prasanthi express
-
28 కిలోల గంజాయి పట్టివేత
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో శనివారం 28 కిలోల గంజాయిని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. కాజీపేట జీఆర్పీ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దొంతి రామాంజనేయులు అన్నవరంలో 28 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గంజాయితో అనంతపురం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అయితే రైల్వే అధికారులు విజయవాడ రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనుల కారణంగా ఈ రైలును కాజీపేట జంక్షన్ మీదుగా దారి మళ్లించారు. ఈ క్రమంలో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్న రైలు నుంచి గంజాయి బ్యాగుతో అతడు దిగాడు. పక్కన బ్యాగు పెట్టి ప్లాట్‌ఫాంపై నిల్చొని అటుఇటు దిక్కులు చూస్తుండగా పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి తరలింపును ఒప్పుకున్నాడు. రూ.42,000 విలువైన గంజాయి బ్యాగును స్వాధీనం చేసుకుని రామాంజనేయులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
'ప్రశాంతి'లో పొగలు: పెద్దఅవుటపల్లిలో నిలిపివేత
విజయవాడ: బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో బుధవారం దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ విషయం గమనించిన ఇంజన్ డ్రైవర్ వెంటనే కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఇంజిన్‌లో పొగలు వ్యాపించడంపై డ్రైవర్, రైల్వే గార్డు విజయవాడలోని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రైల్వే ఉన్నతాధికారులతోపాటు సాంకేతిక సిబ్బంది పెద్దఅవుటపల్లి చేరుకున్నారు. రైలు ఇంజిన్‌లో పొగలు వ్యాపించడానికి గల కారణాలపై సాంకేతిక సిబ్బంది అన్వేషిస్తున్నారు. అయితే రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పలు రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం డివిజన్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది. విశాఖ, భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు పేర్కొంది. రైలు నెంబర్12863: హౌరా -యశ్వంత్‌పూర్, రైలు నెంబర్18463: భువనేశ్వర్ - బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, రైలు నెంబర్18047: హౌరా-వాస్కో అమరావతి ఎక్స్‌ప్రెస్, రైలు నెంబర్18401: పూరీ-వోకా ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. విజయనగరం, రాయ్‌పూర్, నాగ్‌పూర్ మీదుగా మళ్లీస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే పేర్కొంది.