ప్రాణహిత-చేవెళ్లతో ప్రయోజనం | Harish rao visited to Pranahita Chevella Project Area | Sakshi
Sakshi News home page

ప్రాణహిత-చేవెళ్లతో ప్రయోజనం

Published Thu, Sep 19 2013 1:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Harish rao visited to Pranahita Chevella Project Area

 సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో సిద్దిపేట నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట మండల పరిధిలోని గాడిచర్లపల్లి, ఇమాంబాద్ గ్రామాల మధ్య సాగుతున్న ప్రాజెక్టు పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం రెండు గ్రామాల్లో భూములు కోల్పొయిన రైతులతో మాట్లాడారు. వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. 
 
 వ్యవసాయం చేసుకునే రైతుల భూములను తీసుకున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి నష్టపరిహారం అందేలా చూడాలని అక్కడే ఉన్న ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ ఐలయ్య, ఈఈ గోవిందరావును కోరారు. భూమి కోల్పొయిన రైతులు పడిశెట్టి లచ్చవ్వ, కిష్టారెడ్డి మాట్లాడుతూ తమకు పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారన్నారు. వ్యవసాయం చేస్తేనా  ఆదాయం వస్తుందని అలాంటి తమ భూమిని తీసుకున్నారని తమకు వీలైనంత తొందరలో పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాల్‌రాజు, డిప్యూటీ తహశీల్దార్ చంద్రమౌళి, మాజీ సర్పంచ్‌లు, రాజయ్య, శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నేత బాల్‌రంగం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement