post metric hostels
-
సీటు ఇవ్వండి ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో ప్రవేశాలకు డిమాండ్ తీవ్రంగా ఉంది. కాలేజీ విద్యతో పాటు వృత్తి విద్యాకోర్సులు, పోటీ పరీక్షలవైపు దృష్టి పెడుతున్న విద్యార్థులు వసతిగృహాల్లో ప్రవేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంక్షేమ వసతిగృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 430 పోస్టుమెట్రిక్ హాస్టళ్లున్నాయి. వీటిలో 43 వేల మందికి మాత్రమే ప్రవేశాలు పొందే వీలుంటుంది. కానీ ప్రవేశాలకున్న డిమాండ్ దృష్ట్యా 68 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న సీట్ల మేరకు సంక్షేమాధికారులు అడ్మిషన్లు ఇవ్వడంతో మిగతా విద్యార్థులు ప్రవేశాల కోసం సంక్షేమ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రి మెట్రిక్ నుంచి పోస్టు మెట్రిక్కు... ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రి మెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు లేకపోవడంతో వాటిని పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్చాలని ఆయా సంక్షేమ శాఖలు యోచిస్తున్నా యి. దీంతో దాదాపు 50 వసతిగృహాలు మారే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో హాస్టళ్ల మార్పు అంశం పెండింగ్‌లో ఉంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడిని అధిగమించేందుకు వసతి గృహానికి 20 మంది చొప్పున కనిష్టంగా 6 వేల సీట్లు పెంచాలని సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వసతి గృహా ల్లో 3 వేలు, బీసీ వసతిగృహాల్లో మరో 3 వేల చొప్పు న సీట్లు్ల పెంచాలని కోరారు. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ చివరిదశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు సీట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంక్షేమాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్తగా 75 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని మూతబడిన ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పోస్టు మెట్రిక్ వసతి గృహాలు (కాలేజీ హాస్టళ్లు)గా మార్చాలని సంక్షేమ శాఖలు యోచిస్తున్నాయి. ప్రీ మెట్రిక్కు డిమాండ్ తగ్గడం.. పోస్టు మెట్రిక్కు భారీగా దరఖాస్తులు వస్తుండటంతో ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆయా శాఖల పరిధిలోని 75 ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. వీటిలో 18 హాస్టళ్లలో పది మంది లోపు విద్యార్థులుండటంతో వారిని సమీప హాస్టళ్లలో చేర్పించి సర్దుబాటు చేశారు. ఈ హాస్టళ్లను పోస్టు మెట్రిక్ కేటగిరీలోకి మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు: గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల సంఖ్య పెరగడంతో ఆ ప్రభావం ప్రీ మెట్రిక్ హాస్టళ్లపై పడింది. వసతి గృహంలో ప్రవేశంకంటే గురుకులాల్లో అడ్మిషన్లకే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 380 కాలేజీ హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్లో సగటున 100 మందికి మించి సీట్లు లేవు. దీంతో సీట్ల సంఖ్య పెంచాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు లేని ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పోస్టు మెట్రిక్ కేటగిరీలోకి మారిస్తే దాదాపు 10 వేల మందికి వసతి కల్పించవచ్చని, సిబ్బందిని కూడా డెప్యుటేషన్ చేయకుండా వారి సేవలు వినియోగించుకోవచ్చని సంక్షేమ శాఖ భావిస్తోంది. ఆ ప్రకారం 75 వసతి గృహాలను కాలేజీ హాస్టళ్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని జిల్లా సంక్షేమాధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. వసతి గృహం మౌళిక వసతులు, నిర్వహణపై నివేదికివ్వాలని ఆదేశించారు. నివేదిక వచ్చాక హాస్టళ్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. -
అయ్యబాబోయ్..ఇంత స్కామా?
