prakasam barage
-
ప్రమాదంలో విజయవాడ.. విరిగిన ప్రకాశం బ్యారేజీ దిమ్మ
-
125 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో..
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది.అంతకుముందు 2009 సంవత్సరం అక్టోబర్ 5 న రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కుల వరదనీరు, 1903 అక్టోబర్ 7లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది.అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో కృష్ణా పరీవాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే బుడమేరుకి గండిపడటంతో సింగ్ నగర్,ఊర్మిలానగర్, ప్రకాశ్ నగర్, వాంబేకాలనీ, ఖండ్రిగ,పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరిపేట, వైఎస్సార్ కాలనీ, జక్కుంపూడి కాలనీ తదితర ప్రాంతాలు నీట మునిగాయి.వరదల దాటికి కృష్ణలంక రైల్వే బ్రిడ్జి అంచు వరకు వరదనీటి ప్రవాహం చేరింది. నీటి ప్రవాహం మరింత పెరిగితే రైల్వే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. ఢీకొట్టిన బోట్లు.. దెబ్బ తిన్న ప్రకాశం బ్యారేజీ 69వ గేటుకృష్ణమ్మకు వరద పోటెత్తింది. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు బోట్లు కొట్టుకొస్తున్నాయి. బోట్లు ఢీకొట్టడంతో గేట్లు లిఫ్ట్ చేసే ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. మూడు భారీ పడవలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను 69వ నెంబర్ గేటు ధ్వంసమైంది. ఒక పక్కకు ఒరిగింది. -
ప్రకాశం బ్యారేజ్‌కు 2023లో ప్రపంచ స్థాయి గుర్తింపు
సాక్షి,విజయవాడ: దక్షిణ భారత దేశంలోని పలు కట్టడాలు, ప్రదేశాలు 2023 సంవత్సరంలో ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఒకటి. ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ఐసీఐడీ)ప్రకాశం బ్యారేజ్‌ను 2023లో ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ నిర్మాణంగా ప్రకటించింది. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఐడీ అధ్యక్షుడు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్(డబ్ల్యూహెచ్‌ఐఎస్) అవార్డును ఆంధ్రప్రదేశ్‌కు అందించారు.ఇప్పటివరకు భారత దేశానికి 14 డబ్ల్యూహెచ్‌ఐఎస్ అవార్డులు రాగా వీటిలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు అవార్డులు వరించాయి. The International Commission of Irrigation and Drainage (ICID) declared Prakasam Barrage as a World Heritage Irrigation Structure (WHIS).https://t.co/LincAyRUL8 pic.twitter.com/xaU8ldtEkM — South First (@TheSouthfirst) December 30, 2023 ఇదీచదవండి..జగన్ పదునైన ప్రశ్నలు..ఇంకేం ఇద్దరు గప్‌చుప్ -
‘ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: 299 టీఎంసీల కోటా నుంచి తెలంగాణ అదనంగా నీరు వాడుకుందని, కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఆయన సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వరదజలాల వినియోగంపై కేంద్రం వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. -
గోదావరి 'ఉగ్రరూపం'
సాక్షి, అమరావతి/కొవ్వూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు పొంగి గోదావరికి వరద పెరిగింది. తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి బ్యారేజీలు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం జలాశయాల గేట్లన్నీ ఎత్తేసి దిగువకు భారీగా వరదను విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గంటగంటకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. నీటిమట్టం 27.7 మీటర్లకు చేరింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువనుంచి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పోలవరం వద్దకు నాలుగు లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 62,219 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మిగులుగా ఉన్న 63,608 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నేడు ప్రకాశం బ్యారేజీకి 30 వేల క్యూసెక్కులు? ఎగువ నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 21 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో శ్రీశైలం నీటిమట్టం పెరగడం లేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 846 అడుగుల్లో 72.05 టీఎంసీల నీరుంది. తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పశ్చిమ కనుమల్లో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలంలోకి మరో రెండు రోజుల్లో భారీవరద వచ్చే అవకాశం ఉందని అ«ధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 13 వేల క్యూసెక్కులు వస్తుండగా.. మూడువేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన పదివేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో మున్నేరు, కట్టలేరు నుంచి వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో వ్యక్తి గల్లంతు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన నెల్లూరి నగేష్ (50) అనే వ్యక్తి కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఎరువుల దుకాణం నడుపుకునే నగేష్ గురువారం నల్లజర్లలో రైతులకు ఎరువులు ఇచ్చేందుకు ఆటోలో వచ్చాడు. పని ముగిశాక అక్కడి నుంచి కొవ్వూరు చేరుకుని నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. -
పూర్తి స్థాయికి నీటిమట్టం; ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
-
వరద ఉధృతి.. 40 గేట్ల ఎత్తివేత
సాక్షి, కృష్ణా : ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజ్‌లో జలకల సంతరించుకుంది. మున్నేర, పాలేరు నుంచి వరద వచ్చిచేరుతుండంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. వరద ఉధృతి మరింత పెరగడంలో 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటివరకు 29వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. బ్యారేజ్ పూర్తిగా నిండడంతో పట్టిసీమ పంపులను అధికారులు నిలిపివేశారు. ప్రధాన కాలువ నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని సాగునీరు కొరకు విడుదల చేశారు. రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో, వరద ఉధృతి మరింతే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
కాలువలకు జలకళ
- తాగునీటి అవసరాల కోసం విడుదల - తొలుత బందరు, ఏలూరు కాలువలకు.. - ఆ తరువాత రైవస్ కాలువకు.. - 10 రోజులపాటు నీటి విడుదలకు అవకాశం - చేపల చెరువులకు నిషేధం సాక్షి, విజయవాడ : వేసవిలో ప్రజల తాగు నీటి కష్టాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాగునీటి అవసరాల కోసం శనివారం రాత్రి 8 గంటలకు కాలువలకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు సుగుణాకరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పది రోజులు పాటు గ్రామాల్లోని చెరువులు నింపుకోవడానికి కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న 389 తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వివరించారు. ఈ చెరువులు పూర్తిగా నిండితే వచ్చే మే నెలాఖరు వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆ తరువాత మరో సారి తాగునీరు విడుదల చేస్తామని వెల్లడించారు. 500 క్యూసెక్కుల చొప్పున తొలుత కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్ కెనాల్‌తో పాటు బందరు, ఏలూరు కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఐదారు రోజులు తరువాత రైవస్ కాలువకు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా పది రోజులు పాటు నీరు విడుదల చేస్తే చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయని భావిస్తున్నారు. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీ నుంచి మరి కొంత ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే నాగార్జునసాగర్ నుంచి రోజుకు రెండువేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల కావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువునకు కూడా ఆచితూచి నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు నిండటానికి అర టీఎంసీ నీరు సరిపోతుంది. అయితే కాలువ చివర వరకు వెళ్లడంతో పాటు, కాలువల్లో ఉన్న వ్యర్థాలు సముద్రంలో కలవడానికి సుమారు మూడు టీఏంసీల నీరు అవసరం అవుతుందని, అప్పుడే బ్యారేజీకి దిగువున ఉన్న చెరువులన్నీ నిండుతాయని ఎస్ఈ సుగుణాకరరావు తెలిపారు. సాగర్ నుంచి ఆరు టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులు కోరగా.. ప్రస్తుతానికి అర టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ నీటిని పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసి జాగ్రత్తగా కాల్వలకు వదులుతున్నారు. చేపల చెరువులకు నిషేధం నాగార్జున సాగర్ నుంచే వచ్చే నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ మండు వేసవిని దాటేందుకు ఇరిగేషన్ ఇంజినీర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాలువలకు విడుదల చేసిన నీటిని తాగునీటి చెరువులకు చేరకుండా చేపల చెరువులకు మళ్లిస్తే భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల చేపల చెరువులకు నీటిని మళ్లించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చేపల చెరువులకు నీటిని మళ్లిస్తే ఆ ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులుపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
