Potash fertilizer
-
ఉప్పు లవణానికి రంగు వేసి..
సాక్షి, అమరావతి బ్యూరో: పొరుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్ద ఎత్తున నకిలీ ఎరువులు సరఫరా అవుతున్నట్లు తేలడం కలకలం రేపుతోంది. కల్తీ పొటాష్ ఎరువులను రాయలసీమతోపాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులకు భారీగా విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఎ.ముప్పాళలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో తనిఖీలు జరిపిన విజిలెన్స్ అధికారులు ఇక్కడ నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని తాజాగా ప్రకటించారు. కల్తీ ఎరువులను ఉప్పు, రసాయన రంగులు, ఎరువుల గిడ్డంగుల్లో వ్యర్థాలతో తయారు చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. నరసరావుపేటలోని నాలుగు దుకాణాల్లో... శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఈనెల 8, 9వ తేదీల్లో తనిఖీలు జరిపిన విజిలెన్స్ అధికారులు 920 బస్తాల కల్తీ పొటాష్ ఎరువులను సీజ్ చేసి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వీటి విలువ రూ.5.42 లక్షలుగా గుర్తించారు. ఐపీఎల్ కంపెనీకి చెందిన మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఫెర్టిలైజర్స్ మాదిరిగా ఉండేలా కల్తీ ఎరువులు తయారు చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వినుకొండ, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు జరిపి నమానాలను సేకరించాయి. నరసరావుపేటలోని నాలుగు దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. కల్తీ ఎరువులు 2 వేల టన్నులకుపైనే.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ లిమిటెడ్ షాపులో చిక్కిన కల్తీ ఎరువులపై విజిలెన్స్ అధికారులు అరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతంకంలోని వెంకట సుబ్రమణ్యేశ్వర ట్రేడర్స్, వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్ షాపుల నుంచి నడిగడ్డ నాగిరెడ్డి అనే మధ్యవర్తి ద్వారా వినుకొండ, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాలకు కల్తీ ఎరువులు తరలించినట్టు గుర్తించారు. నరసరావుపేటలోని ఓ బ్రోకర్ ద్వారా నాలుగు దుకాణాలకు ఈ ఎరువులు చేరాయి. త్రిపురాంతకం ప్రాంతానికి కడపలోని ఓ బ్రోకర్ ద్వారా కర్ణాటక నుంచి కల్తీ ఎరువులు సరఫరా అయినట్లు వెల్లడైంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 2 వేల మెట్రిక్ టన్నులకు పైగా కల్తీ ఎరువులను విక్రయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తే అసలు దోషులు చిక్కే అవకాశం ఉంది. కల్తీ ఎరువుల విక్రేతలపై 420 కేసులు.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దుకాణంలో ఎరువుల శాంపిళ్లను పరీక్షించిన బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఎఫ్సీఓ ల్యాబ్ వీటిని కల్తీ పొటాష్ ఎరువుగా తేల్చింది. ఎంఓపీ ఎరువులో కె.టు.ఒ 60 శాతానికి బదులు కేవలం 2.86 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఉప్పు లవణానికి రంగులు వేసి దీన్ని తయారు చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షలో కల్తీ పొటాష్ ఎరువుగా నిర్ధారించినట్లు గుంటూరు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, ఐపీఎల్ కంపెనీ ఏపీ ఇన్చార్జి రాంబాబు గుంటూరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కల్తీ ఎరువులు అమ్మిన వారిపై 420 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
ఈ సమయం.. అగ్గికి అనుకూలం
ముందు జాగ్రత్త చర్యలు నత్రజని ఎరువును తక్కువగా వేయడం, పొటాష్ ఎరువును ప్రతిసారీ ఎకరాకు 15 కేజీల చొప్పున వినియోగించడం, పొలం గట్లపై కలుపు మొక్కలు, గరిక తొలగించడం, పొట్ట దశలో 50 శాతం, వెన్నుదశలో ఒకసారి ట్రైసైక్లోజోల్ పొడి మందు 100 గ్రాములను 100 లీటర్ల నీటికి లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. అగ్గి తెగులు వ్యాప్తి ఇలా.. వాతావరణం చల్లగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే వరి ఆకుల అంచు వెంట ముదురు గోధమ రంగులో నూలుకండె ఆకారంలో, ఆకుల మధ్యలో బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలను అగ్గి తెగులు అంటారు. మంచు కురవడం, వర్షపు చిరు జల్లులు పడటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వల్ల ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. వెన్ను మొదటి భాగంలో కణుపుల వద్ద అగ్గి తెగులు వస్తే వెన్ను విరిగి కిందకు వాలిపోతాయి. గింజలు సరిగా పాలు పోసుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం తాలు గింజలు ఏర్పడతాయి. సుడిదోమ, దోమపోటు గోధుమ రంగులో ఉన్న దోమలు గుంపులుగా నీటి పైభాగాన దుబ్బులపై ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు, మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా సుడులు సుడులుగా ఎండిపోతాయి. చిన్న చిన్న రెక్కలు గల పురుగులు పూతదశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. తల్లిపురుగులు ప్రత్యేక కాళ్ల నిర్మాణం వల్ల అవి ఒక మూలగా కదులుతాయి. అన్ని పురుగులు మూలగా తిరగడం వల్ల పైరు సుడులుగా చనిపోతుంది. అందుల్లే వీటిని సుడిదోమ అని అంటారు. పైరు వెన్ను దశలో 20 నుంచి 25 పురుగులు ఉన్నట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పొలంలో నాట్లు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ చొప్పున తూర్పు, పడమర దిశలో కాలిబాటలు వదలాలి. పొలంలో నీటి మట్టం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడూ పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. చివరి దఫా ఎరువుల మోతాదుతో పాటు కార్భోప్యూరాన్ 3జీ పది కేజీలు లేక కార్భాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కేజీల గుళికలు వాడాలి. కనీస ప్రమాద స్థాయిని గమనించిన వెంటనే క్రిమిసంహారక మందులైన ఇంనోఫెన్ప్రాజె 2.0 మి.లీ లేదా బూప్రోఫెజిమ్ 2 లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లే దా డైనటోఫ్యూరాన్ 0.5 గ్రాములను లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్లకు తగిలేలా వృత్తకారంగా పొలం గట్ల నుంచి లోపలికి పిచికారీ చేస్తే దోమపోటు బారి నుంచి వరిపైరును సమర్థవంతంగా నివారించవచ్చు. నివారణ మార్గాలు అగ్గి తెగులు ఆశించిన వెంటనే ఐసోప్రొథియోలేన్ 1.5 మి.లీను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకు ఎండు తెగులు, వెన్ను తీసిన పొలాల్లో మానిపండు తెగుళ్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకు ఎండు తెగులు బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల అంచుల వద్ద పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కిందకు ఎండిపోతాయి. దీనికి ఎటువంటి నివారణ మందులు లేవు. నత్రజని ఎరువులను ఒకే సారి కాకుండా మూడు నుంచి నాలుగు దఫాలుగా వేయాలి. తెగులు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువులు వేయడం ఆపాలి. పొలంలో నీటిని తీసివేయాలి. పూతదశలో అండాశయం శిలీంద్రం వల్ల పసుపు పచ్చ ముద్దగా, ఆకుపచ్చ రంగులోకి మారి చివరకు నల్లబడి చిన్న చిన్న ఉండలుగా తయారవుతాయి. కార్బండిజమ్ ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చే దశలో పిచికారీ చేసుకోవాలి.