Power Unit
-
అంచనాలకు మించి జల విద్యుదుత్పత్తి
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. జెన్కో కాసుల పంట పండింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. తెలంగాణ విద్యుదు త్పత్తి సంస్థ (జెన్కో) కాసుల పంట పండించింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3,849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. అందులో 480.78 ఎంయూలను గడిచిన పది రోజుల్లోనే ఉత్పత్తి చేయడం విశేషం. గతేడాది మాదిరే మంచి వర్షాలు కురిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 3,718.53 ఎంయూల ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనా వేయగా, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే 3,849 ఎంయూల ఉత్పత్తి జరగడం గమనార్హం. తొలి అర్ధ వార్షికం ముగిసే (సెప్టెంబర్ చివరి) నాటికే 3,369 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 6,000 ఎంయూల ఉత్పత్తికి అవకాశం కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 578 టీఎంసీల జలాలతో 2,052 ఎంయూలు, గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, పోచంపాడు తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 137 టీఎంసీలతో 138 ఎంయూలు కలిపి మొత్తం 2,190 ఎంయూల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినా, ఇంకా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. జలాశయాలన్నీ నిండి ఉండటంతో విద్యుదుత్పత్తి ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జెన్కో రికార్డుస్థాయిలో 6,000 ఎంయూల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశముంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో.. 900 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కొక్కటీ 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు ఉండగా, ఐదు యూనిట్లు మాత్రమే ఉత్పత్తికి లభ్యంగా ఉన్నాయి. రెండేళ్ల కింద జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ యూనిట్ పునరుద్ధరణ ఇంకా పూర్తికాలేదు. ఇక్కడి నుంచి 100% స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయడానికి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. ఇప్పటికే శ్రీశైలంలో నిల్వ ఉన్న 214 టీఎంసీల జలాలతో 1,009 ఎంయూల జల విద్యుదుత్పత్తి చేయొచ్చని జెన్కో అంచనా వేసింది. కొనసాగుతున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి మరింత పెరగనుంది. ►815.6 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో 100శాతం ఉత్పత్తి చేసేందుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. జలాశయంలో నిల్వ ఉన్న 311 టీఎంసీలతో 987 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. డిస్కంలకు భారీ ఊరట తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలను.. ఈ ఏడాది జల విద్యుత్ కొంత వరకు ఆదుకుంది. చౌక ధరకు లభించే జల విద్యుత్ భారీ మొత్తంలో ఉత్పత్తి కావడంతో డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత తగ్గింది. 2022–23లో మొత్తం 3,561 ఎంయూల జలవిద్యుత్ కొనుగోళ్లు చేసేందుకు డిస్కంలకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,307 కోట్లను ఫిక్స్డ్ చార్జీలుగా జెన్కోకు చెల్లించాలని ఆదేశించింది. జలవిద్యుత్‌కు వేరియబుల్ చార్జీలేమీ ఉండవు... అంతే వ్యయానికి అదనంగా ఉత్పత్తైన జల విద్యుత్‌ను సైతం డిస్కంలకు జెన్కో సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర డిస్కంలకు ఆదా కానుంది. -
రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే!
సాక్షి, కొత్తగూడెం రూరల్: అదొక సాధారణ డాబా ఇల్లు. ఆ ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక కూలర్, ఐదు బల్బులు మాత్ర మే ఉన్నాయి.. ఆ కుటుంబం నెల రోజులకు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. కానీ బిల్లు మాత్రం రూ.7,02,825 వచ్చింది. దీం తో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ ఇంటికి ప్రతినెలా రూ.500 నుంచి రూ.700 విద్యుత్ బిల్లు వచ్చేది. కానీ బుధవారం తీసిన రీడింగ్‌లో మాత్రం రూ.7 లక్షలకు పైగా బిల్లు రావడంతో ఆయన బెంబేలెత్తిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో లేదా మెషీన్లో లోపం వల్లే బిల్లు వచ్చిందని, నెల రోజు లకు తాము వినియోగించింది 117 యూనిట్లేనని సంపత్ వాపోతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ మాట్లాడుతూ.. సంపత్ ఇంటికి వచ్చిన బిల్లు రూ.625 మాత్రమేనని, రీడింగ్ మిషన్‌లో లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. చదవండి: పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని.. -
కరెంట్ బిల్లు మీరు కోరినంత తెచ్చుకోవాలా.. ఇలా చేయండి!