కృష్ణాకు ఇరువైపులా బీచ్‌రోడ్లు, రిసార్టులు
ప్రకాశం రిజర్వాయర్‌లో వాటర్బోట్లు, స్పీడ్బోట్లు భవానీ ద్వీపంతో పాటు మరో 4 ద్వీపాల్లోనూ థీమ్‌పార్కులు మాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ జోన్ ఏర్పాటు ఆవశ్యకత బ్లూ ప్రింట్ వచ్చాక టూరిజం కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్ సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రకాశం బ్యారేజీకి ఎగువన, కృష్ణానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్లు, రిసార్టులను నిర్మించి భారీసంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిసార్టులు, థీమ్‌పార్కులు, బోటింగ్ యూనిట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్ వచ్చాక క్యాపిటల్ ఏరియాలో టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి సమగ్ర వివరాలతో కూడిన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు టూరిజం శాఖ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేసిన మాస్టర్‌ప్లాన్‌లో కృష్ణానదికి ఇరువైపులా రిక్రియేషన్ జోన్ అభివృద్ధి చేయాల్సి ఉంది. దీన్లో భాగంగా రెండు వైపులా ఐదు కిలోమీటర్ల మేర విశాలమైన బీచ్‌రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. నదీ ముఖ రాజధాని నగర నిర్మాణంపై ప్రభుత్వం మొదటి నుంచి ఆసక్తి చూపుతోంది. మాస్టర్‌ప్లాన్ తయారు చేసే సంస్థలకు సైతం ముందే ఈ విషయాన్ని వివరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మాస్టర్‌ప్లాన్ తయారీ సంస్థలు ప్రకాశం బ్యారేజీకి ఎగువన నదికి రెండు వైపులా పర్యాటకుల కోసం విహార, వినోద ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం 60 అడుగుల వెడల్పులో బీచ్‌రోడ్లను నిర్మించడంతో పాటు దేశ, విదేశాలనుంచి వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా విలాసవంతమైన రిసార్టులు నిర్మించనుంది. రిజర్వాయర్‌లో పూడికమట్టిని తొలగించి 20 కిలోమీటర్ల మేర ఎగువకు న దికి మధ్య భాగాన ప్రత్యేక కాలువ నిర్మించాలని ఆలోచిస్తోంది. నదికి మధ్యలో ఉన్న భవానీ ద్వీపం చుట్టూ పర్యాటకులు విహరించేందుకు వీలుగా వాటర్బోట్లు, వాటర్‌స్పోర్ట్స్‌కు అనుకూలంగా స్పీడ్బోట్లు, జెట్‌స్కీలను ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే వీలుందని పర్యాటక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం విజయవాడలోని బరంపార్కు నుంచి భవానీ ద్వీపం ప్రాంతాలకు రాకపోకలు సాగించే పర్యాటకుల కోసం 150 సీట్ల సామర్థ్యమున్న 10 ఏసీ డబుల్ డెకర్ బోట్లు, అప్పర్ డెకర్ బోట్లు (బోధిసిరి), 50 సీట్ల కెపాసిటీవి మూడు, 30 మంది ప్రయాణించేందుకు వీలుగా రెండు ఫంటూన్లు, రెండు స్పీడ్బోట్లు ఉన్నాయి. భవానీ ఐల్యాండ్‌లో 34, బరంపార్కు దగ్గర 20 రిసార్టులున్నాయి. రాజధాని ప్రాంతం అభివృద్ధి జరిగి కొత్త నగరం ఏర్పాటు జరిగితే ఇక్కడికొచ్చే పర్యాటకులు 50 శాతం పెరిగే వీలుందని, ఈ నేపథ్యంలో వీరికి అనుగుణంగా రిసార్టుల సంఖ్య పెంచాలని యోచిస్తోంది. భవానీ ద్వీపంతో పాటు పక్కనే ఉన్న నాలుగు ద్వీపాల్లో థీమ్‌పార్కులు, రెస్టారెంట్లు, లైటింగ్ హౌస్‌లు నిర్మించాలని, ఇక్కడి ద్వీపాలను సింగపూర్‌లోని ‘సెంటోసా ద్వీపం’ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.150 కోట్లకు పైగా వెచ్చించేందుకు అంచనాలు తయారు చేస్తోందని టూరిజం శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. లే అవుట్ అభివృద్ధి తరువాతే.. రాజధాని ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ రాజధాని మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ సిద్ధమై, లే అవుట్ అభివృద్ధి జరిగాకనే చేపడతామని ఏపీటీడీసీ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఈడీ అమరేందర్‌కుమార్ చెప్పారు. భవానీ ద్వీపాన్ని ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో సెంటోసా ద్వీపం మాదిరిగా అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంటును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించాక ప్రతిపాదనల ప్రకారం పనులు చేపడతామని చెప్పారు. -
ప్రకాశం బ్యారేజీవద్ద ప్రమాద ఘంటికలు
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద ఘంటికలు చోటుచేసుకున్నాయి. బ్యారేజీలోని నీటిమట్టం కనిష్టస్థాయికి చేరింది. 8.04 అడుగులకు బ్యారేజీలో నీరు చేరుకుంది. దీంతో వీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం ఏర్పడింది. ఎగువ నుంచి నీటి విడుదల లేకుంటే ఏమి చేయలేమని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు.