Prague
-
పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే
ప్రాగ్: ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారత్‌కు చెందిన నిందితుడు నిఖిల్‌గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు ప్రాగ్ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను అమెరికాకు అప్పగించవచ్చని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గుప్తా వేసిన అప్పీల్‌ను హై కోర్టు తోసిపుచ్చింది. పన్నూ హత్యకు కుట్ర పన్నాడని నిఖిల్ గుప్తాపై అమెరికన్ పోలీసులు అభియోగం మోపారు. గతేడాది జూన్‌లో గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే హై కోర్టు ఓకే అన్నంత మాత్రాన గుప్తాను అమెరికాకు అప్పగించడం సులువు కాదని తెలుస్తోంది. పన్నూ కేసులో గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని ప్రాగ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును చెక్ రిపబ్లిక్ న్యాయ శాఖ మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మంత్రి ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై కాల పరిమితి ఏమీ లేదు. ఒకవేళ న్యాయ శాఖ మంత్రికి కోర్టు తీర్పుపై ఏమైనా సందేహాలుంటే ఆయన తిరిగి ఈ తీర్పును సమీక్షించాల్సిదిగా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాతే గుప్తాను అమెరికాకు అప్పగిస్తారు. తీర్పును సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని న్యాయ శాఖ మంత్రిని కోరతానని గుప్తా తరపు న్యాయవాది చెప్పడం గమనార్హం. ఖలిస్తానీ నేత పన్నూకు అమెరికాతో పాటు కెనడా పౌరసత్వం ఉంది. ఇదీచదవండి.. నిక్కీపై ట్రంప్ అనుచిత పోస్టులు -
చెక్ రిపబ్లిక్లో కాల్పులు.. 15 మంది మృతి
ప్రేగ్: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు సహా 15 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. జన్ పలాచ్ స్క్వేర్‌కు సమీపంలోని చార్లెస్ యూనివర్సిటీ వద్ద ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో మృతి చెందిన నిందితుడు కూడా విద్యార్థేనని పోలీసులు తెలిపారు. -
ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంటేల హరికృష్ణ చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 36 ఏళ్ల హరికృష్ణ 6.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన హరికృష్ణకు 25 వేల చెక్ కొరూనాలు (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
వాటర్‌తో గోల్డ్! వాట్ ఏ టైమింగ్
నీటిని బంగారంగా మార్చేసేయొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టైమింగ్‌తో కొన్ని మూలకాలను ఉపయోగించి తయారు చేశారు. అయితే అది కొన్ని సెకండ్లు మాత్రమే. ఈ అరుదైన ప్రయోగం టైంలో ‘టైమింగ్’ మరీ ముఖ్యం అంటున్నారు చెక్ రిపబ్లిక్ సైంటిస్టులు. ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చేసి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. సాధారణంగా లోహాలు కాని చాలా వస్తువుల్ని.. లోహాలుగా మార్చొచ్చన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, దానికి ఎక్కువ పీడనం అవసరమవుతుంది. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుంది. దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. నీటి విషయంలో.. నీటి విషయంలోనూ అధిక పీడనం ద్వారా జరుగుతుందని.. లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని సైంటిస్టులు తేల్చారు. కానీ, ఈసారి ప్రయోగంలో అంత పీడనం అవసరం లేకుండా.. లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుని.. నీటిపై ప్రయోగించి సుసాధ్యం చేశారు. సిరంజీ సాయంతో.. పిరియాడిక్ టేబుల్లోని గ్రూప్-1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు చెక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు. కానీ, ఆ మూలకాలకు నీటి చుక్క తగిలితే పేలే స్వభావం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య నిదానంగా సాగేలా చూసుకున్నారు. తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. రిస్క్ ఉంది అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సైంటిస్టులకు సూచిస్తున్నారు. ‘నేచర్’ జర్నల్‌లో గురువారం ఈ పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. -
‘టామ్ అండ్ జెర్రీ’ దర్శకుడి కన్నుమూత
ప్రేగ్: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్లో గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు. జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే. -
విమానంలో దోపిడి.. చైనా వ్యక్తి అరెస్ట్
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): చెక్ రిపబ్లిక్ లోని చైనా రాయభార కార్యాలయం తమ పౌరులను విమానాల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బీజింగ్ నుంచి ప్రేగ్ వెళుతున్న విమానంలో ఒకేసారి చాలా మంది డబ్బులు చోరీ అయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు చైనా వారే ఉన్నారు. హైనాన్ ఎయిర్ లైన్స్ విమానంలో సీటు ముందున్న పాకెట్లు, సీటు పై భాగంలో లాకర్లలో ఉన్న తమ బ్యాగుల్లో ప్రయాణికులు డబ్బు దాచుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవ్వడానికి అరగంట ముందు ఓ ప్రయాణికురాలు తన డబ్బు పోయినట్టు గుర్తించారు. దీంతో వెంటనే మిగతా వారికి చెప్పడంతో, వారిలో మరికొందరు కూడా తమ డబ్బు కూడా చోరీకి గురైనట్టు తెలుసుకున్నారు. ఈ తంతు జరుగుతుండగానే వివిధ దేశాల కరెన్సీ నోట్లు(దాదాపు రూ. 3 లక్షలు) పెట్టి ఉన్న ఓ పిల్లో కవర్ ను ప్రయాణికుడి సీటు కింద గుర్తించారు. అయితే ప్రేగ్ లో విమానం ల్యాండ్ అవ్వగానే ఈ ఘటనలో చైనాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి చైనా అధికారులకు అప్పగించారు. సదరు వ్యక్తితో పాటూ మరో ఇద్దరు కూడా ఉన్నట్టు, వారు బీజింగ్ నుంచి వచ్చి, బెలారస్ లోనే దిగిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై హైనాన్ ఎయిర్ లైన్స్ స్పందించడానికి నిరాకరించింది. విమానాల్లో దోపిడిలపై అప్రమత్తంగా ఉండాలని, పెద్ద మొత్తంలో నగదుతో ప్రయాణించొద్దని ప్రేగ్ లోని చైనా రాయభార కార్యాలయం తమ దేశీయులను హెచ్చరించింది. కాగా, ఇటీవలి కాలంలో చైనాలో ఇద్దరు, ముగ్గరు, వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడి విమానాల్లో దోపిడిలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోట కూర్చొని విమానంలో అటూ ఇటూ తిరుగుతూ ఏమరపాటూగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు దొంగిలిస్తున్నారు. కాగా, డిసెంబర్ 27న జరిగిన మరో సంఘటనలో హాంకాంగ్ నుంచి బ్రూనై వెళుతున్న విమానంలో దాదాపు రూ. లక్ష ముప్పై వేలు చోరీ చేసిన ఘటనలో వూ సాంగ్ అనే చైనా వ్యక్తికి కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. -
బాంబు బెదిరింపు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అత్యవసరంగా ఓ విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మరో ముఖ్య విషమేమంటే.. ప్యాసింజర్ ఈ చర్యకు పాల్పడ్డాడని చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్ 707 విమానం లాస్ పల్మాస్(స్పెయిన్) నుంచి వార్సాకు వెళ్తుంది. అయితే ప్రేగ్ సమీపానికి రాగానే విమానంలో బాంబు ఉందని శుక్రవారం రాత్రి విమాన సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బోయింగ్ విమానాన్ని ప్రేగ్ లోని వక్లవ్ హవెల్ ఎయిర్ పోర్టు సమీపంలోని వాడకంలో లేని మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను దించివేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలాండ్‌కు చెందిన ఓ ప్యాసింజర్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రయాణికులు రాత్రి ఆ ఎయిర్ పోర్టులో గడిపారు. తిరిగి శనివారం ఉదయం ప్రయాణికులను అదే విమానంలో వార్సాకు వెళ్లే ఏర్పాట్లుచేశారు. మరోవైపు పోలాండ్ ప్రయాణికుడు ఎందుకు బెదిరింపు కాల్ చేశాడు అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రయాణికుడి వివరాలను విమాన సిబ్బంది వెల్లడించలేదు.