సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో ప్రవేశాలకు డిమాండ్ తీవ్రంగా ఉంది. కాలేజీ విద్యతో పాటు వృత్తి విద్యాకోర్సులు, పోటీ పరీక్షలవైపు దృష్టి పెడుతున్న విద్యార్థులు వసతిగృహాల్లో ప్రవేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంక్షేమ వసతిగృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 430 పోస్టుమెట్రిక్ హాస్టళ్లున్నాయి. వీటిలో 43 వేల మందికి మాత్రమే ప్రవేశాలు పొందే వీలుంటుంది. కానీ ప్రవేశాలకున్న డిమాండ్ దృష్ట్యా 68 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న సీట్ల మేరకు సంక్షేమాధికారులు అడ్మిషన్లు ఇవ్వడంతో మిగతా విద్యార్థులు ప్రవేశాల కోసం సంక్షేమ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ప్రి మెట్రిక్ నుంచి పోస్టు మెట్రిక్‌కు...
ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రి మెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు లేకపోవడంతో వాటిని పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్చాలని ఆయా సంక్షేమ శాఖలు యోచిస్తున్నా యి. దీంతో దాదాపు 50 వసతిగృహాలు మారే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో హాస్టళ్ల మార్పు అంశం పెండింగ్‌లో ఉంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడిని అధిగమించేందుకు వసతి గృహానికి 20 మంది చొప్పున కనిష్టంగా 6 వేల సీట్లు పెంచాలని సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వసతి గృహా ల్లో 3 వేలు, బీసీ వసతిగృహాల్లో మరో 3 వేల చొప్పు న సీట్లు్ల పెంచాలని కోరారు. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ చివరిదశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు సీట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంక్షేమాధికారులు అభిప్రాయపడుతున్నారు.
సీటు ఇవ్వండి ప్లీజ్!
Published Sun, Aug 26 2018 2:02 AM | Last Updated on Sun, Aug 26 2018 2:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment