌కు నలుగురూ వేర్వేరుగా స్వాగతం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..! రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే తన ఒక్కడి బలమే సరిపోదని, అందరం కలిసి సమష్టిగా పోరాడాలని అన్నారు. ధనిక ముఖ్యమంత్రికి, నిరుపేదలకు మధ్య జరుగబోతున్న కురుక్షేత్ర పోరాటంలో అందరం కలిసి కౌరవుల్ని ఓడించాలన్నారు. ఇక జగన్ పని, వైఎస్సార్సీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా గెలవరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 కాదు.. వైఎస్సార్సీపీకి గుండుసున్నాయే మిగులుతుందన్నారు. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ధైర్యం ఉంటే.. రేపే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. తన దగ్గర డబ్బులు లేవని వాళ్లనుకుంటున్నారని, తనది ప్రజాబలం, వాళ్లది ధనబలమని అన్నారు. ఇంకా జనం రాలేదా? షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వేపగుంట జంక్షన్‌కు చేరుకొని రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 4 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. జనం లేరని తెలిసి మారియట్ హోటల్‌కు వెళ్లిపోయారు. ఈలోగా జనాల్ని నాయకులు తీసుకొచ్చి సమాచారం ఇవ్వడంతో రోడ్ షోకు వెళ్లారు. అప్పటికీ జనం లేకపోవడంతో స్థానిక నేతలపై బాబు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సభకు కూడా జనాల్ని తీసుకొచ్చారు. అది కూడా చిన్న రహదారిలో రెండువైపులా హోర్డింగ్‌లు పెట్టి.. ఇరుకు రోడ్డులోనే భారీగా జనం వచ్చినట్లు షో చేసి.. మమ అనిపించారు. -
Fact Check: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది..
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సాకారం చేస్తుంటే, తన ఆత్మీయుడు ఉనికి కోల్పోవడం ఖాయం అని ‘ఈనాడు’ రామోజీరావుకు దిగులు పట్టుకుంది. ఏకంగా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తుండటం చూసి.. అవి పూర్తయితే టీడీపీకి పుట్టగతులుండవని నిద్ర కరువైంది. ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ల నిర్మాణాలు సమాజానికి కన్పించకుండా కనికట్టు చేయాలని ‘నవరత్న ఇల్లు.. పల్లె పేదకు లేదు!’ అంటూ శుక్రవారం ఓ కథనాన్ని వండివార్చారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఏకంగా 30.65 లక్షలకు పైగా పేద కుటుంబాలకు గృహ యోగం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 30.65 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. వీరికి రూ.56,102 కోట్ల విలువైన భూములను కేటాయించింది. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఏకంగా రూ.36 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ఇప్పటి వరకూ రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఇప్పటికే 17.22 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాలన్నీ అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, ఈనాడుకు మాత్రం కనిపించలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని బురద చల్లుతుండటం దారుణం. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం ఇప్పటికే రెండు దశల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, త్వరలో మూడో దశ కింద మరికొన్ని అదనపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, గ్రామీణ ఇలా ఏ లబ్ధిదారులకైనా ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంక్ రుణ సాయం చేస్తోంది. వీటికి అదనంగా 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తోంది. ఎక్కడైనా కోర్టు కేసులు, లబ్ధిదారు మరణం, లబ్ధిదారుల శాశ్వత వలస వంటి ఇతర సమస్యల కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టని సందర్భాల్లో మాత్రమే ఆయా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి తప్ప లబ్ధిదారులను ఎక్కడా తొలగించలేదు. -
ఉస్మానియా భూములు తీసుకోవడం సరికాదు: శ్రీధర్‌బాబు
మంథని(కరీంనగర్): ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకుని అందులో పేదలకు ఇళ్లు కట్టించాలనే యోచన సబబు కాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకం కల్గించే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో ఇళ్లు కడతామనడం సరైంది కాదన్నారు. విశ్వవిద్యాలయూన్ని దూరదృష్టితో ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో జనాభా పెరిగి అనేక మంది పేద విద్యార్థులు అందులో చేరే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయం భూమిని కాకుండా మరోచోట కొనుగోలు చేసి ఇళ్లు కట్టించాలని సూచించారు.