P.Ramulu
-
గద్వాల – మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్రం అంగీకారం
గద్వాల టౌన్: గద్వాల– మాచర్ల రైల్వేలైన్ చేపట్టేలా కృషి చేస్తున్నామని, రాష్ట్రవాటాతో కలిసి చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినందున త్వరలోనే ప్రజాప్రతినిధులు అందరం కలిసి సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నామని నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యులు పి రాములు అన్నారు. శనివారం గద్వాల మండలం జమ్మిచేడు హరిత హోటల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రాయచూరు నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్లో గద్వాల రాయచూర్ మధ్య మాత్రమే మొదటి దశలో పూర్తయిందని, రెండో దశగా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిల ద్వారా మాచర్ల వరకు చెపట్టాల్సిన రైల్వే లైన్‌ను చేపట్టేందుకు కృషి చేస్తున్నానమన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి పీయూస్ గోయల్‌ను కోరగా, ప్రాజెక్టులో రాష్ట్ర వాటాకు అంగీకరిస్తే చేపట్టేందుకు వీలుపడుతుందని చెప్పారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించామని తెలిపారు. గద్వాల మాచర్ల లైన్ వల్ల ఈ ప్రాంత అభివృద్దికి జరిగే మేలును ఆయనకు వివరించి, రాష్ట్ర వాటాను కలిపేందుకు కోరుతామన్నారు. త్వరలోనే గద్వాల మాచర్ల లైన్ డీపీఆర్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేసేలా తన వంతు కృషి ఉంటుందని తెలిపారు. గద్వాల, జోగుళాంబ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు గద్వాల రైల్వే స్టేషన్లో 21 బోగీల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తగినట్లుగా ప్లాట్ ఫాంలు 1.2లను పొడగింపురకు జీఎం అంగీకరించారన్నారు. గద్వాల జిల్లా కేంద్రం, జంక్షన్ స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్ ద్వారా ఆగకుంగా వెళ్తున్న కొంగు, అజరత్ నిజాముద్దీన్, ఘోరక్పూర్, ఓకా రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లకు హల్టింగ్ ఇవ్వాలని కోరడమైందన్నారు. వాటిలో రెండింటిని ఆపేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారన్నారు. గద్వాల స్టేషన్లో వాహనాల పార్కింగ్‌ను విస్తరించాలని కోరగా.. చేస్తామన్నారని వివరించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్సించేలా బుకింగ్‌ను అభివృద్ధి, స్టేషన్ ప్రక్కనే ఉన్న రహదారికి అండర్ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపారన్నారు. -
ఓటును నోటుకు అమ్ముకోవద్దు
సాక్షి, నాగర్‌కర్నూల్ : ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దని, నీతి, నిజాయితీతో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటుహక్కు కల్పించారన్నారు. కొంతమంది స్వార్థపరులు ఓటును నోటుకు అమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఫలితంగా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా వెనకబడుతున్నాయన్నారు. రాములును ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని, అప్పుడే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భగవంతు, విజయ్‌కుమార్, జయశంకర్, నాగేష్, నిరంజనమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి తాడూరు: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని ఇంద్రకల్, మేడిపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. స్థానంగా అందరికి అందుబాటులో ఉండే రాములును గెలిపించాలన్నారు. అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు సమ్మద్పాష ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణమోహన్‌రావు శ్రీశైలంతో పాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. సమావేశంలో సర్పంచ్ రమణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి మల్లెపల్లి వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టులు పూర్తికావాలంటే టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి తిమ్మాజిపేట: తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికావాలంటే టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పూర్తికావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ ఎంపీలు గెలువడం ముఖ్యమన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే కేంద్రం నిధులు అవసరమన్నారు. కేంద్రంలో ఏర్పాడే ప్రభుత్వంలో టీఆర్ఎస్ ముఖ్య భూమిక పోషించాలన్నారు. పాలమూర్–రంగారెడ్డి పూర్తయితే మండల పరిధిలో పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. టీఆర్ఎస్లో చేరికలు టీఆర్ఎస్ పార్టీలో పలువురు కాంగ్రెస్, ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంఘం నాయకులు వనమోలి బాల్‌రాజు, చింతకాయాల వెంకటయ్య, చింతకాయల నాగయ్య, పెద్దనాగయ్య, పూజరి బాల్‌రాజు, పురమోని బాల్‌రాజు, మాలమహానాడు నీరంజన్, 6వ వార్డు మెంబర్ చంద్రమ్మ, ఆటోడ్రైవర్ల యూనియన్ సభ్యులు జంగయ్యలు పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రవీందర్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, వేణుగోపాల్‌గౌడ్, ఎంపీపీ జయలక్ష్మి, చింతకింది లింగం, లీలావతి పాల్గొన్నారు. -
వరంగల్ నేతన్నకు జాతీయ అవార్డు
పోచమ్మమైదాన్ (వరంగల్): వరంగల్ చేనేత కార్మికుడికి అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని కొత్తవాడకు చెందిన పిట్ట రాములు జాతీయ హ్యాండ్లూం అవార్డుకు ఎంపికైనట్లు శుక్రవారం లేఖ అందింది. ఆ లేఖను రాములు విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో హ్యాండ్లూం ధర్రి(జంపకాన)కి జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారని చెప్పారు. నాలుగు నెలలపాటు కష్టపడి మొగల్ సామ్రాజ్య వేట విధానాన్ని ధర్రిలో వేశానని, ఈ సమయంలో వేరే పని చేయకుండా దీనికోసమే పని చేశానని తెలిపారు. తన కష్టానికి ఫలితం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు చెప్పారు. గత ఏడాది మార్చి 15న అవార్డు కోసం దరఖాస్తు చేశానని, పలువురు అధికారులు వచ్చి ధర్రిని పరిశీలించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 20 మందికి అవార్డులు అందజేస్తారన్నారు.