బాడంగి: బోగీలు లేకుండానే ఎక్స్ ప్రెస్ ప్రయాణించించడం స్థానికులలో ఆసక్తిని పెంచగా, రైళ్లోని ప్రయాణికులను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం దొంకినవలస వద్ద చోటుచేసుకుంది. బోగీలను విడిచి ధన్బాద్ - అల్లెప్పఝా బొకారో ఎక్స్ ప్రెస్ ఇంజిన్ రెండు కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లిపోయింది.
బోగీలతో లింక్ తెగిపోవడంతో రైలు ఇంజిన్ మాత్రమే వెళ్లిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజిన్ మాత్రమే వెళ్లడంతో దాదాపు గంటన్నర పాటు బోగీలు అక్కడే నిలిచిపోయాయి. ఆ సమయంలో మరో రైలు రాకపోవడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని వివరించారు.
బోగీలు లేకుండా వెళ్లిన రైలు ఇంజిన్
Published Sun, Sep 3 2017 10:31 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement