'ప్రశాంతి'లో పొగలు: పెద్దఅవుటపల్లిలో నిలిపివేత | Smoke in prasanthi express engine at Peda Avutapalli railway station | Sakshi
Sakshi News home page

'ప్రశాంతి'లో పొగలు: పెద్దఅవుటపల్లిలో నిలిపివేత

Published Wed, May 13 2015 9:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

'ప్రశాంతి'లో పొగలు: పెద్దఅవుటపల్లిలో నిలిపివేత

'ప్రశాంతి'లో పొగలు: పెద్దఅవుటపల్లిలో నిలిపివేత

విజయవాడ: బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇంజిన్లో బుధవారం దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ విషయం గమనించిన ఇంజన్ డ్రైవర్ వెంటనే కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఇంజిన్లో పొగలు వ్యాపించడంపై డ్రైవర్, రైల్వే గార్డు విజయవాడలోని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దాంతో రైల్వే ఉన్నతాధికారులతోపాటు సాంకేతిక సిబ్బంది పెద్దఅవుటపల్లి చేరుకున్నారు. రైలు ఇంజిన్లో పొగలు వ్యాపించడానికి గల కారణాలపై సాంకేతిక సిబ్బంది అన్వేషిస్తున్నారు. అయితే రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement