praja sankalapa
-
311వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
ప్రజాసంకల్పయాత్ర @300 వేడుకలు
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజుకు చేరిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇటీవల తనపై హత్యాయత్నం జరిగిన కూడా.. చికిత్స అనంతరం వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. నేటితో జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని ఆకులవీధి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేతలు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ కడప అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర దిగ్విజయంగా 300 రోజులకు చేరుకున్న సందర్భంగా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కొరుమట్ల శ్రీనివాసులు, అంజద్ భాష, పార్లమెంట్ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తనపై హత్యాయత్నం జరిగిన లెక్కచేయకుండా.. జనం కోసం పరితపిస్తూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నాడని నేతలు పేర్కొన్నారు. విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300 రోజులకు చేరుకున్న సందర్భంగా జగదాంబ సెంటర్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త పైడి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బెలూన్లు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు ముళ్ల విజయప్రసాద్, పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, మహిళా కన్వీనర్ గరికిన గౌరి పాల్గొన్నారు. అలాగే 57వ వార్డు అధ్యక్షుడు దాడి నూకరాజు ఆధ్వర్యంలో కోటనరవలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని కల్యాణి అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా 2019లో వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 300 రోజులకు చేరుకున్న సందర్భంగా గుంతకల్లు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. జననేతపై ఎన్ని కుట్రలు చేసినా.. 2019లో ఆయన సీఎం కావడం ఖాయమని తెలిపారు. 11 జిల్లాలో పాదయాత్ర పూర్తి.. 2017, నవంబర్ 6వ తేదీన ప్రారంభమయిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఇప్పటివరకు 11 జిల్లాలో పూర్తయింది. జననేత ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జననేత పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లాలో ఒక కురుపాం నియోజకవర్గం మాత్రమే మిగిలి ఉంది. ఇది పూర్తయ్యాక చివరిగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. -
ముగిసిన 235వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 235వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు వైఎస్ జగన్ 9.6 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం తుని నియోజకవర్గంలోని తుని నైట్‌క్యాంపు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రేఖవానిపాలెం, మరువాడ, నందివొంపు, గండి మీదుగా డి.పోలవరం వరకు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు ఆయన మొత్తం 2,711.4 కిలోమీటర్లు నడిచారు. -
అందరివాడివనీ.. ఆదుకుంటావనీ..
ఉభయ కుశలోపరి.. ఎన్ని మనసులు గెలుచుకున్నారో.. ఎన్ని హృదయాల్లో కొలువై ఉన్నారో.. బుధవారం నాటి కాకినాడ బహిరంగ సభకు జనసాగరమే కదలివచ్చిందా అనిపించింది. మహానేత తనయుడు.. తండ్రి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా అభిమానాన్ని చూరగొన్నారు. ఏ కష్టమొచ్చినా ఆయనతో చెప్పుకొంటే సమస్య పరిష్కారమవుతుందని నమ్మకం. ఆయన ఒక్క అడుగు వేస్తే అనుసరించడానికి కొన్ని వేల అడుగులు సిద్ధపడుతున్నాయి. ‘నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది’ అని జనం.. ‘మీ సంతోషం.. శ్రేయస్సు.. సంక్షేమం నాది’ అని జగన్.. పరస్పరం ఒకే భావనతో ముందుకు సాగిపోయారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ నుంచి కాకినాడ సిటీ నియోజకవర్గం ఆదిత్య సెంటర్ వరకు సాగింది. తల్లితండ్రులు లేరని పట్టించుకోవడం లేదన్నా ‘చిన్నప్పుడే మా తల్లి తండ్రులు చనిపోవడంతో నేను, నా చెల్లి అనాథలుగా ఉంటున్నామ’ని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వద్ద కాకినాడ రూరల్ చీడిగకు చెందిన పెదపాటి మల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీడిగలో వైఎస్ జగన్ వద్ద సమస్యను వివరించి కన్నీరుమున్నీరైంది. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ తన చెల్లెలు మానసిక వికలాంగురాల ని, నిరుపేద కుటుంబానికి చెందినవారమని వాపోయింది. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో పరాయి పంచన తలదాచుకోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. నివసించేందుకు ఇళ్ల స్థలం ఇప్పించాలని నాలుగేళ్ల నుంచి జన్మభూమి కమిటీల్లో దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు పంచాయతీ, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదన్నారు. మీకు తల్లితండ్రులు లేరని, వయసు తక్కువ కావడంతో ఇంటి స్థలమే కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తించవని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాలాంటి నిరుపేదలను ఆదుకోవాలని జగన్‌కు విజ్ఞప్తి చేసింది. గగనంలో గాలి పంకాలు.. రివ్వున తిరిగే పంకా చల్లని గాలినిస్తుంది. పార్టీ గుర్తు కూడా.. సమస్యల వేడిలో ఓదార్పునిచ్చిన వాడు చల్లని నాయకుడవుతాడు. అంతటి నాయకుడికి స్వాగతం పలికేందుకు కాకినాడ రూరల్ గ్రామంలో వేలాడుతున్న పంకాలను స్వాగత ద్వారాలు అమర్చారు. పాదయాత్రికులను ఈ స్వాగత ప్రక్రియ విశేషంగా ఆకర్షించింది. పాదయాత్రగా వచ్చిన జగన్‌కు కాకినాడ, కాకినాడ రూరల్ గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. బెల్టు షాపులను నిర్మూలించయ్యా..! ‘‘వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బెల్టు షాపులను నిర్మూలించడయ్యా’’ అంటూ ఇంద్రపాలేనికి చెందిన వాసంశెట్టి రమణమ్మ జగన్‌ను కోరింది. తన ఇద్దరు పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారని, భర్త తాపీ పని చేస్తుండగా వచ్చిన కూలి సొమ్ములో సగం మద్యం సేవించేస్తున్నాడని వాపోయింది. విచ్చలవిడిగా ఉన్న బెల్టుషాపుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని, సంపూర్ణంగా వీటిని నిర్మూలించాలని కోరింది. -
అలీ కుటుంబ కష్టాలు విని చలించిన వైఎస్ జగన్