rail engine
-
బోగీలను వదిలి రైలింజన్ పరుగులు!
శివమొగ్గ(బెంగళూరు): బోగీలను వదిలి రైలింజిన్ పరుగులు తీసిన ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా కడదకట్టె రైల్వే లెవల్‌క్రాసింగ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. తాళగుప్ప–బెంగళూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 7.05 గంటలకు భద్రావతికి బయల్దేరింది. భద్రావతి తాలూకా కడదకట్టె రైల్వే లెవల్ క్రాసింగ్ వద్దకు రాగానే ఇంజిన్, బోగీలకు మధ్య లింక్ ఊడిపోయింది. ఇంజిన్ పరుగులు తీస్తుండగా బోగీలు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భీతిల్లారు. ఇంజిన్ వెనుక బోగీలు లేని విషయాన్ని గమనించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. భద్రావతి, శివమొగ్గ నుంచి సిబ్బంది వచ్చి ఇంజిన్‌ను వెనక్కు తీసుకొచ్చి బోగీలతో కలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి -
బోగీలు లేకుండానే గూడ్స్ రైలు ఇంజిన్ ముందుకు..
సాక్షి, బోనకల్(ఖమ్మం): సరుకు రవాణా గూడ్స్ రైలు బోగీల లింకు తెగిపోవడంతో గోవిందాపురం(ఏ) రైల్వే గేటు సమీపంలో సోమవారం ఓ గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. విజయవాడ వైపు ఈ గూడ్సురైలు వెళ్తుండగా సాయంత్రం 4గంటల సమయంలో ఒక్కసారిగా లింక్ తెగింది. అయితే ఈ విషయాన్ని రైలు డ్రైవర్ గుర్తించకుండా ఇంజిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. గార్డు సమాచారాన్ని అందించాక తిరిగి ఇంజిన్‌ను వెనుకకు తెచ్చి మరమ్మతులు చేశారు. గంట పాటు పట్టాలపై నిలవడంతో పలు ట్రెయిన్ల రాకపోకలు నిలిచిపోయాయి. గేటు వద్ద ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఏనుగును ఈడ్చుకెళ్లిన రైలు ఇంజన్ సీజ్
గువహతి : పట్టాలు దాటుతున్న తల్లి ఏనుగును, పిల్ల ఏనుగును ఢీకొట్టడమే కాకుండా పిల్ల ఏనుగును దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిందో గూడ్సు రైలు. ఆ రెండు ఏనుగులు మృత్యువాత పడిన ఈ ఘటనలో గూడ్సు రైలు ఇంజన్‌ను సీజ్ చేశారు అస్సాం అటవీ శాఖ అధికారులు. వివరాల్లోకి వెళితే.. గత సెప్టెంబర్ 27న అస్సాం లుండింగ్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతున్న 35 ఏళ్ల ఓ ఏనుగును దాని పిల్లను నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన ఓ గూడ్సు రైలు ఢీకొంది. దీంతో తల్లి ఏనుగు పైకి ఎగిరి పక్కకు పడిపోయింది. పిల్ల ఏనుగు పట్టాలపై పడిపోగా.. రైలు దాన్ని ఒక కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లింది. ఆ రెండు ఏనుగుల మృత్యువాతపై అస్సాం అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ( పీల్చే గాలి విషం ) రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అతి వేగంగా వెళ్ల కూడదన్న నిబంధనలను సదరు రైలు అతిక్రమించిందని అటవీ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా గత మంగళవారం నాడు గువహతి బామునిమైదాన్ రైల్వే యార్డ్‌లో సదరు రైలు ఇంజన్‌ను సీజ్ చేశారు. దాని ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు. దానిపై కేసు నమోదు చేసిన తర్వాత రైల్వే శాఖకు అప్పగించారు. దీనిపై స్పందించిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ‘‘ రైలు ఇంజన్‌ను సీజ్ చేయటం ఇది మొదటి సారేమీ కాదు. విచారణలో భాగంగా ఇంజన్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ రైలు ఇంజన్ వాడకంలోనే ఉంద’’ని తెలిపారు. -
చుక్ చుక్ బండి వచ్చింది!
