► వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో నేతలు
రంగారెడ్డి జిల్లా: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోనే రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జిల్లాలో కొంత ప్రాంతానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లా అంతటా సాగునీరు అందించవచ్చని పేర్కొంది. ఈ ప్రాజెక్టు సాధనకోసం ఉద్యమించాలని నిర్ణయించుకుంది. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలను పరిచయం చేసుకున్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే జిల్లా నూతన అధ్యక్షులను ఎంపిక చేస్తామని, అదేవిధంగా అనుబంధ కమిటీలకు కార్యవర్గాల్ని నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని, ఈ ప్రాజెక్టుతో పది జిల్లాలు మాత్రమే నీరందే అవకాశముందన్నారు.
జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరు, తాగునీరు అందాలంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టే పరిష్కారమాన్నారు. ఈ ప్రాజెక్టును సాధించేందుకు ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్లు అమృతాసాగర్, చెరుకు శ్రీనివాస్, సత్యమూర్తి, చంద్రశేఖర్, బల్వంత్‌రెడ్డి, జొన్నాడ రాజయ్య, జంగయ్యగౌడ్, సంగమేశ్వర్, నాగరాజు, మురళీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య, కుసుమకుమార్ రెడ్డి, జయ, అశోక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల కోసం పోరాడుదాం
Published Sun, May 15 2016 10:12 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement
Advertisement