Portico
-
రంగమండపం
ఆలయంలో అర్ధమండపం దాటాక కొన్ని ఆలయాలలో రంగమంటపం కనిపిస్తుంది. మధ్యలో గుండ్రటి వేదిక, చుట్టూ నాలుగు స్తంభాలు, దాని చుట్టూ పన్నెండు స్తంభాలతో ఇలా పదహారు స్తంభాలతో నిర్మితమయ్యే మండపాన్ని రంగమండపం అంటారు.రంగం అంటే వేదిక. దాన్ని మధ్యలో ఉంచి నిర్మించబడేదే రంగమండపం. అర్ధమంటపానికి ముందు ఈ రంగమండపాన్ని నిర్మించే సంప్రదాయం ఉత్తరాది ఆలయాలలో ఎక్కువగా, కర్ణాటకలో కొన్నిచోట్ల కనబడుతోంది. ఆలయ సంప్రదాయ క్రియలలో ఒకటైన నాట్యసేవ ఈ రంగమండపంలోనే జరుపబడుతుంది. ఏ ఆలయం గొప్పతనాన్నయినా ఆ దేవుడి భోగాన్ని బట్టే బేరీజు వేస్తారు. ఆలయంలో జరిగే దేవభోగం సక్రమంగా జరిపే ఏర్పాట్లు అనాదిగా ఆలయాల్లో జరుగుతున్నాయి. వాటికోసం రాజులు ఎన్నో మాన్యాలను ఆలయాలకు రాసిచ్చారు. కాలక్రమేణా దేవభోగం రెండు రకాలుగా మారింది. అంగభోగం, రంగభోగం. అంగభోగం అంటే స్వామివారి పూజాదికాలు, విశేషసేవలకు సంబంధించినదని అర్థం. రంగభోగం అంటే ఆయా కాలాల్లో ఒకవేదికపై ఒకరు లేక అనేకమంది కళాకారులు నృత్య, గీత, వాద్యాలతో సమర్పించే స్వామిని సేవించుకోవటం. ఆలయంలో భగవంతుని వైభవానికి తగినట్లు అన్ని భోగాలను కల్పించడం ఆగమ సంప్రదాయం. విశేష ఉపచారాలలో నృత్యం, గీతం, వాద్యం వంటి సేవలు కూడా ఉన్నాయి.కనుక వీటి కోసం ఏర్పాటుచేసినదే రంగమండపం. అంగభోగం రంగభోగం అనే పదాల్ని సంక్షిప్తం చేసి నేడు అంగరంగవైభోగంగా అని అంటున్నారు. ఈ రంగ భోగమంటపానికే నవరంగం అని మరో పేరుంది. తొమ్మిది రకాలైన అలంకారాలు గల స్తంభాలతో నిర్మిస్తారు కనుక అది నవరంగం. ఆలయం అంతటిలో ఎక్కువ అలంకరణ కలిగిన మండపం అంటే అది రంగమండపమే. పూరీజగన్నాథస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, జగ్మోహన మందిరం వంటి ఉత్తరాది ఆలయాలతో పాటు కర్ణాటకలోని బేలూరు, హళేబీడు,పట్టదకల్ వంటి ఆలయాలలో రంగమంటపాలున్నాయి. హంపిలోని విఠ్ఠల దేవాలయంలో సప్తస్వరాలు పలికించే స్తంభాలున్నాయి. తెలుగునాట చాలా మటుకు ఆలయం బయట ప్రత్యేకంగా నాట్యమండపాలను నిర్మించారు.నృత్యంతో భగవంతుని లీలా విశేషాలను భక్తులకు దృశ్యరూపంగా చూపుతూ, గానంతో భగవంతుని గుణవైభవాన్ని కీర్తించి, వాద్యంతో వీనులనిండుగా సుశబ్దాలతో మనస్సును లయింపజేసే ఆ రంగస్థలం నిరుపమాన భక్తికి కార్యస్థలం. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పోర్టికో కూలి యువకుని దుర్మరణం
జామి : నిర్మాణంలో ఉన్న భవనం పోర్ట్‌కో కూలి యువకుడు మరణించిన సంఘటన జామిలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విదేశాల్లో ఉంటున్న బండారు సూర్యనారాయణ జామిలో గహ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి గహ నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనుల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం దీర్ఘాసి మణికంఠ (20) పోర్ట్‌కో డెకింగ్ తీస్తుండగా ఒక్కసారిగా పోర్ట్‌కో కుప్పకూలింది. దీంతో మణికంఠ సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. మతుడిది శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామం. నిరుపేద కుటుంబం కావడంతో తండ్రి∙దాలయ్యతో పాటు పనులకు వచ్చాడు. మతుడు ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఐటీసీ చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఆరు రోజుల కిందటే మణికంఠ పనిలోకి వచ్చి మత్యువాత పడ్డాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు దాలయ్య, ఆదిలక్ష్మ కన్నీటి పర్యంతమయ్యాయరు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్. ఘని సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక విచారణ తేలినట్లే!
