సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ రైతులు బాగుపడటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. రైతులు సంతోషంగా ఉండటాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదే.
మిషన్ కాకతీయతో 5 లక్షల ఎకరాలకు ఆయకట్టు సృష్టించాం. ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం. 40 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని పనులు మేము చేస్తున్నాం. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దు. కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది.’ అని అన్నారు.