ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్‌కు అసోచాం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశాల్లో వ్యాపార వాణిజ్య రంగంలో కృషి చేసినందుకు ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్‌ను అసోచాం రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించింది. అసోచాం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత్-ఆఫ్రికా వ్యాపార, పెట్టుబడుల ఫోరం సదస్సు సందర్భంగా ఆఫ్రికాలో వ్యాపారం, పెట్టుబడి రంగాల్లో కృషి చేసిన భారతీయ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మోటపర్తి శివరామ ప్రసాద్ 1991లో ఘనాలో టెమా అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి వ్యాపారం ఆరంభించారు.
తరవాత ఎమెక్స్ఫీల్డ్ టోగో స్టీల్ ఎస్ఆర్ఏఎల్ సంస్థను టేకోవర్ చేశారు. ఈ అవార్డులను కేంద్ర మంత్రి రామ్‌క్రిపాల్ యాదవ్, అసోచాం చైర్మన్ అంబుజ్ చతుర్వేదీ తదితరులు అందజేశారు. ప్రసాద్‌కు హైదరాబాద్‌లోని పఠాన్‌చెరులో అల్లాయ్ స్టీల్ కంపెనీ మార్టోపెరల్, డెక్కన్ ఆటో సంస్థలున్నారుు. ఇటీవల పనామా పేపర్లలోనూ ఈయన పేరు వినిపించింది. అరుుతే విదేశాల్లోని తన వ్యాపారాలన్నీ ఆర్బీఐ, ప్రభుత్వ అనుమతితో జరుగుతున్నవేనని ఆ తరవాత ఆయన వివరణిచ్చారు.