power employess
-
సీఎంల ‘పవర్’ ఫుల్ బంధం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెగిపోయిన విద్యుత్ బంధం బలపడబోతోంది. చంద్రబాబు వైఖరితో జఠిలంగా మారిన సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఆస్తులు, ఉద్యోగుల విభజన వంటి అంశాలు కొలిక్కి వస్తాయన్న విశ్వాసం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల్లో నెలకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం, రెండు రాష్ట్రాల సీఎంల సానుకూల ధోరణితో ఏపీ, తెలంగాణ మధ్య సుహృద్భావ వాతావరణం కన్పిస్తోంది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ సంస్థల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టే వీలుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఇదే జరిగితే విద్యుత్ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. పెండింగ్ బకాయిల వసూళ్లకు మార్గం సుగమం... ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల సమస్య వివాదంగా మారింది. జనాభా నిష్పత్తి ప్రకారం విద్యుత్ సంస్థల విభజన జరగాల్సి ఉంది. అయితే అప్పులు, ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. దీంతో ఐదేళ్లుగా నిప్పు, ఉప్పు అనే పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం షిలాబిడే కమిటీని నియమించింది. అయితే ఎవరికి వారు వారి వాదనల్లో ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ స్థానికత గల 1,152 మంది ఉద్యోగులను బలవంతంగా రిలీవ్ చేసింది. వీళ్లను ఏపీ తీసుకోలేదు. వివాదం కోర్టుకెళ్లింది. ఆ తర్వాత ఏపీలోని తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయ్యారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ సరఫరా వ్యవహారం మరో వివాదమైంది. ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు నిలిపివేసింది. సింగరేణి ద్వారా ఏపీ థర్మల్ ప్లాంట్లకు వచ్చే బొగ్గుకు చెందిన బకాయిలను ఏపీ చెల్లించకపోవడాన్ని తెలంగాణ తప్పుబట్టింది. ప్రతిగా ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు ఇవ్వలేదు. తెలంగాణ నుంచి తమకు రూ.5,127 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని, ఆగస్టు 16, 2017న ఏపీ విద్యుత్ సంస్థలు తెలిపాయి. దీనికి మరో రూ. 604.6 కోట్ల వడ్డీ అదనంగా అవుతుందని వెల్లడించాయి. కానీ ఆస్తుల్లో మాకు రావాల్సిన వాటాను తీసేస్తే తాము కేవలం రూ.3,138 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. సమస్య పరిష్కారం దిశగా అధికారులు చర్చలకు సిద్ధమైనప్పటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడటంతో అధికారులూ ఏమీ చేయలేకపోయారు. ఐదేళ్లుగా కొలిక్కిరాని ఉద్యోగుల సమస్య... గడచిన ఐదేళ్లుగా విద్యుత్ ఉద్యోగుల విభజన డోలాయమానంగా ఉంది. తెలంగాణ రిలీవ్ చేసిన 1,152 మంది ఉద్యోగులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. సమస్య పరిష్కారానికి అన్ని మార్గాలు ఉన్నప్పటికీ ఏపీలో గతంలో ఉన్న ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా అడుగులు ముందుకు పడలేదు. ఏళ్ల తరబడి వ్యవహారం కోర్టు మెట్లు దాటడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే వెంటనే పరిష్కారమయ్యే వేలాది మంది జీవితాలకు చెందిన సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత అధికార మార్పిడివల్ల ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని వారంతా ఆశిస్తున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా... రెండు రాష్ట్రాల విద్యుత్ సమస్యల పరిష్కారంపై సానుకూల వాతావరణం కన్పిస్తోందని ఉద్యోగులు అంటున్నారు. పరిష్కార మార్గాలతో అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. నిజానికి సమస్య కొలిక్కి వచ్చే దశలో చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణకు ఏపీ నుంచి వెళ్లే విద్యుత్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితంగా వివాదం మరింత జఠిలమైందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. ఉద్యోగుల్లో కొంతమందిని తెలంగాణకు అప్పగించి, మరికొంత మందిని ఏపీలోకి తీసుకునే వీలుందని ఓ అధికారి తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గడువు ముగిసింది. కాబట్టి బకాయిల విషయంలో పట్టు విడుపు ఉంటుందని, శాశ్వత పరిష్కారం సాధ్యమని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు 1,152 మంది ఏపీ ప్రభుత్వం చెబుతున్న విధంగా తెలంగాణ నుంచి రావలసిన విద్యుత్ బకాయిలు రూ.5,127 కోట్లు దీనిపై వడ్డీ రూ. 604.6 కోట్లు తెలంగాణ వాదన ప్రకారం ఆస్తుల్లో తమ వాటా పోనూ ఏపీకి చెల్లించాల్సిన మొత్తం రూ.3,138 కోట్లు -