► హాస్టల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.64 లక్షలు మింగేశారు ► పాలకొండ హాస్టల్ ఖాతానుంచి మరో రూ.14 లక్షలు ► సీతంపేట ఖాతా తెరిస్తే ఇంకెంతో? ► 2010లోనే స్కాంకు బీజం శ్రీకాకుళం టౌన్: పేద విద్యార్థులకు చెందాల్సిన లక్షలాది రూపాయలు రాబంధుల పాలైంది. శనివారం సాయంత్రానికి శ్రీకాకుళం పోస్టుమెట్రిక్ హాస్టల్ ఖాతా నంబరు 11152305021లో రూ.64 లక్షలు (2014-2015 , 2015-16 విద్యా సంవత్సరంలో) అక్రమార్కులు కొల్లగొట్టేసినట్టు వెలుగు చూసింది. 2010 నుంచి చిన్న మొత్తంతో ఆరంభమైన ఈ వ్యవహారం 2014 నాటికి రూ.లక్షలకు చేరువైంది. ఇక్కడ ఏటీడబ్ల్యూవోగా వ్యవహరించిన ఎర్రన్నాయుడు సంతకాలతోనే చెక్కులు జారీ అవడంతో ఇందులో ఆయ న్నీ సూత్రధారిగా భావిస్తున్నారు. అలాగే పాలకొండ ట్రైబల్ పోస్టుమెట్రిక్ హాస్టల్లో వార్డెన్ ఖాతా నుంచి రూ.14 లక్షలు 2015 జూలై నెలలో విత్‌డ్రా చేశారు. ఇప్పటివరకు గుర్తించిన ప్రకారం రూ.78 లక్షలు ప్రభుత్వ నిధులు కాజేసి వాటాలుగా పంచుకున్నారు. ఇంకా సీతంపేట తోపాటు మరో 15 పోస్టుమెట్రిక్ హాస్టళ్ల ఖాతాల నుం చి జరిపిన లావాదేవీల్లో ఇంకా లెక్కతేలాల్సిఉంది. అవినీతికి బీజం ఇలా.. శ్రీకాకుళంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహంలో 1, 2 హాస్టళ్లు ఒకే వార్డెన్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. సుమారు 600 మంది విద్యార్థినులకు లెక్కచూపించి వందల్లో విద్యార్థులు గైర్హాజరైనా పూర్తి హాజరు చూపించే ప్రక్రియ సాగేది. ఇందులోనూ రూ.లక్షలు చేతులు మారినప్పటి కీ అధికారులు నోరు మెదపలేక పోయారు. ఇదే అదునుగా చూసుకుని లేని పిల్లలకు హాజరు వేసే అలవాటు ఉండడంతో అదేపనిగా ఉపకార వేతనాలు కాజేందుకు రూపకల్పన చేశారు. ఇందులో తనవంతు పాత్రపోషించిన వార్డెన్ ఝాన్సీరాణిని సస్పెండ్ చేసిన అధికారులు ఆమె నుంచి పూర్తి బాధ్యతలను బదాలాయించారు. శనివారం డీడీ నాయక్‌తో, ఏటీడబ్ల్యూవో బల్ల అప్పారావుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖాధికారిణి హాజరై లావాదేవీలన్నింటినీ పరిశీలించారు. మరోవైపు పాలకొండ వసతిగృహంలో కూడా వార్డెన్‌గా ఉన్న వెంకటనాయుడు నుంచి బాధ్యతలను బదలాయించారు. అ(ఉ)పకారం పై ఏసీబీ నివేదిక సిద్ధం శ్రీకాకుళం: ఉపకార వేతనాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈస్కాం బయటపడ్డ నాటినుంచి అవినీతి నిరోధక శాఖ అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలన జరిపి నిజాలను నిగ్గు తేల్చేపనిలో పడింది. పాలకొండ కేంద్రంగానే ఈస్కాం మూలాలు బయటపడ్డాయి. పాలకొండలోనే పకడ్బందీ వ్యూహంతో కొందరు గిరిజన సంక్షేమ శాఖ అధిరులు స్కార్షిప్పుల కోసం పెట్టుకున్న విద్యార్థుల దరఖాస్తులను హాస్టల్ విద్యార్థులుగా రూపు మార్చారు. అజయ్‌కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ దీన్ని ఆసరాగా చేసుకుని బీసీ సంక్షేమ శాఖ అధికారులను నేరుగా కలుసుకుని వ్యూహాన్ని వివరించారు. ఈ వ్యూహంలో నేరుగా బీసీ సంక్షేమ శాఖను సంప్రదించింది అజయ్ కుమార్ మాత్రమేనని తేల్చారు. అయితే అజయ్‌కుమార్‌ను గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరు కలిశారు.. ఎక్కడ కలిశారు.. విద్యార్థుల దరఖాస్తులు ఎక్కడినుంచి వచ్చాయి. సీతంపేట, పాలకొండ, శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ హాస్టళ్లలోనే బిసి విద్యార్థులు ఉన్నట్టు ఎలా చూపించారన్న సందేహాలపై ఏసీబీ శోధించింది. ఇందులో బీసీ సంక్షేమ శాఖ ఖాతాలకు ఈదరఖాస్తులు వచ్చినపుడు గుమస్తా బాలరాజు ఏంచేస్తున్నారనేది ఆ శాఖ అధికారులు ప్రశ్నించారు. బాధ్యులను విచారించి తుది నివేదికలు సిద్ధం చేసిన ఆశాఖ డిఎస్పీ రంగరాజు శనివారం కలెక్టరును కలసి వివరించారు. ట్రెజరీలో సోదాలుః ఉపకార వేతనాల స్కాంలో ఖజానా శాఖ పాత్రను ఇప్పటికే గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆఫైల్‌ను పరిశీలించిన ఉద్యోగులను ప్రశ్నించారు. ఐటీడీఏ పరిధిలో డెప్యూటీ డెరైక్టరుగా ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్న నాయక్ , ఏటీడబ్ల్యుఓ బల్ల అప్పారావులను విచారించారు. వారి వాంగ్మూలాన్ని సేకరించి నివేదికలను సిద్ధం చేశారు. ఇన్చార్జి బిసి సంక్షేమ శాఖాధికారిగా వ్యవహరిస్తున్న ధనుంజయరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు కలెక్టరు అనుమతికోరారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా కలెక్టరు అనుమతి కోరుతూ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన తర్వాత చర్చించేందుకు కలెక్టరేటులో హాజరుకావాలని కలెక్టరు సంభందితశాఖల అథికారులను శనివారం ఆదేశించారు. ఈ ఆదేశాలప్రకారం ఆదివారం రెండుశాఖల నుంచి అధికారులు కలెక్టరేటులో హాజరైన తర్వాత తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. రాజకీయ ఒత్తిళ్లు: ఉపకార వేతనాలను అడ్డదారిలో ఖాతాలకు మళ్లించుకున్న వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న వారు రాజకీయ పైరవీలకు సిద్దపడ్డారు. అజయ్ మినహా మిగిలిన వారంతా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచి కేసునుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.