pranahita chevella
-
తప్పుదోవ పట్టించొద్దు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్స్ కు ఇంజనీర్ల జేఏసీ హితవు సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో డిజైన్ల మార్పు కారణంగా రూ. వేల కోట్లు ప్రజాధనం వృథా అయిందని దీనికి ఇంజనీర్లను బాధ్యులను చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స ప్రకటనను రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ తప్పుపట్టింది. నిజాల్ని తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించరాదని ఇంజ నీర్ల జేఏసీ సూచించింది. విభజన అనం తర పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ప్రకటనలు చేశారని ఆరోపించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పి.వెంకటేశం, కో చైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్‌లు బుధవారం ప్రక టన విడుదల చేశారు. ప్రాణహిత చేవెళ్ల లోని తమ్మిడిహెట్టి వద్ద నిర్ణీత నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం తేల్చిచెప్పడం, బ్యారేజీ ఎత్తును తగ్గించిన కారణంగానే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఆయ కట్టుకు నీరు అందించనుండగా కాళేశ్వరం ద్వారా గతంలో నిర్ణరుుంచిన ఆయకట్టు కంటే ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించవచ్చునన్నారు. -
ప్రాణహిత-చేవెళ్ల కోసం పోరాడుదాం
► వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో నేతలు రంగారెడ్డి జిల్లా: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోనే రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జిల్లాలో కొంత ప్రాంతానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లా అంతటా సాగునీరు అందించవచ్చని పేర్కొంది. ఈ ప్రాజెక్టు సాధనకోసం ఉద్యమించాలని నిర్ణయించుకుంది. ఆదివారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలను పరిచయం చేసుకున్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే జిల్లా నూతన అధ్యక్షులను ఎంపిక చేస్తామని, అదేవిధంగా అనుబంధ కమిటీలకు కార్యవర్గాల్ని నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని, ఈ ప్రాజెక్టుతో పది జిల్లాలు మాత్రమే నీరందే అవకాశముందన్నారు. జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరు, తాగునీరు అందాలంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టే పరిష్కారమాన్నారు. ఈ ప్రాజెక్టును సాధించేందుకు ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్లు అమృతాసాగర్, చెరుకు శ్రీనివాస్, సత్యమూర్తి, చంద్రశేఖర్, బల్వంత్‌రెడ్డి, జొన్నాడ రాజయ్య, జంగయ్యగౌడ్, సంగమేశ్వర్, నాగరాజు, మురళీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య, కుసుమకుమార్ రెడ్డి, జయ, అశోక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తుమ్మిడిహెట్టి ఎత్తుపై నేడు మహారాష్ట్రతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో తెలంగాణ అధికారులు సోమవారం మరోమారు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో మహారాష్ట్ర వెల్లడించే అభిప్రాయాల మేరకు బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయానికి రానున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తుపై చర్చలకు రావాలని కోరుతూ ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంత చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చవాన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మహారాష్ట్ర అధికారులు సోమవారం రాష్ట్రానికి వస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల మేర ఉంటే తమ భూభాగంలో 1,850 ఎకరాల వరకు ముంపు ఉన్న దృష్ట్యా దాన్ని తగ్గించాలని మహారాష్ట్ర కోరుతోంది. ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని అంటోంది. దీంతో చేసేది లేక రాష్ట్రం తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా నిర్ణీత నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచి తీసుకునే అంశమై పరిశీలనలు జరుపుతోంది. అయితే ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాల నిమిత్తం తుమ్మిడిహెట్టి బ్యారేజీని తక్కువ ఎత్తులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్ధ్యం ఏమాత్రం అన్నదానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభిప్రాయాలను అధికారికంగా తెలుసుకున్నాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. నెలాఖరుతో మూసుకోనున్న బాబ్లీ గేట్లు.. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల 29 నుంచి మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గేట్లు తెరిచి ఉంచేందుకు విధించిన గడువు ఈ నెల 28తో ముగియనున్న నేపథ్యంలో మరుసటి రోజు గేట్లు మూసి నీటిని నిల్వ చేసుకునేందుకు మహారాష్ట్ర సమాయత్తం అవుతోంది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 7లక్షల ఎకరాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలరాకను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు మహారాష్ట్ర జూలై ఒకటిన ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీరు దిగువకు వచ్చే ఏర్పాట్లు చేసింది. అయితే గోదావరి బేసిన్లో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరాంసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు రాలేదు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో గేట్ల మూసివేతపైనా చర్చించే అవకాశాలున్నాయి. -
పాలమూరు ‘కొత్త’ భారం 10,000 కోట్లు
* ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పుతో పెరగనున్న వ్యయం * రూ.32 వేల కోట్ల నుంచి రూ. 42 వేల కోట్లకు పెరిగిన అంచనాలు * 4,200 మెగావాట్లకు చేరుతున్న విద్యుత్ అవసరాలు * శ్రీశైలం నీటిని తరలించేందుకు రిజర్వాయర్లు, లిఫ్ట్‌ల సంఖ్య పెరగడమే కారణం * వ్యయంపై సర్కారు సందిగ్ధం.. ప్రత్యామ్నాయాలపై దృష్టి * ఇప్పటివరకు భారీ ప్రాజెక్టు ‘ప్రాణహిత’నే.. * దీని అంచనా వ్యయం రూ. 38,500 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతో భారీ ప్రాజెక్టుగా చెబుతున్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ అంచనా వ్యయాన్ని మించిపోనుంది. అంతేకాదు భారీ స్థాయిలో విద్యుత్ అవసరాలూ పెరిగిపోనున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా రూపొందించిన కొత్త డిజైన్‌లో రిజర్వాయర్లు, లిఫ్టుల సంఖ్య పెరగడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త డిజైన్ ప్రకారం పాలమూరు ప్రాజెక్టును చేపడితే.. నిర్మాణ వ్యయం ఏకంగా రూ.42వేల కోట్లకు, విద్యుత్ అవసరం 4,200 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. పాలమూరు ప్రాజెక్టుకు తొలి డిజైన్ ప్రకారం రూ.32 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని... 3,300 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. కానీ తాజా డిజైన్‌తో నిర్మాణ వ్యయం, విద్యుత్ అవసరాలు 30 శాతం వరకు పెరగనున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు రూ. 38,500 కోట్లతో భారీ ప్రాజెక్టుగా ఉన్న ప్రాణహిత-చేవెళ్లను పాలమూరు ఎత్తిపోతల పథకం దాటిపోనుంది. వ్యత్యాసం రూ.10 వేల కోట్లు.. పాలమూరు ప్రాజెక్టు తొలి డిజైన్ మేరకు జూరాల నుంచి వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి... కోయిల్‌కొండ, గండేడు, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి. జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు రూ.15,950 కోట్లు, గండేడు వరకు రెండో దశకు రూ.8,650 కోట్లు, లక్ష్మీదేవునిపల్లి మూడో దశకు రూ.7,600 కోట్లతో మొత్తంగా రూ.32,200 కోట్ల వ్యయ అంచనా వేశారు. ఆ డిజైన్‌తో ముంపు అధికంగా ఉండడంతో.. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేలా కొత్త డిజైన్ రూపొందించారు. శ్రీశైలం నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు 70టీఎంసీల నీటిని తరలించేందుకు 6 రిజర్వాయర్లను (నార్లాపూర్ వద్ద 6 టీఎంసీలు, ఏదుల 3.4, వట్టెం 11, కర్వేని 16, లోకిరేవు 10, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద 10 టీఎంసీలతో) ప్రతిపాదించారు. వీటిని అనుసంధానిస్తూ ఓపెన్ కెనాల్లు, సొరంగాలను నిర్మించాలి, 5 చోట్ల ఎత్తిపోయాలి. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికే రూ.9 వేల కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఇందులో కర్వేనికి రూ.1,500 కోట్లు, వట్టెంకు రూ.1,400 కోట్ల మేర అంచనా వేశారు. అయితే మొదటి డిజైన్‌తో పోలిస్తే రిజర్వాయర్ల సంఖ్య 3 నుంచి 6కు.. లిఫ్టుల సంఖ్య 3 నుంచి 5కి పెరిగింది, పంపింగ్ రోజులు సైతం 35 నుంచి 60 రోజులకు పెరగడంతో అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తంగా మొదటి, రెండు డిజైన్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.10 వేల కోట్లు. ప్రత్యామ్నాయాలపై దృష్టి డిజైన్ మార్పుతో అంచనాలన్నీ తారుమారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. వ్యయాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదంతా ఓ కొలిక్కి వచ్చేందుకు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో ఈ నెల 31న శంకుస్థాపన చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాల వివరాలు ప్రాణహిత-చేవెళ్ల పాలమూరు 160 టీఎంసీలతో 16.40లక్షల ఎకరాలకు నీరు 70 టీఎంసీలతో 10 లక్షల ఎకరాలకు నీరు ప్రయోజనం పొందే జిల్లాల సంఖ్య 7 మూడు జిల్లాలకు ప్రయోజనం ప్రాజెక్టు అంచనా రూ.38,500 కోట్లు సుమారు రూ.42 వేల కోట్లు అవసరమైన విద్యుత్ 3,159 మెగావాట్లు విద్యుత్ అవసరం 4,200 మెగావాట్లు ప్రాజెక్టు పరిధిలో మొత్తం రిజర్వాయర్లు 12 పథకంలో ప్రతిపాదించిన రిజర్వాయర్లు 6 -
'సొమ్ము మింగిన' కాంట్రాక్టర్లు జైలుకే: దానం
కాంట్రాక్టర్లపై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లే భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్‌లలో అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచడానికి ఎలా అంగీకరించారని ఆయన ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దొడ్డి దారిన కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును దిగమింగిన కాంట్రాక్టర్లు త్వరలో జైల్లో ఉంటారని హెచ్చరించారు. మాజీ మంత్రులు సబిత, ధర్మాన ప్రసాద రావులు చేయని తప్పులకు నిందలు పడ్డారని దానం అభిప్రాయపడ్డారు. అంచనాలు పెంచడం వల్ల ప్రాణహిత చేవెళ్లకు జరిగింది శూన్యమన్నారు. హంద్రినీవాకు మాత్రం 8 స్టేజ్లని అన్నారని అయితే ఇప్పటికి 34 స్టేజ్‌లకు వచ్చిందన్నారు. ట్రైబ్యునల్ ప్రకారం 15 టీఎంసీల నీటీని హైదరాబాద్‌కు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నా ప్రభుత్వం ఎక్కడా పేర్కొన్నలేదని దానం నాగేందర్ తెలిపారు. -
ప్రాణహిత-చేవెళ్లతో ప్రయోజనం
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో సిద్దిపేట నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట మండల పరిధిలోని గాడిచర్లపల్లి, ఇమాంబాద్ గ్రామాల మధ్య సాగుతున్న ప్రాజెక్టు పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం రెండు గ్రామాల్లో భూములు కోల్పొయిన రైతులతో మాట్లాడారు. వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. వ్యవసాయం చేసుకునే రైతుల భూములను తీసుకున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి నష్టపరిహారం అందేలా చూడాలని అక్కడే ఉన్న ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ ఐలయ్య, ఈఈ గోవిందరావును కోరారు. భూమి కోల్పొయిన రైతులు పడిశెట్టి లచ్చవ్వ, కిష్టారెడ్డి మాట్లాడుతూ తమకు పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారన్నారు. వ్యవసాయం చేస్తేనా ఆదాయం వస్తుందని అలాంటి తమ భూమిని తీసుకున్నారని తమకు వీలైనంత తొందరలో పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాల్‌రాజు, డిప్యూటీ తహశీల్దార్ చంద్రమౌళి, మాజీ సర్పంచ్‌లు, రాజయ్య, శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత బాల్‌రంగం పాల్గొన్నారు. -