‘విద్యుత్’ సమ్మె యథాతథం
ఈ నెల 14లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే 15 నుంచి సమ్మె తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ స్పష్టీకరణ 14న మంత్రి జగదీశ్‌రెడ్డితో మరో దఫా చర్చలకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ నెల 14వ తేదీలోపు పరిష్కరించకపోతే 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ పునరుద్ఘాటించింది. సమస్యలను పరిష్కరించని పక్షంలో ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగుతారని ఫ్రంట్ చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఈ. శ్రీధర్ శనివారం తెలిపారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఆర్వీకేఎస్ మినహా రాష్ట్రంలో మిగిలిన 13 విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల కలయికతో ఏర్పడిన ఈ ఫ్రంట్... కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆలోగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాల చెల్లింపు డిమాండ్లు సహా మొత్తం 34 డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత నెల 19న విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణ శనివారం విద్యుత్‌సౌధలో ఫ్రంట్ నేతలతో చర్చలు జరిపారు. సానుకూల దృక్పథంతో చర్చలు జరిగాయని, తక్షణమే కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించామని చర్చల అనంతరం డి.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. తక్షణమే పరిష్కరించలేని డిమాండ్లను ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించాలని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయన్నారు. విధానపర నిర్ణయాలతో ముడిపడిన డిమాండ్లపై ఈ నెల 14న సచివాలయంలో ఉదయం 11 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో మళ్లీ చర్చలకు రావాలని యాజమాన్యాలు ఆహ్వానించగా ట్రేడ్ యూనియన్ల నేతలు అంగీకరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని, ఈ నెల 15నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని ప్రభాకర్‌రావు ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. 13న ఆందోళనలు ... విద్యుత్ సంస్థల సీఎండీలతో జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాల చెల్లింపుతో పాటు అదనపు పోస్టుల మంజూరు, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు బదలాయింపు, తదితర డిpower employess strike will be as usualమాండ్లను పరిష్కరించాల్సిందేనని ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ నేతలు పట్టుబట్టారు. ఈ అంశాలపై ప్రభుత్వ అనుమతి అవసరమని యాజమాన్యాలు స్పష్టం చేశాయని ఫ్రంట్ కన్వీనర్ ఈ. శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న తలపెట్టిన ఆందోళనలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ గేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాల్లో మార్పులేదన్నారు. -
ఉద్యోగుల విభజనపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య పరిష్కారంలో కేంద్రం ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యకు కేంద్రమే పరిష్కారం చూపాలంటూ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ నాటికి సమస్య పరిష్కారానికి నిర్ధిష్ట ప్రతిపాదనలతో తమ ముందుకు రావాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఏ శంకర్‌నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను, సాదానుగుణంగా తయారు చేసిన తుది జాబితాను సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు, ఏపీ ట్రాన్స్‌కో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను జస్టిస్సుభాష్రెడ్డి నేతృత్వంలోనే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ బి నారాయణరెడ్డి వాదనలు వినిపిస్తూ సమస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై కమిటీని ఏర్పాటు చేసినప్పుడు విద్యుత్ ఉద్యోగుల విభజనపై కమిటీ ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించింది. సమస్యకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓ పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి నిర్దిష్టమైన ప్రతిపాదనలతో తమ ముందు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.