Pradeep Sharma
-
18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై : 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఫేక్ ఎన్కౌంటర్ కేసులో తాజాగా ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నవంబర్ 11, 2006 ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తాది ఫేక్ ఎన్‌కౌంటరేనని నిర్ధారించింది. ఈ కేసులో మాజీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ గౌరీ గాడ్సేలతో కూడిన ముంబై హైకోర్టు ధర్మాసనం దోషిగా తేల్చుతూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2013లో ప్రదీప్ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘శర్మ ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు లభ్యమైన సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. సాధారణ సాక్ష్యాధారాలు సైతం ఈ ఫేక్ ఎన్కౌంటర్లో అతని ప్రమేయం ఎలాంటిదో నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి’ అని కోర్టు పేర్కొంది. అనంతరం, మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మను ఆదేశించింది. దీంతో పాటు పోలీసులతో సహా 13 మందికి ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ, జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో ఆరుగురు నిందితుల నేరారోపణ, జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. నవంబర్ 11,2006 ఢిల్లీ ఫేక్ ఎన్ కౌంటర్ కేసు నవంబర్ 11, 2006న మహరాష్ట్ర వాశి నగర పోలీస్ టీం సభ్యులు గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారనే అనుమానంతో నారాయణ్ గుప్తా అలియాస్ లఖన్ భయ్యా అతని స్నేహితులు అనిబేదాను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ముంబై అంధేరి నానా నాని పార్క్‌లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ టీం నారాయణ్ గుప్తాను ఎన్కౌంటర్ చేసింది. తన అన్న నారాయణ్ గుప్తాది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ నవంబర్ 15,2006న బాధితుడి తమ్ముడు రామ్ ప్రసాద్ గుప్తా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శర్మ నిర్ధోషి అప్పటి నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసులో జులై 2013లో సెషన్స్ కోర్టు ఫేక్ ఎన్ కౌంటర్లో 13 మంది పోలీసులతో సహా 22 మందిపై అభియోగాలు మోపింది. సాక్ష్యాలు లేని కారణంగా శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 21 మంది నిందితుల్లో ఇద్దరు కస్టడీలోనే చనిపోయారు. మా అన్నది ఫేక్ ఎన్‌కౌంటరే అయితే ఎన్కౌంటర్లో దోషులుగా నిర్ధారించడంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు నారాయణ్ గుప్తా తమ్ముడు రామ్ ప్రసాద్ పెట్టిన కేసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ దోషులే కోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో కేసు మలుపు తిరిగింది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌కు తాజాగా, సుధీర్ఘంగా కొనసాగిన ఈ దర్యాప్తులో పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు ముంబై హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ చవాన్ వాదిస్తూ .. ప్రస్తుత ఈ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌కు పాల్పడ్డారని వాదించారు. 3 వారాల గడువుతో ఈ కేసులో శర్మను దోషిగా నిర్ధారించాలని కోరుతూ ప్రాసిక్యూషన్, అపహరణ, హత్యల మొత్తం ఆపరేషన్‌కు మాజీ పోలీసు ఎన్కౌంటర్ స్పషలిస్ట్ ప్రదీప్ శర్మే అసలు సూత్రదారి అంటూ కేసును తీర్పిచ్చింది. శర్మ లొంగిపోయేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. -
‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్ శర్మకు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్ సింగ్(30) అనే మహిళ తన భర్త అనీల్ సింగ్ ప్రదీప్ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. ఈ సందర్భంగా గుంజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్ సింగ్ కోసం పని చేసిన ప్రదీప్ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్‌పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
రాజకీయాల్లోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్!
ముంబై : ముంబైకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇన్స్పెక్టర్ ప్రదీప్‌శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చేరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నటు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీనియర్ అధికారులకు పంపించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున ఆయన పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా 2008లో ముంబై గ్యాంగ్‌స్టర్ లఖన్ భాయ్‌పై జరిగిన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శర్మతో పాటు మరో 13 మంది పోలీస్ అధికారులపై అప్పట్లో మహారాష్ట్ర పోలీస్ విభాగం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్న ప్రదీప్ శర్మ 2013లో తిరిగి థానే కైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు.. 1983లో మహారాష్ట్ర పోలీస్ విభాగంలో చేరిన ప్రదీప్ శర్మ అనతికాలంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 90వ దశకంలో అండర్‌వరల్డ్ మాఫియా కార్యకలపాలను అడ్డుకునే అధికారాన్ని ముంబై క్రైమ్ బాంచ్ శర్మకు కట్టబెట్టడంతో ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్‌ను అరెస్టు చేసి పెను సంచలనమే సృష్టించారు. మొత్తం 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్‌ను అంతమొందించిన ప్రదీప్ శర్మ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమాలు కూడా తెరకెక్కడం విశేషం. -
మళ్లీ విధుల్లోకి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్
ముంబై: ఆ పోలీస్ అధికారి వయసు 55 ఏళ్లు.. పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లలో 113 మంది గ్యాంగ్స్టర్లను ఏరివేశారు. ఇది ప్రదీప్ శర్మ ట్రాక్ రికార్డు. బాలీవుడ్ లో ఈయన కథ ప్రేరణతోనే అబ్ తక్ చప్పన్ అనే ఓ సినిమా కూడా వచ్చింది. అయితే తర్వాతే గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపాడన్న ఆరోపణల నడుమ కొన్నాళ్లపాటు ఖాకీ చొక్కాకు దూరమయ్యారు. చివరకు వాటి నుంచి బయటపడటంతో ఇప్పుడు విధుల్లో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లా అగ్ర ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో ప్రదీశ్ శర్మ జన్మించాడు. తండ్రిలాగే తాను టీచర్ అవ్వాలని కలలు కన్న శర్మ చివరకు పోలీసాఫీసర్ అయ్యారు. 1983 మహారాష్ట్ర పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. మే 6, 1993లో ఏకే-56 ఆయుధాల స్పెషలిస్ట్ సుభాష్ మకద్వాలా ఎన్‌కౌంటర్‌తో ప్రదీప్ వేట మొదలైంది. అక్కడ నుంచి గ్యాంగ్స్టర్ల భరతం పట్టే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో లష్కర్-ఈ-తోయిబా సానుభూతిపరులను కూడా ఆయన వదిలిపెట్టలేదు. క్రమక్రమంగా ప్రదీప్ శర్మ పేరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా మారిపోయింది. ఆపై ఆయన దృష్టంతా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం అనుచరుల మీద పడింది. ఎన్కౌంటర్ల ద్వారా వారిని ఏరి పారేస్తూ వచ్చారు. 2000 సంవత్సరంలో తన ఇన్ఫార్మర్ ఓపీ సింగ్‌ను ఛోటా రాజన్ హత్య చేయటంతో ప్రదీప్ ఆగ్రహంతో రగిలిపోయారు. అప్పటి నుంచి రాజన్‌కు నిద్రలేకుండా చేశారు. ఛోటా రాజన్ అనుచరుల్ని ఒక్కొక్కరినీ హతమార్చుకుంటూ వెళ్లడంతో రాజన్ ఒకానొక సమయంలో కాళ్ల బేరానికి వచ్చాడు. ఆరోపణలు.. అరెస్ట్... వేటు 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్ కావటం, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు ప్రదీప్ శర్మ సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో ఆయనపై వేటు పడింది. ముందు కంట్రోల్ రూం నుంచి ధారావి స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం 2008లో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2010లో ఈ ఫేక్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి 21 మంది పోలీసాఫీసర్లను అరెస్ట్ చేయగా, వారిలో ప్రదీప్ శర్మ కూడా ఉన్నారు. అయితే 13 మంది అధికారులను జూలై 2013 లో ముంబై స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించగా, శర్మ మాత్రం నిర్దోషిగా రిలీజ్ అయ్యారు. కానీ, కేసులో ఆయన పాత్రపై ఇంకా హైకోర్టులో కేసు నడుస్తుండటతో పునర్నియామకంపై పోలీస్ శాఖ వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో వచ్చే వారం ఆయన థానే పోలీస్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రదీప్ శర్మ పదవీకాలం 2018తో ముగియనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌ను గతేడాది ఇదే రీతిలో తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
అధికారంలో ఎవరున్నా మాకు ఒకటే!: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వాల మార్పుతో తమకు సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘సంబంధిత చట్టం ప్రకారం న్యాయం చేయడమే మా పని’ అని మంగళవారం తేల్చి చెప్పింది. ‘ప్రభుత్వ మార్పును పట్టించుకోం. ఏ ప్రభుత్వం వచ్చింది?, ఏ ప్రభుత్వం పోయింది? పట్టించుకోం. చట్టాన్ని ఉల్లంఘించే ఎవర్నైనా అడ్డుకుంటాం. గుజరాత్ అల్లర్ల కేసులో ఈ కోర్టు చాలా చేసింది’ అని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయి, జస్టిస్ ఎన్వీ రమణల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరైనా సరే చట్టానికి అతీతుడు కాదని పేర్కొంది. ‘తప్పు జరిగి ఉంటుందని కోర్టు నమ్మితే, అది మే తరువాతనా? లేక మే నెల కన్నా ముందా అనే విషయంతో సంబంధం లేకుండానే ముందుకు వెళ్తుంది’ పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం తనను వేధిస్తోందని సస్పెండైన ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ వేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.