power discoms
-
ట్రూఅప్ చార్జీలు.. రూ.12,015 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీల వసూలుకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/టీఎస్‌ఎనీ్పడీసీఎల్)లు శుక్రవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆరీ్స)కి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోలు వ్యయం, వాస్తవ వ్యయం మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్‌రంగ పరిభాషలో పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీలు అంటారు. 2016–17 నుంచి 2022–23 మధ్యలోని ఏడేళ్ల కాలానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యయంతో పోలిస్తే వాస్తవ వ్యయం రూ.29,212 కోట్లు అధికంగా ఉందని తమ పిటిషన్లలో ఉత్తర/దక్షిణ డిస్కంలు పేర్కొన్నాయి. పెరిగిన వ్యవసాయ విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మేరకు వ్యత్యాసం ఉందని తెలిపాయి. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయం కింద రూ.7,961 కోట్లు, నష్టాల సర్దుబాటు రూ.9,236 కోట్లను అందించింది. ఈ మొత్తాలు పోను మిగిలిన రూ.12,015 కోట్లను విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలుకు ఈఆర్సీ అనుమతి కోరాయి. ఈ మేరకు టీఎస్ఎస్పీడీసీఎల్ రూ.9,060.80 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్ రూ.2,954.66 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీల వసూళ్లకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు శనివారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. చార్జీల పెంపు లేదంటూ ప్రతిపాదనలు.. ఆపై ట్రూఅప్ చార్జీల వడ్డన.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023–24లో రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆరీ్స)కి సమర్పించిన వార్షిక టారీఫ్ ప్రతిపాదనల్లో కోరాయి. రూ.12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూప్ చార్జీల వసూళ్ల కోసం తాజాగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ రెండు ప్రతిపాదనలపై నిర్దేశిత గడువులోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహ్వానించనుంది. తర్వాత ప్రజాభిప్రాయసేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహించనుంది. వీటికి సంబంధించిన తేదీలను త్వరలో ఈఆర్సీ ప్రకటించనుంది. అనంతరం 2023–24 కి సంబంధించిన విద్యుత్ టారీఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. ప్రతిపాదిత పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలపై మరో ఉత్తర్వులు జారీ చేయనుంది. ట్రూఅప్ చార్జీల భారం రూ.16,107 కోట్లు 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల వసూలుకు గత ఆగస్టు 18న ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. తాజాగా ప్రతిపాదించిన రూ.12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూప్ చార్జీలను కలుపుకుంటే డిస్కంలు ప్రతిపాదించిన మొత్తం ట్రూఅప్ చార్జీలు రూ.16,107 కోట్లకు పెరగనున్నాయి. ఇవేకాక జనరేషన్ ట్రూఅప్ కింద మొత్తం రూ.500 కోట్లకుపైగా చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ జెన్కో, సింగరేణి సంస్థలు సైతం వేర్వేరు పిటిషన్లు వేశాయి. వినియోగదారులపై ట్రూఅప్ గండం! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రూ.5,986 కోట్ల విద్యుత్ చార్జీలను డిస్కంలు పెంచిన విషయం తెలిసిందే. ట్రూఅప్ చార్జీలకు ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఆ భారం పడనుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై జనవరి 18న ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. మార్చి నుంచి క్షేత్ర స్థాయిలో తనిఖీలు వ్యవసాయ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి వీలుగా వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు తప్పనిసరిగా మీటర్లు బిగించాలని ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు స్పష్టం చేశారు. మార్చి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు అంటే? విద్యుత్ కొనుగోళ్ల వ్యయం కాకుండా విని యోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని ట్రూడౌన్ అంటారు. -
టీడీపీ వల్లే డిస్కమ్‌లపై రూ.30వేల కోట్ల భారం
ఒంగోలు: గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంవల్లే విద్యుత్ డిస్కమ్‌లు రూ.30వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఐదేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోందని.. ఇది ప్రభుత్వానికి భారంగా మారడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రైవేటుకు లీజుకిచ్చే అంశంపై విద్యుత్ జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. అయినా వారి విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక విద్యుత్ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడామని.. జేఏసీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అలాగే పీఆర్సీకి సంబంధించి కమిషన్ కాదు.. కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యలను వక్రీకరించడం సబబుకాదు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాలినేని స్పష్టంచేశారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.2.50కు అందుబాటులో ఉంటే ఏకంగా రూ.4.87లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల విద్యుత్ డిస్కంలు ఏకంగా రూ.30 వేల కోట్ల భారాన్ని మోస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విచిత్రంగా ఉంటున్నాయని.. కేంద్రం నిధులు ఇస్తామంటే వద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. -
డిస్కంలకు రూ. 21 వేల కోట్ల రుణం
