పులి కళేబరం
తిరువొత్తియూరు: ముదుమలై పులుల శరణాలయంలో ముళ్లపందిని వేటాడి తిన్న పులి మృతి చెంది ఉండడాన్ని ఆదివారం ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయంలో 50కి పైగా పులులు ఉన్నాయి. శనివారం ఉదయం ఓంబెట్టా వేట నిషేధిత శిబిరంలోని పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో శిబిరానికి 200 మీటర్ల దూరలో పులి కళేబరం పడి ఉంది. దీనిపై వేట నిరోధక ఫారెస్ట్ రేంజర్ శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెటర్నరీ వైద్యులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని పరిశీలించగా పులి నోటిలో ముళ్లపందికి ఉండే ముళ్లు గుచ్చుకుని ఉన్నాయి. రాత్రి సమయంలో పులి ముళ్లపందిని వేటాడి తిన్నట్టు తెలిసింది. ముళ్లు పేగుల్లో గుచ్చుకుని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతి చెందిన ఆడ పులికి ఐదేళ్ల వయస్సు ఉంటుందని, శవ పరీక్ష చేసి పులిని అదేచోట పాతిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment