Prakash purijala
-
సరికొత్త సిరివెన్నెల
‘పెళ్లైన కొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో’ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు ప్రియమణి. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైన ఆమె ప్రస్తుతం ‘సిరివెన్నెల’ అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కో ఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ బాషా, రామసీత నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని బుధవారం ప్రియమణి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారు ‘సిరివెన్నెల’ అనే గొప్ప సినిమా తీశారు. అయితే మా సినిమా థ్రిల్లర్, హారర్ జోనర్ అయినప్పటికీ కథకు సరిగ్గా సరిపోతుంది కాబట్టి ‘సిరివెన్నెల’ అని టైటిల్ పెట్టాం. టాకీపార్ట్ పూర్తయ్యింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రియమణిగారు కొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత తెలుగుసినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి ‘సిరివెన్నెల’ కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కథలో అతీంద్రియ శక్తులకి సంబంధించిన విషయాలు నేర్చుకునే ప్రాసెస్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్ థ్రిల్లింగ్‌గా చెప్పారు’’ అన్నారు. ‘‘కీరవాణిగారి దగ్గర నేను ‘బాహుబలి 2’ సినిమా వరకు మేనేజర్‌గా పని చేసాను. మా నిర్మాత కమల్‌గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఇది మా తొలి సినిమా అయినా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒకరైన బాషా అన్నారు. -
సిరివెన్నెల
తెలుగు తెరపై ప్రియమణి కనిపించి రెండేళ్లయింది. ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే ఏ తెలుగు చిత్రంలో నటించలేదు. గతేడాది ముస్తఫా రాజ్‌ని పెళ్లాడిన ప్రియమణి కెరీర్‌పై కూడా బాగానే ఫోకస్ చేస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ బాషా, రామసీత ఈ సినిమా నిర్మించనున్నారు. తెలుగు చిత్రసీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్‌ని ప్రియమణి సినిమాకి పెట్టడం విశేషం. ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణి మా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని దర్శక–నిర్మాతలు చెప్పారు. సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, ‘రాకెట్’ రాఘవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. -
ఓ యువతి పోరాటం
సమాజంలో జరుగుతున్న అఘాయిత్యా లపై ఓ సామాన్య యువతి ఎలాంటి పోరు చేసిందనే కథాంశంతో రూపొం దిన చిత్రం ‘అనగ నగా ఒక దుర్గ’. ప్రకాశ్ పురిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ చిత్రంలో క్రాంతికుమార్, ప్రియాంకా నాయుడు నటిం చారు. సమకాలీన అంశానికి వాణిజ్యపంథా జోడించి చిత్రం తీసినట్లు దర్శకుడు చెప్పారు.