సాక్షి, ఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు పునరుజ్జీవం కల్పించేందుకు సమూల సంస్కరణలు చేపట్టినట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ సంస్కరణల్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల డిస్కంలకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రూ. 21 వేల కోట్ల రుణం సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ రుణంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8,370 కోట్లు, తెలంగాణకు రూ.12,652 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొన్ని షరతులకు లోబడి ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఈ రుణాన్ని డిస్కంలకు సమకూర్చుతాయని తెలిపారు. మంజూరు చేసిన రుణంలో మొదటి వాయిదా కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,300 కోట్లు, తెలంగాణకు రూ. 6,287 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ స్కీమ్ కింద మంజూరు చేసే ఈ రుణం కొన్ని షరతులకు లోబడి మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు. అందులో ప్రధానమైంది ప్రభుత్వ శాఖలు, విభాగాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను మూడు వార్షిక వాయిదాలలో విడుదల చేయడానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు విధిగా అమర్చాని, దాని వల్ల డిస్కంలకు ప్రభుత్వ చెల్లింపులు సకాలంలో జరిగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారుల్లో కొన్ని కేటగిరీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ విధానాన్ని కూడా సమూలంగా మార్చాలన్నారు. సబ్సిడీకి సంబంధించిన బకాయలను ప్రతి మూడు మాసాలకు ఒకసారి విధిగా చెల్లించడానికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి షరతులకు ఆయా రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత మాత్రమే తదుపరి రుణ వాయిదాల విడుదల జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలను ఆయా డిస్కంలు బాధ్యాతాయుతంగాను, పారదర్శకంగాను నిర్వహించాలని తెలిపారు. అందుకోసం ప్రతి త్రైమాసికం ముగిసే నాటికి డిస్కంలు ఎనర్జీ ఆడిట్ ఫలితాలను ప్రచురించాలన్నారు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి ఫీడర్ వ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) మార్గదర్శకాలను అనుసరించి ఎనర్జీ అకౌంటింగ్ చేపట్టాలన్నారు. ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్లో విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించే దిశగా డిస్కంలు ఆచరణ సాధ్యమైన కార్యాచరణను రూపొందించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ చర్యలు, సంస్కరణల ద్వారా డిస్కంలు నష్టాల ఊబి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందని మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై భేటీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ మార్చి 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ మేరకు బుధవారం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏపీలోని విజయవాడలో ఉద్యోగ, కార్మిక సంఘాల అభిప్రాయాన్ని సేకరించిన కమిటీ ..తాజాగా వచ్చేనెల 2, 3 తేదీల్లో తెలంగాణ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా సేకరి స్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే విద్యుత్ సంస్థలతో ఒకసారి సమావేశమైన కమిటీ ఇప్పుడు మరోసారి సమావేశానికి సిద్ధమయ్యింది. రెండ్రోజులుగా విజయవాడలో జరుగుతున్న భేటీలో ఏపీ సంఘాలన్నీ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నివేదించగా..రిలీవ్ అయిన ఉద్యోగులు మాత్రం తమ 1,157 మంది ఆప్షన్లను మాత్రమే పరిగణంలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఏపీకి వెళ్లేందుకు 621 మంది సిద్ధం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికతను 1 నుంచి 7వ తరగతి ఏ ప్రాంతంలో చదివితే, ఆ ప్రాంతానికి స్థానికుడిగా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను విభజించాలని డిస్కమ్‌లు పట్టుబడుతున్నాయి. ఏపీ ఉద్యోగ సంఘాలే కాకుండా విద్యుత్ సంస్థల ప్రతినిధులు కూడా ఉద్యోగులందరి దగ్గరి నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని కోరాయి. తెలంగాణ డిస్కమ్‌లలో పని చేస్తున్న ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించాలని, వీరిలో ఇప్పటికే 621 మంది ఏపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ డిస్కమ్‌లు ఇప్పటికే ధర్మాధికారి కమిషన్‌కు నివేదించాయి. ఉద్యోగల విభజన సందర్భంగా పంజాబ్, బిహార్ రాష్ట్రాల తీర్పులను కూడా జోడించాయి. ఇక సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన ఆర్నెల్లలోపు ఉద్యోగుల విభజన సమస్యను తేల్చాల్సి ఉండగా ఇప్పటికే దీంట్లో మూడు నెలలు గడిచిపోయాయి. -
విద్యుత్ వినియోగదారులకు ఊరట
న్యూఢిల్లీ: సర్దుబాటు చార్జీల పేరుతో నగరవాసులపై భారం మోపేందుకు ప్రయత్నించిన డిస్కంలకు చుక్కెదురైంది. మరో రెండు నెలలపాటు ప్రస్తుతం కొనసాగిస్తున్న విధంగానే చార్జీలు వసూలు చేయాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి(డీఈఆర్సీ)ఆదేశించింది. జూలైలో వార్షిక టారిఫ్ విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని చెప్పింది. ప్రస్తుతం సర్దుబాటు చార్జీల పేరుతో బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ 6 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 7 శాతం, బీఎస్ఈఎస్ యమున పవర్ లిమిటెడ్ 8 శాతం వసూలు చేస్తున్నాయి. మరో రెండు నెలలపాటు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని డిస్కంలను డీఈఆర్సీ ఆదేశించింది. గత మూడు నెలలుగా ఇవే చార్జీలను వసూలు చేస్తున్నామని, టారిఫ్‌ను 14 నుంచి 15 శాతం పెంచాలని డిస్కంలు డీఈఆర్సీని కోరడంతో అందుకు తిరస్కరిస్తూ మరో రెండు నెలల తర్వాత వార్షిక టారిఫ్ విధానాన్ని సమీక్షిస్తామని తెలిపింది. రూ. 2.95 పెరిగిన సీఎన్జీ నగరంలో సీఎన్జీ ధర రూ. 2.95 పెరిగింది. ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ.35.20 ఉండగా నేటి నుంచి రూ. 38.15 వెచ్చించి కొనాల్సి ఉంటుంది. పీఎన్జీ ధర కూడా యూనిట్‌కు రూపాయి చొప్పన పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో పన్నుల విధానమే వీటి ధర పెరగడానికి కారణమని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్ బిల్లులు పెరగవంటూ డీఈఆర్సీ ప్రకటించిన విషయంపై సంతోష పడేలోపే ఇలా సీఎన్జీ, పీఎన్జీ భారం పడడంపై నగరవాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎన్జీ ధరలను తగ్గించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.