సాగుతున్న ‘ప్రాణహిత’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రాంతానికి జీవనాడి అయిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టును సర్కారు అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. చాలీచాలని నిధుల కేటాయింపులతో పను లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పోలవ రం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించి సత్వరమే పూర్తి చేస్తామని ప్రకటించిన కేం ద్రం ఈ ప్రాజెక్టు విషయంపై ఏమీ మాట్లాడక పోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కే విధంగా కృషి చేస్తామని గొప్పలు చెప్పిన సర్కారు ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన కేంద్రం పోలవరం ప్రాజెక్టుపై అమిత ప్రేమను ఒలుకబోసి ‘ప్రాణహిత’పై వివక్ష చూపటంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. సొరంగ మార్గం, రిజర్వాయర్లకు సంబంధించి న పలు పనులు మందకొడిగా సాగుతున్నాయి. జాతీయ హోదా లభిస్తే తప్ప పనులకు ముందడుగు పడే అవకాశం కనిపించడం లేదు. ఇదీ పరిస్థితి 2012 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, బాలారిష్టాలను దాటలేదు. తెలంగాణ బీడు భూముల నోళ్లు తడపవల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి, పలు ఏజెన్సీలకు అప్పగించారు. ఐదేళ్లు పూర్తి అవుతున్నా, కొన్ని ప్యాకేజీల్లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం సర్కారు చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఉన్న 275 గ్రామాలకు సాగునీరు అందించడానికి మూడు ప్యాకేజీలకు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.3,483 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందూరులో ఇలా.. జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామం వద్ద అప్రోచ్ కాలువ తవ్వకంతో పాటు సొరంగమార్గం పనులు ఏడాది క్రితం ప్రారంభమయ్యాయి. 17 కిలోమీటర్ల సొరంగమార్గం పనులకుగానూ ఇప్పటి వరకు కిలోమీటర్ వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్ మండలం మంచిప్పలో సొరంగమార్గం, సారంగాపూర్ వద్ద పంపుహౌస్, కొడెంచెరువు వద్ద రిజర్వాయర్ పనులను ప్రారంభించినప్పటికి మొక్కుబడిగా సాగుతున్నాయి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి వద్ద పనులు ఇ ప్పుడిప్పుడే మొదలు పెట్టారు. నిధుల కొరత కారణంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. బోధన్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో పాటు పూర్థి స్థాయిలో నిధులు విడుదలయ్యే విధంగా కృషి చేస్తానని ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. ప్యాకేజీ పనులు ఇలా.. 20వ ప్యాకేజీ పనులకు రూ. 892 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకు రూ. 38.90 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. 492 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా 472 ఎకరాలు మాత్రమే సేకరించారు. 21వ ప్యాకేజీ పనులకు రూ.1,143 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.25.03 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 22వ ప్యాకేజీ పనుల కోసం రూ. 1,446 కోట్లు అంచనా వేయగా రూ.51.62 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 3,483 కోట్ల పనులకుగాను రూ. 115.55 కోట్ల విలువ చేసే పనులు మాత్రమే జరిగాయంటే ఎంత మందకొడిగా పనులు సాగుతున్నాయే అర్థమవుతుంది. మూడు ప్యాకేజీల పనులు 2012 నాటికే పూర్తి కావల్సినప్పటికిని ఏటా పొడిగిస్తూ వస్తున్నారు. 20, 21వ ప్యాకేజీల పరిధిలో నిజామా బాద్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, మాక్లూర్, సిరికొండ, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్, బాల్కొండ (నిజామాబాద్), మెట్పల్లి (కరీంనగర్), 22వ ప్యాకేజీ పరిధిలో గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్, కామారెడ్డి, భిక్కనూర్, మాచారెడ్డి, దోమకొండ (నిజామాబాద్), రామాయంపేట (మెదక్) మండలాలు వస్తాయి.