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీలో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనపై విచారణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్టీయూ నిపుణుల కమిటీకి అప్పగించడం పట్ల ఎఫ్ఎన్సీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నివేదికను బుట్టదాఖలు చేసేందుకే జేఎన్టీయూకు విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో సిటీలైట్స్ హోటల్ కుప్పకూలిన ఘట నలోనూ విచారణ చేపట్టిన జేఎన్టీయూ ఇంతవరకు నివేదిక అందజేయలేదన్నారు. విచారణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల్లో గుబులు ఎఫ్ఎన్సీసీ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో జీహెచ్ఎంసీ సర్కిల్–10ఏ, సర్కిల్–10బి అధికారుల్లో గుబులు మొదలైంది. ఆయా సర్కిళ్ల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందడంతో వాటిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు తీసుకున్న వారి జాబితా ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో సర్కిల్–10 పరిధిలోని డీఎంసీలు, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి, సెక్షన్ అధికారి మల్లీశ్వర్‌ను సస్పెండ్ చేశారు. ఇటీవల ఏఎంహెచ్‌వో కూడా సస్పెన్షన్‌కు గురికావడంతో ఈ రెండు సర్కిల్ కార్యాలయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వాటిని ప్రక్షాళన చేయాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరు ఉప కమిషనర్లతోపాటు ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు, ఏఎంహెచ్వోలపై బదిలీ వేటు పడనున్నట్లు సమాచారం. నోటీసుల జారీ నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఇందులో భాగంగా ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. -
మహా జాప్యం
నిరుపయోగంగా మారిన మహామండపం రూ.32కోట్లు ఖర్చుచేసినా అక్కరకు రాని వైనం ఈ ఏడాది దసరాకు తప్పని క్యూలైన్లు దుర్గమ్మ దర్శనభాగ్యం కల్పించే మహాద్వారమన్నారు.. ఏడేళ్లు శ్రమించి ఏడంతస్తులు కట్టారు.. భారీ అంచనాలతో రూ.32కోట్లతో నిర్మించిన అతిపెద్ద భవంతిని మూణ్ణాళ్లకే తుస్సుమనిపించారు. భక్తుల సౌకర్యార్థం, దుర్గమ్మ త్వరిత దర్శనార్థం ఇంద్రకీలాద్రిపై నిర్మించిన మహామండపం నిరుపయోగంగా మారింది. దేవస్థానం ఆధ్వర్యంలో సరైన ప్రచారం కల్పించకపోవడం వల్ల భక్తులు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్ల ద్వారానే దర్శనానికి వస్తున్నారు. దీంతో వచ్చే దసరాకూ మళ్లీ లక్షలు ఖర్చుచేసి క్యూలైన్లు నిర్మించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంద్రకీలాద్రి : దసరా ఉత్సవాలకు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మహామండపంలోని రెండు అంతస్తుల్లో క్యూలైన్లు.. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కంపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రత్యేకతలేనని ఆలయ అధికారులు గొప్పగా చెప్పుకొన్నారు. ఆచరణలో మాత్రం మహామండపం నిరుపయోగంగా మారింది. కనీసం శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున వచ్చే భక్తులను సైతం మహామండపం క్యూలైన్లోకి మళ్లించలేదు. దీంతో ఎండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండపాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో దేవస్థాన ఇంజినీరింగ్ విభాగం విఫలమైందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మండుటెండలో కాళ్ల కింద కనీసం పట్టాలయినా లేకుండా గంటల తరబడి క్యూలైన్లోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. నెలన్నరలో రానున్న దసరా ఉత్సవాలకు సైతం మహామండపంలో పూర్తిస్థాయిలో పనులు కాకపోవచ్చునని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. క్యూలైన్లు ప్రారంభమైనా ప్రయోజనమేదీ? రెండేళ్ల కిందట ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ శ్రీనివాస్ తన హయాంలో జరిగిన దసరా ఉత్సవాల్లో అప్పటి సబ్ కలెక్టర్ హరిచందనతో మెట్లకు ప్రారంభోత్సవం చేయించారు. దర్శనం అనంతరం మెట్ల మార్గం గుండా భక్తులు అర్జున వీధికి చేరుకున్నారు. ఇక ప్రస్తుత ఈవో నర్సింగరావు ఈ ఏడాది ఏప్రిల్ 10న పీఠాధిపతులు, మంత్రుల స్వహస్తాలతో మండపాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్‌లోనే ఈవో స్వయంగా క్యూలైన్లు ప్రారంభించి రూ.100 టికెట్ కొనుగోలు చేసిన వారు మెట్ల ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చని ప్రకటించారు. వాస్తవానికి మండపంలో ఏర్పాటుచేసిన రెండు లిప్టుల ద్వారా భక్తులను ఆలయం వద్దకు చేర్చితే భక్తుల నుంచి స్పందన వచ్చేది. అయితే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో దేవస్థానం అధికారులు లిఫ్టును మూసేయడంతో మహామండపం మీదుగా ఆలయానికి చేరుకునే వారి సంఖ్య పదిలోపు ఉంటుంది. ఈ టికెట్లను విక్రయించేందుకు సిబ్బందిని నియమించగా పక్షం రోజుల్లో కనీసం వారి వేతనానికి కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, మహామండపాన్ని మాత్రం ఇంతవరకు దేవస్థానానికి స్వాధీనం చేయలేదని చెబుతున్నారు. శ్రావణ వ్రతాలూ నిర్వహించలేదు శ్రావణమాసంలో ఆది, శుక్రవారాలలో రద్దీని మహామండపం మీదుగా మళ్లించేందుకు అవకాశం ఉన్నా ఆలయ అధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీయడమే కాకుండా మండపం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కనీసం సామూహిక వరలక్ష్మి వ్రతాలను సైతం మండపంలో నిర్వహించలేదు. దసరా క్యూలైన్లు కెనాల్ రోడ్డులోనే.. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మహా మండపంలోని క్యూలైన్ కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకుంటే దేవస్థానానికి లక్షలాది రూపాయలు మిగిలేవి. అయితే, పనులు ఇంకా పూర్తి కాలేదనే కారణంతో కూడా కెనాల్‌రోడ్డు మీదుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోట్ల రూపాయల పనులు చేపట్టినా మండపాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.