సాక్షి, అమరావతి: కరెంట్ వాడకంపై కాస్త అవగాహన ఉంటే.. కోరినంతే బిల్లు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే చాలామందికి వినియోగం గురించి పెద్దగా తెలియదు. పట్టపగలే లైట్లేస్తారు. గదిలో లేకున్నా ఫ్యాన్ ఆఫ్ చెయ్యరు. వాడకం కన్నా వృధా అయ్యే విద్యుత్తు ఎక్కువగానే ఉంటోంది. బిల్లు చేతికొచ్చినప్పుడు బెంబేలెత్తే బదులు.. కొన్ని మెళకువలు పాటిస్తే చాలావరకు భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. కరెంట్ ఎక్కువ కాల్చే సాధారణ బల్బులే ఇప్పటికీ వాడుతున్నారు. అత్యధిక వినియోగంతో పనిచేసే విద్యుత్ ఉపకరణాలే వినియోగిస్తున్నారు. ఇదీ లెక్క ఒక్కో విద్యుత్ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు సాధారణ బల్బు వంద వాట్స్ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. అది ఒక కిలోవాట్. గంటపాటు పది బల్బులు (ఒక కిలోవాట్) వేసి ఉంచితే.. ఒక యూనిట్ కరెంట్ కాలుతుంది. ఇలా ప్రతి విద్యుత్ ఉపకరణానికి ఓ లెక్క ఉంది. దీన్ని తెలుసుకుంటే అవసరం మేరకే కరెంట్ వాడుకోవచ్చు. అప్పుడు నెలవారీ బిల్లు తగ్గే వీలుంది. చదవండి: ఆటోమేటిక్ చెల్లింపులకు ఏప్రిల్ గండం..! -
సంక్షోభంలో కంకర మిల్లులు
కంకరమిల్లులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పెట్టిన పెట్టుబడికి, దాని మీద వచ్చే లాభాలకు పొంతన లేకుండా పోతుంది. ఒక్కో కంకర మిల్లుపై మిల్లుల యజమానులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్వహణ ఖర్చులు భరించలేక చివరకు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. - 1997లో స్లాబు కంకర యూనిట్ ధర రూ. 2800, నేడు రూ. 1600 - నాడు రా మెటీరియల్ రూ. 180, నేడు రూ. 700 - నాడు కరెంటు యూనిట్‌కు రూ. 0.50పై, ఇప్పుడు రూ. 7 - నష్టాలలో కూరుకుపోయిన కంకరమిల్లులు చీమకుర్తి: చీమకుర్తి మండలంలోని రామతీర్థం, యల్లయ్యనగర్, బూదవాడ, పల్లామల్లి ప్రాంతాల్లో దాదాపు 80 వరకు కంకర మిల్లులు ఉన్నాయి. వాటిలో దాదాపు 15 మిల్లుల వరకు మూతపడ్డాయి. మరో 20 మిల్లులు నష్టాలకు దగ్గరలో ఉన్నాయి. సొంత మిల్లు, రాజకీయ పలుకుపబడి ఉన్న వారు తప్ప మిగిలిన వారు మిల్లులు నడపడం కష్టమే అంటున్నారు. 1994-95లో స్లాబు కంకర(20 ఎం.ఎం)కు ఉపయోగించే మెటీరియల్ యూనిట్ ధర రూ. 2500 పలికింది. అది 1998వ సంవత్సరానికి వచ్చే సరికి అత్యధికంగా రూ. 2800 ధర పలికింది. ఒకప్పుడు కరెంటు చార్జీలు యూనిట్ ధర రూ. 0.50పై నుంచి రూ. 1.00పై వరకు మాత్రమే ఉండేది. మిల్లులకు అందించే రా మెటీరియల్ కూడా రూ.180 మాత్రమే ఉండేది. అలాంటిది నేడు కరెంట్ యూనిట్ ధర రూ. 7కు పెరిగింది. రా మెటీరియల్ ధర రూ. 700కు పెరిగింది. కానీ స్లాబుకు ఉపయోగించే 20 ఎం.ఎం కంకర మాత్రం రూ.1600కు పడిపోయింది. వెయ్యి ఇటుక నేడు రూ. 4800 పలుకుతుండగా కంకర(20.ఎం.ఎం) మాత్రం రూ. 1600 వద్దే ఆగింది. ఈ లెక్కన ఒక్కో కంకర మిల్లు రోజుకు సరాసరిన 10 యూనిట్లు కంకర ఉత్పత్తి చేస్తున్నాయి. మండల పరిధిలోని 80 కంకర మిల్లులు సరాసరిన రోజుకు 800 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి చేసే కంకరలో సగానికి పైగా 20 ఎం.ఎం కంకర ఉత్పత్తి చేస్తుండగా మిగిలిన సగంలో 6ఎం.ఎం (బేబీ), 40 ఎం.ఎం (రోడ్డు మెటల్, డస్ట్)ఉంటుంది. నష్టాలకే అదే కారణమా? రామతీర్థం పరిధిలో గ్రానైట్ క్వారీలు ఉండటంతో ఎక్కువ కంకర మిల్లులు ఏర్పడటానికి కారణమైంది. కాంట్రాక్టర్లుగా ఉన్న వారు, రాజకీయ పలుకుబడి ఉన్న కంకర మిల్లుల యజమానులే నష్టాలు వచ్చినా తట్టుకోగ లిగి ఇంకా కంకర మిల్లులు నడుపుతున్నారే తప్ప కేవలం కంకర మిల్లులే ఆధారంగా వ్యాపారం సాగించేవారి పరిస్థితి దయనీయంగా ఉంది. మిల్లులకు ప్రభుత్వం కరెంటు రాయితీలు, అదృష్టం కలిసొచ్చి ఇళ్ల నిర్మాణం పెరగటం, కాంట్రాక్ట్ పనులు పెరిగితేనే కంకర మిల్లులు నష్టాల నుంచి బయట పడగలమని మిల్లు యజమానులు చెబుతున్నారు. ధర పెరిగింది లేదు - మేదరమెట్ల శ్రీనివాసులు, మిల్లు యజమాని, బూదవాడ కంకర మిల్లులు పెట్టాక 1998వ సంవత్సరంలో మాత్రమే స్లాబు కంకరకు రూ. 2800 ధర వచ్చింది. అప్పటి నుంచి దాని ధర తగ్గుతూనే వచ్చింది. ప్రస్తుతం యూనిట్ ధర రూ. 1600కు పడిపోయింది. కరెంటు బిల్లులు, రా మెటీరియల్ ధరలు మాత్రం పెరుగుతునే ఉన్నాయి. ఇంక మిల్లు యజమాని కోలుకునేదెక్కడ. -
కాకరాపల్లిలో టెన్షన్-టెన్షన్