కూ.. చుక్.. చుక్.. అంటూ గంభీరమైన శబ్దం.. దిక్కులు పిక్కటిల్లేలా కూత.. పొగమంచు కమ్మిన అనుభూతి కలిగించేలా ఆవిరి.. దట్టమైన నల్లటి పొగ.. రైలుబండి అసలు స్వరూపమిదే కదా. కానీ ఆధునిక రైలింజన్లలో ఆ శబ్దం మారింది.. పొగ మాయమైంది.. ఆవిరి ఊసే లేదు.. కానీ సాయంత్రం 6తర్వాత సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుంచి మెట్టుగూడ వైపు వెళ్తుంటే అలనాటి రైలు కూత, ఇంజన్ శబ్దం, ఆవిరి, పొగ.. అన్నింటినీ ఆస్వాదించవచ్చు. వందేళ్ల కింద పట్టాలపై పరుగు లెట్టిన రైలింజన్ దర్జాగా కొలువుదీరి.. అప్పటి ‘రైలు అనుభూతి’ని సాక్షాత్కరిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ దర్జాగా ‘సర్ అలెక్’ ఇంజన్.. నిజాం స్టేట్ రైల్వేలో తొలితరం రైలింజనే ‘సర్ అలెక్’లోకోమోటివ్. ఇంగ్లండ్‌కు చెందిన ‘కిట్సన్ అండ్ కొ’దీన్ని 1907లో రూపొందించింది. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా సికింద్రాబాద్ నుంచి వాడీ మధ్య ప్రారం భమైన తొలి మార్గంలో ఈ ఇం జన్ పరుగుపెట్టింది. బార్సీ లైట్ రైల్వే న్యారో గేజ్ సిస్టంలో దీన్ని విని యోగించారు. ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఇది విలీనమైంది. కొన్ని దశాబ్దాల సేవల అనంతరం దీన్ని రైల్వే సర్వీసుల నుంచి ఉప సంహరించారు. ఆ తర్వాత షెడ్డుకు పరిమిత మైంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆవిర్భవించాక దాని కేంద్ర కార్యాలయం రైల్ నిలయం ఎదుట ఆకర్షణగా దీన్ని ఏర్పాటు చేశారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా నాలుగేళ్ల కింద పనిచేసిన రవీంద్ర గుప్తా దానికి పెయింట్ వేయించి అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అది పట్టాలపై పరుగుపెట్టే అనుభూతి కలిగించేలా మార్చారు.సాంకేతిక సమస్యలు సరిదిద్ది ఇంజన్ ఆన్ అయ్యేలా చేశారు. ముందువైపు నక్షత్రం పైన ఉండే భారీ లైటు వెలగటం, ఆ తర్వాత తొలితరం ఇంజన్ శబ్దం, కూత మొదలు కావటం, ఆ వెంటనే ఆవిరి, పొగ రావడం.. ఒక్కసారిగా కొన్ని దశాబ్దాల కిందటి రైలును కళ్లారా చూసినట్లే అనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఈ ఇంజన్ పనిచేసేలా కృత్రిమ ఏర్పాటు చేశారు. ట్రామ్ ఇంజన్ కూడా సిద్ధం.. హైదరాబాద్‌లో ట్రామ్ రైలు తిరిగిందనే విషయం కొద్దిమందికే తెలుసు. నిజాం సాక్షిగా రోడ్లపై పరుగుపెట్టిన ట్రామ్ తాలూకు ఇంజన్ కూడా ఇప్పుడు దర్జా ఒలకబోస్తోంది. జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్‌గా పిలుకునే ఇది పట్టాలపై కాకుండా రోడ్డుపై పరుగుపెట్టేది. దీనికి బస్సు తరహాలో సాధారణ టైర్లే ఉంటాయి. 1914లో రూపొందిన ఈ ఇంజన్‌కు విఖ్యాత ష్రాస్బరీ అండ్ చాలెంజర్ కంపెనీ ఒరిజినల్ టైర్లు వాడారు. ఈ టైర్లు వాడిన ట్రామ్ ఇంజన్ ఇదే కావటం విశేషం. లాలాగూడ వర్క్ షెడ్లో విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఇంజన్‌కు నాటి ఒరిజినల్ విడిభాగాలన్నీ అలాగే ఉన్నాయి. ఇటీవలే దాన్ని పూర్తిస్థాయిలోమరమ్మతు చేసి రంగులతో ముస్తాబు చేశారు. ఇటీవల జరిగిన రైల్వే వింటేజ్ ర్యాలీలో హొయలు ఒలకబోసి మొదటి బహుమతి గెలుచుకుంది. 1886లో తయారైన చెక్క బోగీలు, 1970 నాటి మీటర్ గేజ్ బోగీ, 1920లో బర్మింగ్‌హామ్ అండ్ వ్యాగన్ కంపెనీ సిద్ధం చేసిన బీజీ వ్యాగన్, 1925లో తయారైన 83 కిలోల బరువున్న ఇత్తడి ఫైర్ అలారమ్ బెల్ ఉన్నాయి. కాగా, వీటన్నింటినీ ప్రజలు వీక్షించే వీలు ఉంది. కానీ అందుకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అది మన వారసత్వ సంపద దక్షిణ మధ్య రైల్వే ‘మన రైల్వే ప్రారంభమైన సమయంలో ప్రజలకు సేవలందించిన ఇంజన్లు, బోగీలు, ఇతర వస్తువులను వారసత్వ ఆస్తిగా భావిస్తాం. ప్రపం చంలోనే గొప్ప రైల్వేగా ఉన్న భారతీయ రైల్వే సేవలకు ఇవి గుర్తులు.అందుకే వాటిని కాపాడి భావి తరానికి చూపేం దుకు ఈ ఏర్పాటు చేశాం.’ – సీహెచ్ రాకేశ్, సీపీఆర్ఓ -
బోగీలు లేకుండా వెళ్లిన రైలు ఇంజిన్
బాడంగి: బోగీలు లేకుండానే ఎక్స్ ప్రెస్ ప్రయాణించించడం స్థానికులలో ఆసక్తిని పెంచగా, రైళ్లోని ప్రయాణికులను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం దొంకినవలస వద్ద చోటుచేసుకుంది. బోగీలను విడిచి ధన్‌బాద్ - అల్లెప్పఝా బొకారో ఎక్స్ ప్రెస్ ఇంజిన్ రెండు కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లిపోయింది. బోగీలతో లింక్ తెగిపోవడంతో రైలు ఇంజిన్ మాత్రమే వెళ్లిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజిన్ మాత్రమే వెళ్లడంతో దాదాపు గంటన్నర పాటు బోగీలు అక్కడే నిలిచిపోయాయి. ఆ సమయంలో మరో రైలు రాకపోవడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని వివరించారు. -
రైలింజన్‌ను పేల్చేసిన మావోయిస్టులు
పార్వతీపురం(విజయనగరం): ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గురువారం అర్థరాత్రి ఒడిశా రాష్ట్రం డోయకల్ రైల్వే స్టేషను వద్దకు చేరుకున్న కొందరు మావోయిస్టులు స్టేషన్‌ను, అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలింజన్‌ను బాంబులతో పేల్చివేశారు. ఈ ఘటనలో సుమారు పాతిక మంది నక్సల్స్ పాల్గొన్నట్టు సమాచారం. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా ఆమార్గంలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్నిటిని దారి మళ్లించారు. -
లారీ ఎక్కిన ‘రైలు ఇంజన్’
చిలమత్తూరు : సుమారు 90 చక్రాల లారీ (హెచ్ఆర్ 55ఎన్ 5511)లో రైలు ఇంజన్ తరలిస్తున్న దృశ్యం కొడికొండ చెక్‌పోస్టు 44వ జాతీయ రహదారిలో గురువారం స్థానికులను ఆక్షరించింది. బెంగళూర్ నుంచి విశాఖపట్నానికి లారీలో రైలు ఇంజిన్ తరలిస్తున్నట్లు డ్రైవర్, క్లీనర్ తెలిపారు. బెంగళూర్ నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది. పరిమిత వేగంతో వెళ్తున్నందున 15 రోజుల తర్వాత విశాఖ రైల్వే అధికారులకు ఇంజన్‌ను అప్పగిస్తామని వారు వివరించారు. -
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
-
'ప్రశాంతి'లో పొగలు: పెద్దఅవుటపల్లిలో నిలిపివేత
విజయవాడ: బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో బుధవారం దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ విషయం గమనించిన ఇంజన్ డ్రైవర్ వెంటనే కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఇంజిన్‌లో పొగలు వ్యాపించడంపై డ్రైవర్, రైల్వే గార్డు విజయవాడలోని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రైల్వే ఉన్నతాధికారులతోపాటు సాంకేతిక సిబ్బంది పెద్దఅవుటపల్లి చేరుకున్నారు. రైలు ఇంజిన్‌లో పొగలు వ్యాపించడానికి గల కారణాలపై సాంకేతిక సిబ్బంది అన్వేషిస్తున్నారు. అయితే రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.