Pramana Sweekaram
-
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుపతి/తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. భూమన కరుణాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దయ, ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా సేవచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని చెప్పారు. స్వామి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని, స్వామిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామని తెలిపారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సనాతన హిందూధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశామని, సామాన్య భక్తులకు అవసరమైన వసతులు కల్పించటమేగాక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆర్.కె.రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ మొదటి సంతకం
-
రైతులకు అండగా ఉండాలి
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క వరంగల్ : రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారికి అండగా నిలబడాలని టీడీపీ అనుబంధ తెలుగు రైతు నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూయ(సీతక్క) సూచించారు. జిల్లా తెలుగు రైతు కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా జిల్లా రైతు అధ్యక్షులు చాడ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను టీఆర్ఎస్ నాయకులు పరామర్శించిన పాపానపోలేదన్నారు. ప్రాజెక్టుల పేరిట దోపిడీకి పాల్పడుతూ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని అన్నారు. రైతు సమస్యలపై పట్టింపేదీ? రైతు సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని, సీఎంకు ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు అన్నారు. అవసరం లేకున్నా బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం కడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. కోర్టు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు హెచ్చరించినా పట్టించుకోకుండా రాక్షస పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, పరకాల ఇన్చార్జ్ గన్నోజు శ్రీనివాస్, జాటోత్ ఇందిర, జయపాల్, మన్సూర్హుస్సేన్, బాబా ఖాదర్అలీ, మార్గం సారంగం, రహీం, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, గుర్రం బాలరాజు, హన్మకొండ సాంబయ్య, టీఎన్ఎస్ఎఫ్ సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మ’కు అంకితం
సాక్షి, చెన్నై:ఏర్కాడు ఎమ్మెల్యేగా సరోజ పెరుమాళ్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆమె చేత అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. పెరుమాళ్ మరణంతో ఖాళీ ఏర్పడిన ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 4న ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ పెరుమాళ్ పోటీ పడ్డారు. అరుుతే 78 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సరోజ తిరుగులేని విజయాన్ని సాధిం చారు. లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా నిలిచిన ఈ ఎన్నిక విజయాన్ని సీఎం జయలలితకు సరోజ అంకితం ఇచ్చారు. తమ అధినేత్రికి ఈ విజయాన్ని కానుకగా అందించామన్న ఆనందంలో ఏర్కాడు అన్నాడీఎంకే నాయకులు సంబరాల్లో మునిగారు. విజయోత్సవ ఆనందాన్ని సీఎం జయలలితతో పంచుకునేందుకు ఉదయాన్నే సరోజ చెన్నైకు చేరుకున్నారు.రహదారుల శాఖ మంత్రి పళని స్వామితో కలసి జయ ఆశీస్సుల్ని అందుకున్నారు. తాను గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ అందజేసిన డిక్లరేషన్ ఫారాన్ని సీఎంకు అందజేశారు. సరోజను ఆప్యాయంగా జయలలిత అక్కున చేర్చుకున్నారు. అనంతరం అసెంబ్లీ మందిరానికి వెళ్లారు. అక్కడ 12 గంటల 36 నిమిషాలకు జయలలిత సమక్షంలో ఎమ్మెల్యేగా సరోజ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. సరోజను ప్రత్యేకంగా సీఎం జయలలిత అభినందించారు. స్వీటు తినిపించి మరీ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఏర్కాడు విజయానికి తోడ్పడిన నాయకులు, కార్యకర్తలకు తన సందేశాన్ని జయలలిత పంపించారు. లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయూలని పిలుపునిచ్చారు.