porcupine
-
ఈ వీడియో చూసి మనం చాలా నేర్చుకోవచ్చు!
యుధ్ధంలో బలవంతుడు గెలవడం, బలహీనుడు ఓడిపోవడం జరుగుతుంది. అయితే ముందే ఓడిపోతాం అని తెలిసి పోరాడకపోతే ఎలా? ఫలితంతో సంబంధం లేకుండా ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టి ప్రయత్నం చేయడం మాత్రం చాలా ముఖ్యం. అచ్చం ఇలాంటి పోటీనే చిరుత ముళ్లపంది మధ్య చోటుచేసుకుంది. చిరుత చాలా బలవంతం అయింది కాబట్టి అదే గెలస్తుంది అనుకుంటాం. కానీ మళ్లపంది మాత్రం ఏ మాత్రం అదైర్యపడకుండా తీవ్రంగా పోరాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ప్రతీ మనిషికి ఏదో ఒక రక్షణ కవచం ఉంటుంది. దీన్నే శక్తివంతంగా మార్చుకొని తమ వైపు నుంచి ప్రయత్నం చేయాలి. వీడియోలో చూసినట్లు ముళ్లపంది కూడా చిరుతతో పోలిస్తే తన శక్తి తక్కువే అని తెలిసినా అది ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. చిరుత పంజా విసిరినా మే మాత్రం అధైర్యపడకుండా తనకున్న రక్షణ కవచంతో చాకచక్యంగా దాడిచేసింది అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. (గాలిలో ఐదు సెకండ్ల హనీమూన్) -
ముళ్లపంది దెబ్బకు.. విలవిల్లాడిన చిరుత!
చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. ఇక అది దాడికి దిగితే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీయాల్సిందే. అయితే ఓ రహదారిపై ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను బెంబేలెత్తించింది. పందిపై దాడికి దిగిన ఈ చిరుత చివరకు తగ్గి వెనుదిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అడవి మార్గం గుండా వెళుతున్న ముళ్ల పందిని చూసి చిరుత దానిపై దాడి చేసిన వీడియోను.. పర్విన్ కశ్వాన్ అనే ఓ ఆటవీ అధికారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘చిరుతకు ముళ్లపందికి మధ్య పోరాటం.. చివరకు చిరుత గుణపాఠాన్ని నేర్చుకుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వచ్చాయి. వీడియో ప్రకారం... తనపై దాడి చేస్తున్న చిరుతను చూసి ముళ్లపంది భయపడలేదు. ఎందుకంటే దానితో పెట్టుకుంటే ఎమౌతుందో చిరుతకే తెలిస్తుందనుకుందో ఏమో మరి.. అది వెంటపడుతున్నా పరిగెత్తలేదు. ఇక దానిని చంపి తీనాలని చూసిన చిరుత పులికి చివరకు తగిన శాస్తి జరిగింది. పందిని కొరకడానికి ప్రయత్నించిన చిరుత నోటికి దాని ముళ్లు గుచ్చుకోవడంతో నొప్పితో విలవిలలాడింది. చివరకు తిన్నగా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు... ‘అయ్యో! చిరుతకు ముల్లు గట్టిగా గుచ్చుకుని ఉంటుంది , ‘బాబోయ్.. రోమాలు నిక్కపోడిచే పోరాటం’ అని.. మరికొందరు చిరుతకు తగిన శాస్తి జరిగిందని అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. -
ముళ్లపందిని వేటాడి తిన్న పులి మృతి
తిరువొత్తియూరు: ముదుమలై పులుల శరణాలయంలో ముళ్లపందిని వేటాడి తిన్న పులి మృతి చెంది ఉండడాన్ని ఆదివారం ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయంలో 50కి పైగా పులులు ఉన్నాయి. శనివారం ఉదయం ఓంబెట్టా వేట నిషేధిత శిబిరంలోని పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో శిబిరానికి 200 మీటర్ల దూరలో పులి కళేబరం పడి ఉంది. దీనిపై వేట నిరోధక ఫారెస్ట్ రేంజర్ శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెటర్నరీ వైద్యులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని పరిశీలించగా పులి నోటిలో ముళ్లపందికి ఉండే ముళ్లు గుచ్చుకుని ఉన్నాయి. రాత్రి సమయంలో పులి ముళ్లపందిని వేటాడి తిన్నట్టు తెలిసింది. ముళ్లు పేగుల్లో గుచ్చుకుని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతి చెందిన ఆడ పులికి ఐదేళ్ల వయస్సు ఉంటుందని, శవ పరీక్ష చేసి పులిని అదేచోట పాతిపెట్టారు. -
ముళ్ల పందికి బలైన పులి
చెన్నై: పులి ఏ జంతువునైనా సులువుగా వేటాడి తినగలదు. కానీ ఓ పులి ఆహారం కోసం వేటాడి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ముళ్ల పందిని వేటాడి తిన్న పులి తీవ్రగాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని కుమరి జిల్లా పేచ్చిపారై అనై ప్రాంతం సమీపంలో చోటు చేసుకుంది. గురువారం కాయల్కరై అటవీ ప్రాంతానికి వెళ్ళిన కొంత మంది స్థానికులు అక్కడ నాలుగేళ్ల ఆడ పులి మృతి చెంది ఉండటం చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులు పశువుల డాక్టర్లతో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని పులి కళేబరాన్ని పరిశీలించగా రాత్రి వేళ ఆహారాన్ని వెతుకుంటూ వచ్చిన పులి అక్కడ తిరుగుతున్న ముళ్ల పందిని వేటాడి చంపేసిందని.. తినే క్రమంలో ముళ్ల పందికి ఉన్న ముళ్లు గుచ్చుకోవడంతో పులి నోరుతోపాటు కడుపులో బలమైన గాయాలు ఏర్పడ్డాయని వివరించారు. ఆ ముళ్లు పులి పేగులను కూడా చీల్చేశాయని తెలిపారు.. దీంతో పులి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. -
ఆశకు పోతే దురాశ మిగిలింది
-
ఆశకు పోతే దురాశ మిగిలింది
బ్రెజిల్: దురాశ దుఃఖానికి చేటు అనే మాట ఒక్కోసారి మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుందని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. కంటికి కనిపించిన ప్రతిదాన్ని స్వాహా అనిపించే కొండచిలువ ఒకటి ఆశకు పోయి చిక్కుల్లో పడింది. సహజంగా జంతువులను నుంచి మనుషుల వరకు దేనిని వదిలిపెట్టని అది కాస్త ఓ ముళ్లపంది విషయంలో కక్రుత్తి పడింది. దాని ఇంటి నిండా ముళ్లు ఉంటాయని తెలిసినా, అది విసిరితే బాకుల్లాంటి ముళ్లు దిగుతాయని తెలిసినా సాహసించి దాన్ని మింగే ప్రయత్నం చేసింది. దీంతో ఒళ్లు మండిన ముళ్లపంది కాస్త ఒక్కసారిగా ఆ కొండచిలువపై ముళ్ల వర్షం కురిపించింది. దీంతో పదుల సంఖ్యలో ముళ్లు కొండ చిలువ నోటితో సహా ఒంటిపై కూడా బాణాల్లాగా దిగిపోయాయి. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఆ ముళ్ల బాధతో కదల్లేక ఎటు కదిలినా వస్తున్న నొప్పిన భరించలేక అటుఇటూ బొర్లుతున్న దాని వద్దకు ఓ కుక్క వచ్చింది. దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఓ పక్క నొప్పితోనే కుక్కను కూడా ఆ కొండచిలువ ఎదుర్కొంది. ఇలా ఒంటిపై ముళ్లులు, ఎదురుగా బెదిరిస్తున్న కుక్కను చూసిన ఆ కొండచిలువ పరిస్థితి చూసిన వాళ్లకు చాలా జాలేసింది. -
పందికొక్కు తెచ్చిన తంటా
కోలారు : విద్యుదాఘాతోంతో మృతి చెందిన పందికొక్కును తొలగించే ప్రయత్నంలో చిన్నారితో సహా దంపతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించగా భర్త మృతి చెందాడు. మిగతా ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన బుధవారం నగరంలోని చౌడేశ్వరి నగర్లో చోటు చేసుకుంది. చౌడేశ్వరి నగర్లో లక్ష్మణ్(31), రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదు నెలల చిన్నారి ఉంది. ఇంటికి ఇచ్చిన కనెక్షన్ తెగి ఇంటి పక్కనే ఉన్న ముళ్లతంతిపై పడింది. దీంతో తచ్చాడుతున్న పందికొక్కు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. విషయం తెలియని లక్ష్మణ్ చనిపోయిన పందికొక్కును అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుందని భావించి అక్కడి నుంచి తీసివేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్‌ను తాకాడు. దీంతో అతను విద్యుదాఘాతానికి గురై గట్టిగా కేకలు వేశాడు. చంటి పిల్లవాడిని ఎత్తుకున్న బాలింత రాధమ్మ భర్త లక్ష్మణ్‌ను కాపాడే ప్రయత్నం చేయగా వారు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారు. స్థానికులు స్పందించి వారిని నగరంలోని ఎస్ ఎన్ ఆర్ ఆస్పత్రికి తరలించగా లక్ష్మణ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. బెస్కాం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ఘటనపై టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
నేను గాని ఓ ముల్లు గాని విసిరానంటే!
పొదల చాటున దాగుందో చిరుత పులి.. అది చూసిందో ముళ్లపందిని.. ఆహా! ఇవ్వాళ్టికి కడుపు నిండిందిరా అనుకుంది.. లొట్టలేసుకుంటూ చటుక్కున వెళ్లి గుటుక్కున మింగేద్దామనుకుంది.. అయితే దాని పప్పులేం ఉడకలేదు.. ఆ ముళ్లపంది తన అస్త్రాలను.. అదే తన ఒంటిపై ఉన్న ముళ్లను బయటికి విసిరింది. ఇంకేముంది చేసేదేం లేక మన చిరుత తోక ముడిచింది. ఉల్ఫీ వాన్ఉక్ అనే ఫొటోగ్రాఫర్ దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఈ ఫొటోలను క్లిక్‌మనిపించాడు. -
ముళ్ల పందిని మింగి 'చచ్చింది'
జోహెన్స్ బర్గ్: ముళ్ల పందిని మింగి... దాన్ని జీర్ణం చేసుకోలేక నానా అవస్థలు పడి.. చివరకు భారీ కొండ చిలువ ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికా లేక్ ఈలాండ్ గేమ్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఓ ప్రైవేట్ గేమ్ పార్క్‌లో చోటు చేసుకుంది. 3.9 మీటర్లు ఉన్న కొండ చిలువ 13.8 కేజీలున్న ముళ్ల పందిని కొండ చిలువ అమాంతంగా మింగేసింది. కానీ దానిని జీర్ణం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి.. ప్రయత్నించి.. చివరకు గత శనివారమే ప్రాణాలు విడిచిందని పార్క్ మేనేజర్ శుక్రవారం వెల్లడించారు. అయితే కొండ చిలువ మరణించిన సంగతిని తాము ఈ రోజే గుర్తించినట్లు చెప్పారు. కొండ చిలువ అహారం తీసుకుని పడుకుందని... పార్క్ వచ్చే వారితో పాటు తాము భావించామని చెప్పారు. కొండ చిలువ సాధారణంగా ముళ్ల పందిని తినదని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఇలా జరగడం విచారకరమన్నారు.